అమ్మాయి పెళ్ళి
https://www.gotelugu.com/telugustories/view/10784/ammayi-pelli ఆ అమ్మాయిని చూడగానే చెప్పవచ్చు తన కళ్ళు చాలా బాగున్నాయని.... ఎవరినైనా ఇట్టే అయస్కాంతంలా ఆకర్షించే తన చామనచాయ రూపం, అందానికి నిర్వచనం రంగులో లేదని అమరిన తన కనుముక్కు తీరులో ఉందని. సుద్దముక్కకు ఎక్కడైనా ఆకర్షణ ఉంటుందా. నాకా పొద్దు పోక అలా తీరుబడిగా ఇంటి వసారా లో కూర్చుని వాలే పిట్టలని, ఎకిరే పక్షులని చూడటం అలవాటు. ఆ పాప పొద్దున్నే పావడ ఓణి లో చలాకీగా తను నవ్వుతూ చకచక పనులు చేస్తూ తిరుగుతుంటే చూడముచ్చట వేసేది. మా ఇంటి యజమాని గూర్చి చెప్పకూడదు, కానీ అబ్బో చండశాసనుడు. మండలం కార్యాలయం లో ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడని పేరుకే కానీ, ఎప్పుడూ ఇంటిపట్టునే ఉంటూ భార్యను, బిడ్డను కంటికి రెప్పలా ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటున్నాడు. పొద్దున నిద్దుర లేస్తూనే అమ్మ సరోజా మొక్కలకు నీళ్లు పెట్టమ్మా, అమ్మ కాఫీ పట్టుకు రామ్మ, అమ్మాయి పేపర్ తీసుకురా అమ్మా అని ప్రతి క్షణం తనను కలవరించేవాడు. మరి నా గురించి చెప్పనే లేదు కదూ. నేను ఈ మధ్యనే పీలేరు లోని డిగ్రీ కళాశాల లో జంతుశాస్త్రం లెక్చరర్ గా చేరాను. ఇదిగో ఈ అమ్మాయి సరోజ ఇంట్లో...