నన్ను పిలిచే చల్లటి గాలి
నన్ను పిలిచే చల్లటి గాలి నీ తోడు కొరుకుంటే
కన్నులలో నీ ఊసులు నాకు వినిపిస్తుంటే
నీ కలలన్ని నావి కావా
గలగల నే పలికితే అది నీ మౌనం కాదా
నీ కొంటె మనస్సుని గడ్డిపువ్వుని
అడిగినా చెపుతుంది
నీ గుండె చప్పుడుని చిట్టి పొట్టి చినుకులు
వినిపిస్తుంటే మట్టి కూడా కరిగి మల్లె సుమాలని
వెదజల్లుతూ ఆ మట్టి వాసనకే
మేఘాలు కరిగి అలసి సొలసి ఆకలి తీర్చడానికి
భువికే చేరినట్లు అమ్మకే అమృతంగా మారి
నీ కలత చెందిన మనస్సునే నే చేరనా

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి