కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ
నా ప్రేమ పల్లకి పెళ్ళి వరకు రానే లేదు
ఐతేనేమి ఙ్ఞాపకాలను నేను భారంగా మోసుకొనే తిరుగుతున్నా
సముద్రము పొంగి పొరలి ఒడ్డు ఒరుసుకుపోయినా
ఎదురుచూస్తూనే ఉన్నా బాటసారివి నీవు కావని
చేరువైన చుక్కలు గతాన్ని వెలిగిస్తుంటే
భారమైన బ్రతుకులు చితిమంటలకు ఎగిసిపడుతున్నాయి
అటెటో ఏవ్వరో వేస్తున్న కేక...
కుక్కల అరుపులు రౌద్రంగా
చిక్కటి వెలుగుని మింగేసిన ఒంటి కన్ను రాక్షసుడు చీకటిని చుట్టూ కమ్మేసి
ఎక్కడో నింగినుండి రాలుతున్న తోకచుక్క
నాకు చుక్కానిలా చిన్నప్పుడెప్పుడో
అమ్మ చెప్పిన కథ
కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ...........
తెగువతో ఎదురీదుతున్నా పొంగి పొరలుతున్న వాగు పైపైకి ......
Nice. Hema gaaru:):)
రిప్లయితొలగించండి