నాన్న గారాల కన్నా

 
చిన్నారి చిట్టి తండ్రి  
నాన్న గారాల కన్నా
నీ ముద్దు మురిపాలతో
నాకు ఇంద్రధనుస్సునే చూపావురా కన్నా 
నీ కన్నులలో సూర్య చంద్రుళ్ళనే
నే చూసానురా నాన్న
నీ రతనాల పలుకులతో
నన్ను ఓలలాడించావురా నా చిన్నా 
నీ పలుకులే అమృతపు చినుకులై
నీ ఒడిలో నన్ను లాలిస్తుంటే
మెరుపే మెరిసినా
బూచాడంటూ నన్ను వాటేసుకుంటే 
నా ఒడిలో తల దూర్చి గారాలు పొతూ
నాన్నానన్ను వదలి వెళ్లొద్దంటూ
నడి రేయి నిద్రలోను నన్నే కలవరిస్తుంటే
నాన్నగా నేను
మరుగుజ్జంతటివాడిని 
మహాస్వరూపాన్నే చూపలేనా..
............చిట్టి తండ్రి హర్షిత్ కి ...........     

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ