తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని

https://www.neccheli.com/2023/02/%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b%e0%b0%b7%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a4%e0%b1%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf/
 
సంతోషాన్ని వెతుకుతూ
కొండ కోనలు తిరుగుచూ
ఎక్కడున్నదో తెలియక
ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని   
పబ్బుల్లొ ఉందో మబ్బుల్లొ ఉందో 
తాగే మందులో ఉందో చల్లటి చెట్టునీడలో ఉందో  
మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో
పర్స్ లొ లేకా ప్రేమించే గుండెలోనా
హిమాలయాలలోనే కలియతిరుగుచూ  
కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా
నాకు కొంచం సంతోషాన్ని ఇవ్వమని
విరిసే ప్రతి పువ్వుని అడిగా
దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని
మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని
పొత్తిల్లలో పసిపాపలా పెంచాను నేను దాన్ని
మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలొ
యవ్వనాన ఎదిగేను మహావృక్షంలా  
నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచిపొయెను నేను ఎదిగానని తలచి    
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ