మనసారా నాదైన

 
మా కుట్టి అంటే నాకెంతో ఇష్టం. తన ఆలోచన, నడవడిక  అందరికి  భిన్నంగా ఉండేవి. ఏయ్ కుట్టి అలా వీది చివరవరకు రారా,  అంటే  నేను తన బావనైనా, కాబోయె భర్తనైనా, సారి బావ, ఇటువంటివి నన్ను అడగకు అనేది. నేను తనకు ఎంతో నచ్చచెప్పాలని చూసా, వింటెనా,  నాకు తనతో కలసి నడుస్తూ ఉంటే గాలిలొ తేలిపొయినట్లు ఉండేది.అలా జీవితం చివరవరకు నడవాలని ఉండేది.


కుట్టీ మనం చిలకా గోరింకలా ఉన్నామంటున్నారు నా స్నేహితులు అన్నా ఓ రోజు. "చాల్లే బావా, మనమేమన్న పక్ష్లులమా అలా ఆకాశంలో ఎగిరిపోవడానికి,కొంచెం నేల మీద నడువు బావా,"అన్నది.

నేను తన ఇంట్లో ఉన్నపుడు,నేనేమి అడగకున్న నాకేమేమి ఇష్టమో చేసిపెట్టి కొసరి కొసరి వడ్డించెది. నాకు బిసిబేళ్ బాత్ ఇష్టమని బెంగుళూర్ లో ఉన్న తన స్నేహితురాలిని అడిగి నేర్చుకొని నాకోసం వండిపెట్టింది. నామీద నీకెందుకంత ప్రేమ బంగారు మరదలా అంటే "నువ్వు నా మురళీ మనోహరుడివి బావా"  అనేది.

అలాంటి నేను ఇలా మారిపొయానేంటి ?

వాడెవడో తన వెంటపడుతున్న, తనని ప్రేమించమని పోరుతున్నా, ఆ విషయం తను మా ఎదుట దాచింది. "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని వాడు చెప్పినప్పుడు "నేను నీ ప్రేమని గౌరవిస్తాను కాని నాకు నీ మీద ప్రేమ కలగడం లేదు" అని వాడి ప్రేమని తిరస్కరించిందని వాడు కక్షతో యాసిడ్ క్రుమ్మరించాడు.హాస్పిటల్ లో తను పడుతున్న బాదని నేను చూడలేకపోయాను.మాకొక మాట చెప్పి ఉండొచ్చు కదా అంటే వాడి చదువు,జీవితం నాశనం కాకూడదని అన్నది విరక్తిగా నవ్వుతూ. తనది అంతటి వెన్నెల లాంటి మనస్సు. కాని నా హృదయం  ఎంతటి కఠినమైనది.


మావయ్య వచ్చి ముహుర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అల్లుడూ  అంటే నాకు లండన్ లో ఈ ఆరునెలల ట్రయినింగ్ పూర్తయ్యాక చూద్దాం మావయ్య అని మాట దాటవేశాను. కఠిన క్షణాలలో  మా కుట్టికి తోడుండక పారిపోయాను.   అమ్మానాన్నకు పోన్ చేసేవాడిని ఎలా ఉన్నారు నాన్న అని, డబ్బు ఏమైనా కావాలా అని అడిగేవాడిని కాని నా కుట్టి ఎలా ఉంది నాన్నా అని అడగలేకపోయాను.

మా కుట్టి చదివే క్లాస్ లో మీ భవిష్యత్ లో మీరేమి కావాలనుకొంటున్నరో చెప్పండి అని లెక్చరర్ అడిగినరోజు, ఒకరు డాక్టర్ అని , సైంటిస్ట్ అని, టీచర్  అని, లాయర్ అని ఎన్నో చెప్పినా, మా కుట్టెమ్మ చెప్పిన మాటకి అందరూనిలబడి మెచ్చుకొన్నారు.తను ఒక మంచి బార్య,ఒక మంచి అమ్మ కావాలని ఉంది అని అన్నది. అలాంటి మా కుట్టిని తన మనస్సు చూడక తన ఇప్పటి రూపాన్ని చూసి నేను దూరం చేసుకొంటున్నానా !

అవును, నేను చాలా పెద్ద తప్పు చేసాను.

వెంటనే నాన్నకు పోన్ చేసి "నాన్న నేను రెండు రోజులలో వస్తున్నాను,ముహూర్తం పెట్టించండి"అన్నాను.ఇప్పుడు నా మనస్సు గాలిలో తేలిపొతున్నట్లు ఉంది. నా కుట్టి నా కోసం ఎదురుచూస్తుంటుంది . మీరు మాపెళ్ళికి తప్పక రండి. ఇదే నా ఆహ్వనం.   
 
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ