చీకటి రాత్రి


చీకటి రాత్రి, చిరు
గాలికి వాకిలి తెరచిన చప్పుడు
నీవేనేమోననుకొన్నాను
గుడిగంటల చిరుసవ్వడులు
రాత్రి నైవేద్యము కాబోలు
కర్పూరం సువాసన, ఎటునుండో
పెరటిలో అమ్మ మాటలు
లేగదూడ మొరాయింపులు
ఎందుకో ఈ ఎదురుచూపులు
తెల్లని వెన్నెల మా వాకిట
చెదరిన ఎదువరసల ముత్యాలముగ్గు
దట్టమైన మంచు,
సన్నటి ఈల పాట సందుచివర్లో
చిరుజల్లుల పూల వాన
ఈ తుంపర తుఫానౌతున్నదా
తొలిప్రోద్దునకు సూరీడికెందుకంత తొందర తొందర




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ