దారి తప్పిన కొడుకా..........నన్ను క్షమించు
అప్పుడే తెలతెలవారబోతోంది. సూరిడు రోమాలను నిక్కపొడుచుకొని తొంగి తొంగి మేఘాలను దాటి ముందుకొచ్చి చూస్తున్నాడు. మా మొబైల్ క్లినిక్ తారురోడ్లపై సర్రుమని దూసుకొని పోతున్నది. డెంగు ఫీవర్ తో పల్లెలన్ని గడగాడలాడుతున్నాయని మా మెడికల్ కాలేజి కి ఎన్నెన్నో వినతులు రావడం మూలాన ఫ్రెష్ మేడికోస్ అయిన మమ్ములను ఇలా పల్లెలకి పంపారు. కుర్రకారంతా ఆనందముతో కొత్త సినిమా పాటలకు లయబద్దంగా హం చేస్తూ ఊగుతున్నాము. మా డ్రైవర్ కూడా కుర్రవాడు కావడం మూలాన ఒడుపుగా బండిని పరిగెత్తిస్తున్నాడు. గతవారం నుండి మేము, మా లేడిడాక్టర్స్ రాత్రనక పగలనక పల్లె పల్లెకి మా క్లినిక్ ని తిప్పుతున్నాము. ఉన్నట్లుండి మా డ్రైవర్ గావుకేక పెడుతూ మా వెహికల్ ని ఒక్క కుదుపుతో ఆపాడు. అలా చూద్దుం కదా, ఒక ముసల్ది రోడ్డుమీద ప్రాణం లేనట్లు పడి ఉంది. మాకందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంతపనైంది. మా డ్రైవర్ గావుకేకలు పెడుతూ, ఒక్కసారిగా క్రిందకు దూకి, ఈ ముసల్ది చావడానికి హాస్పిటల్ బండే దొరికిందా అని తిడుతున్నాడు. ఆతను మావైపు చూస్తూ తానెంతో జాగ్రత్తగా బండ...