నేను సముద్రుడనైతే

 (http://vihanga.com/?p=3276)
 
నీవు తీరానివైతే
నా అలలు అలజడులై

నాలోని కోరికలై
సుడులు తిరుగుతూ
ఊ......ప్ మని ఉప్పెనగా సాగి
నీపై మోహంతో
నిన్ను ఒడిసిపట్టుకోవాలని
నిన్ను ఒరుసుకొనిపోతూ
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ
మౌనంగా నీవు నన్ను సహిస్తూ
నాలోని జీవానివి నీవై 
పగలంతా ప్రశాంతతా
రాత్రైతే నీఒడిలో పసిపాపనై
సవ్వడి చేయక ప్రపంచమంతా
నిద్దురలో జోగుతుంటే
నా నెచ్చెలి చెక్కిలిపై చిరుచెమట
కూడా నాకు అమృతమేకదా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ