నిరర్థకమున పండు కాయవునా ..........
రాలిపొయిన పూవు వికశించునా
వాడిన చెట్టు చిగురించునేమో కాని
గడచిన కాలం మరలి వచ్చునా
నీరు ఆవిరై మరుక్షణం మేఘమై
పిల్లతెమ్మెర స్పర్శకే వర్షించును తిరిగి నీరై
కాని మరలిపొయిన గతాన్ని పునఃదర్శించగలమా
విత్తిన నమ్మకం మానై వటవృక్షమై
రెమ్మలకి పూలై పండి తిరిగి విత్తనమై
భవిష్యత్తున నీ దొసిటిని నింపునేమోకాని
నిరర్థకమున పండు కాయవునా ..........
గాలివానకి దూరమైన మట్టిరేణువులు
మరలి వచ్చి తుఫానుగా మారి ఏకమై
సుడిగాలిలా చుట్టి జీవితాన్ని కుదుపేయగలవు
కాని విడిపోవునా కుటుంబంలోని ప్రేమబందాలు
చిగురించగలవు కూలిన వృక్షపు కాండాలు కూడా
కాని పచ్చని పంట పండే భూములపై వేసిన ఇసుక మేట
నమ్మకాన్నే మార్చును బీడుభూమిగా
నశిస్తుంది ప్రేమ కూడా తిరిగి చిగురించక ..........
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి