నాది అనేది శూన్యమని తలస్తూ ............
తన మనస్సులోని జలపాతాలన్ని కళ్ళతో పలికిస్తూ
ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ
నా హృదయలోగిలిలో వెన్నెల జల్లులై కురుస్తూ
సెగలు పొగలు కక్కుతూ సెలయేటి నీటినే తాకుచూ
దివంగాలకావల మేమిరువరము ఏకమైన వేళ
వయస్సు ఉరకలేస్తూ ప్రొద్దువాలుతూ పడమటికి
కాని మనస్సు కోరికలతో తూర్పున
భళ్ళున వెలుగులు పూస్తున్న సూరీనివలే
నా కాష్టం కాలుతున్న చప్పుడులేదు కాని
పరపరా నా గుండెని రంపపు ముళ్ళతో
కోస్తున్న చప్పుడు నాకు కంపరము పుట్టిస్తూ
నా తల్లి ఒడిలో జోలపాడుతూ నన్ను మురిపిస్తుంటే
తన చనుబాలలోనుండీ రాలుతున్న రక్తాశ్రువులు
నా మనస్సుని చల్లారుస్తూ
ఏది జీవితం నాది అనేది
శూన్యమని తలస్తూ ............
పుట్టడమనేది చావటంకోసమని
మరణమనేది నిత్యమని
పుట్టుక మరణం ఆది అంతం లేక సాగిపోవునని
పుట్టడమనేది చావటంకోసమని
మరణమనేది నిత్యమని
పుట్టుక మరణం ఆది అంతం లేక సాగిపోవునని
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి