సవ్వడి


టప టప రాలే చినుకులు
చిటపట లాడే మంటలు
డమ డమమనే ఉరుములూ
తలుక్కుమనే మెరుపులు
సలసల కాగే నీళ్ళు
గల గల పారే సెలయేరు 
చురుక్కుమనే ఎండలు
గాలికి ఊగే ఊడలు
తుర్రుమనే పిట్టలు
గుండె కలుక్కుమనే ఏడ్పులు
చిర్రుబుర్రులాడే మనుషులు
చరచర పాకే పాములు
కేర్ మనే చిన్నారి పాపలు
కలుక్కుమనే పంటికింద రాళ్ళు
ఊప్ మని ఊదే బుడగలు
గడగడ తాగే నీళ్ళు
చెవిలో హోరు
గుండె చప్పుడు
చిటికెల హేళలు
చప్పట్ల హోరు
బ్రేవ్ మని తేపే మనుషులు
కడుపులోని గుడగుడలు
జలజల కారే కన్నీళ్ళు
ఈదురు గాలులు
కిర్రుమనే... కీచురాళ్ళు
కాలిపట్టీల చిరుమువ్వల సవ్వడి  
ప్రకృతే ఒక వింత
సవ్వడి లేనిది ఎక్కడ

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ