పోస్ట్‌లు

సెప్టెంబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

కోరి అల్లుకున్న వరాలు...gotelugu

అది ఒక చిన్న పళ్ళెటూరు. మా పాపాయిలను తీసుకొని నేను, మా అయన ప్రతి వేసవి సెలవులకు ప్రయాణమవుతాము అక్కడకి సరదాగా. అక్కడ మాకోసం ఎదురుచూస్తూ మావయ్య, అత్తయ్య, మరిది, తోడికోడళ్ళు, మరదళ్ళు, వదినమ్మలు, అన్నయ్యలు, బావలు, మేనకొడళ్ళు ఇంకా చాలమంది.  ఆ ఊర్లొ కురుస్తాయి బంధాలు వర్షంలా. మా ఆయన అక్కడ తన తోడళ్ళుళ్ళతో మొదలెడతారు పరుగుపందాలు సరదాగా ఊరినుండి ఆనకట్టవరకు. ఇక మా ఆడాళ్ళకు చేతినిండా పని. లడ్డూలు, మినపుండలు, అత్తిరసాలు, పెరుగువడలు, కారప్పూస, కజ్జికాయలు,  ఎన్నేన్నొ రుచులు.  వేడివేడి అన్నంలొ నేతి ఆవకాయ రుచులతో, ప్రేమపాశాలని జున్నుపాలతో   నంజుకుంటాము మా బంధాలని.  కాలానికి అతీతంగా మా అందరి పరుగులు, పట్నపు వాసాలు, సూర్యోదయం,  సూర్యాస్తమయం ఎరుగక మా పరుగులు, నిద్రలేని రాత్రులు, అన్నిటిని మరచి మేమందరం జరుపుకుంటాము ఎండు వేసవి పండుగని మా అందరి కలయికతో. అందరూ అక్కడ చేరిన వారు బంధం కోరే మా చుట్టాలు. ప్రేమపాశాన్ని ముడివేసుకొన్నవారు. పిల్లల కేరింతలతో, ఆవుదూడల మొరాయిపులతో మొదలౌతుంది మా ఉదయం.  చల్లని ప్రకృతి, చిక్కని బంధాలు. అమ్మా, నాన్న, అత్తయ్య, మావయ్...

ఓ నా మానవి

ఓ నా మానవి ఏమి చెప్పను నీతో నా హృదయపు ఘోష మాట విననంటుందీ నా మనస్సు తిరిగొస్తావోలేదోనని మదురోహాలలో నన్ను ఓలలాడించి నీ కంటికొసలలో నా రూపాన్ని ముద్దాడి చిలిపిగా నవ్వుతూ నన్ను కవ్వించి ఇప్పుడే వస్తానని మరలి వెళ్ళావు నీకై నేను ఎదురుచూస్తూనే ఉన్నా మరుక్షణం నువ్వు వస్తావని   నీ చెంపలపై కురిసే వెన్నెల జల్లులలో  తడిసి మరణిద్దామని   !  

ప్రేమించిన మనస్సు

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10759/preminchina-manassu     "వాసు ఇంకోసారి ఆలోచించు, ఇలా చేయడం మంచిదేనంటావా", ఆ మాట నేను అప్పటికి అడగడం ఏ పదిహేనోసారి అని అనుకొంటా.     "నా ఆలోచన మంచిదే భాస్కర్", అని వాసు జవాబు.   "నువ్వొకసారి ప్రతిమా ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోవడం నేను మంచిదనుకొంటున్నాను. తను మనస్సులో ఏదో దాచుకొని నీతో దగ్గరగా మసలడం లేదని నాకు అనిపిస్తున్నది భాస్కర్".    కాని.......వాసు, ప్రతిమ నేను ప్రేమించే కదా పెళ్లి చేసు కు న్నాం, మరి తను నన్ను ఎందుకు ఇలా దూరం ఉంచుతున్నది. ప్రతిమకు నేనంటే ఎంతో ఇష్టం. తను చక్కగా వంట చేస్తుంది, ప్రేమగా అమ్మ నాన్నలని పలకరిస్తుంది, కానీ ........... నన్ను ఎందుకు తనతో చేరువగా మసలనీయడంలేదని నాకు చాలా బాధగా ఉంది.     "భాస్కర్,  ఈరోజు సాయంత్రం సైకాలజిస్ట్ దగ్గరకు  నీవు ప్రతిమని తీసుకొని వెళ్ళు. నేను  డాక్టర్  గారికి మీ గురించి చెప్పి ఉంచాను" .   మా వాసుకి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం. తను నాకు అక్కే కాదు, ఒక మంచి గైడ్ కూడా. ...

భార్య కన్నీళ్ళు

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10789/bharya-kannellu   మామా ఎందుకు అలా ఉన్నావు, "రాత్రంతా నిద్ర లేనట్టు, ఎర్రటి కళ్ళతో, అచ్చు గడ్డం లేని దేవదాసు లా"' ప్రభు అంటుంటే నేను వాడి వంక చూసాను.   ప్రభు  చెప్పేది నిజమే..... వాడు నిశ్సబ్దంగా తనని కాదన్నట్లు ఎటో చూస్తూ ఏదో ఆలోచనలో మమ్మల్ని దాటి వెళ్ళబోయాడు..... వెంటనే ప్రభు, "పద మామా అలా కాంటీన్ వరకు " అంటూ వాడిని బలవంతంగా లాక్కొని పోతుంటే నేను  కూడా  ప్రభు ని అనుసరించాను.    "చెప్పరా'  అంటూ చాయ్ ఆర్డర్ చేసి వాడిని గద్దించాడు.... ప్రభు మా గ్యాంగ్ లో ఎవ్వరికి ఎటువంటి కష్టం వచ్చినా ఓర్చుకోలేడు. మేమందరము కాలేజ్ రోజులనుండి, ఇప్పటివరకు కలిసే ఉన్నాము. వేరు వేరు కంపెనీలలో పనిచేస్తున్నా  అందరమూ వారానికొకసారైనా కలుస్తుంటాం.....  ప్రభు..... అంటూ వాడి కంట్లో కన్నీళ్లు.  'ఏమైందిరా. ఇంట్లో అందరూ క్షేమమే కదా'....అన్నాను నేను. వాడు తల పైకి ఎత్తి ఒక్కసారి మమ్మల్ని చూసి, " రాత్రి సుసీ నిద్ర మాత్రలు మింగిందిరా, చాలా ఎక్కువగా".... పొద్దున తొందరగా నిద్ర లేవకపోతే, డాక్టర్ దగ్గరకు తీసుకు...

అతను ఎవరు ?

చిత్రం
  https://www.gotelugu.com/telugustories/view/10818/atanu-evaru   ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం అతనే. అతన్ని మరవడమంటే  నన్ను నేను మరవడమే.  అతను నా జీవితములోని ప్రతి మలుపులో నేనున్నానంటూ నన్ను ఆదుకున్నాడు. పాపాయి గా ఉన్నప్పుడు అన్నం తిననని మారాం చేస్తుంటే, నాకు ఎన్నో కథలని చెప్పి నన్ను తన భుజాలపై ఎక్కించుకుని అటూ ఇటూ తిప్పుతూ నన్ను గారం చేస్తూ నాకు అన్నం తినిపించేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత కొడుకు కోసం ఎదురుచూస్తున్న అమ్మకి నేను పుట్టానని అమ్మ విసుక్కుంటుంటే నేనున్నానంటూ నన్ను జోల పాడి నిద్రపుచ్చేవాడు. తనని నేను ఎలా మరువగలను. బామ్మ నన్ను గడుగ్గాయి నని, అల్లరి పిల్లనని తిడుతుంటే, అతను నన్ను, నా అల్లరిని ఓపిగ్గా భరించేవాడు.  కాలేజీకి పంపడం వద్దు, ఇది ఇంటి మీదకు తెచ్చిన తంపులు చాలు, అక్కడకు వెళ్ళి ఇక మన మీదకు ఏ ముసలాన్ని తెస్తుందో అని అమ్మ అన్నదని అత్త తో చెప్పి ఏడుస్తున్నప్పుడు, అమ్మని ఎదిరించి నన్ను పై చదువులకు పంపిన అతను.  నాకు పెళ్లి సంబందాలు  వస్తున్నాయని తెలిసి, మా సీనియర్ డేవిడ్ ని ప్రేమించానని, అతన్నే పెళ్ల...

మై డియర్ పద్మిని

అబ్బాయి ప్రేమ లేఖ ............. మై డియర్ పద్మిని  ఓ సారి నిన్ను చూసాక  రివ్వున తారజువ్వవలే ఎగిరి నిన్నుతాకాలని నీ కలలో నేనే యువరాజునవ్వాలని  నీ స్వయంవరంలో నీవు నన్నే వరించావని నీ రాజ్యనికి నేనే రాజునయ్యానని నీవు నా పాదదాసివయ్యావని అబ్బా ఒకటే కలలు  మరి మన స్వయంవరంబెపుడు ? అమ్మాయి తిరుగు టపా................. మై డియర్ ఆలౌద్దిన్ ఖిల్జీ మన స్వయంబరమేపుడో ఓసారి మా అయన్ని అడిగి చెబుతా నీవు తారాజువ్వవయితే తను త్రాచుపాముని అవుతానంటున్నాడు తన కలలో నీమీద పగబట్టి నిన్ను తన దాసానుదాసుడిని చేసుకుంటానంటున్నాడు మరి నీ జవాబేమిటో ?  

మాది తాళి బందం కాదు -ఏడడుగుల సంబందం

మేమిరువరం ఒక్కటే కాని మాది తాళి బందం కాదు యుగాలుగా కలిసే ఉన్నాము ఒకే గూటిలో  ఆమె నా సహచరి ప్రేమ చివరికంటూ ముగిసేది పెళ్ళితోనయితే మాది మూడుముళ్ళ బందం కాదు పెళ్ళి రెండు హృదయాలని కలిపేదైతే  మాది ఏడడుగుల సంబందం అతను నా సహచరుడు  చేతిలో చేయివేసి ముడుపులు కట్టలేదు మేము  ఒక స్త్రా తో రెండు మనస్సులను కలిపాము మేము బైక్ పై షికార్లు కొట్టలేదు కాని బైండ్ ఓవర్ అయ్యాము ఒకరం మరొకరికి జన్మజన్మలకి ........    

సూరీడి అసుర ప్రేమ

అబ్బా ఏంటది  ఎర్రెర్రగా ఆకాశం  ఎవరైనా తాంబూళం   నమలి నింపారా ఆ నింగిన  పారాణి రాసినట్లు పైపూతలు పెదవుల లిఫ్స్టిక్ సోయగాలు  కనుబొమ్మలు ముడివేసి     రావణాసురిని చూపుతో శాసిస్తున్న ఆ సూరీడు     నింగినంతటిని తన కబంద హస్తాలలో ఇముడ్చుకొని వామనుడి రెండవ అడుగుని విశాల వినీలాకాశంలోని  బ్లాక్ హొల్స్  లోకి నెట్టి వేసి    తన అసుర ప్రేమని ప్రకటిస్తూ......     

ఓ చుక్క రాలింది

ఆ నింగి నుండి ఓ చుక్క రాలింది   మరి కోరుకో ఒక కొరిక  కాలమెటు పయనిస్తేనేమి    కోరికల తీరాలవైపు  సాగాలి మన పయనం సముద్రపు ఆటుపోటుల్లో చెదరిన స్వప్నాలు కళ్ళెదుట  నిలచి నిన్నే వలచి రారమ్మంటూ అలలా కడలిలోకి కదలిపొతుంటే  స్వప్నపు వాకిలి జాడ తెలియక నీవు కడలిలోని నీటి బొట్టువై నిన్ను తనలో ఇముడ్చుకొని ఏమి ఎరుగానివానిలా ఆ సముద్రుడు  నింగి నుండి ఎకదాటిగా కన్నీరు నీ హృదయపు వేదన తెలిసి