మాది తాళి బందం కాదు -ఏడడుగుల సంబందం


మేమిరువరం ఒక్కటే
కాని మాది తాళి బందం కాదు
యుగాలుగా కలిసే ఉన్నాము ఒకే గూటిలో 
ఆమె నా సహచరి

ప్రేమ చివరికంటూ ముగిసేది పెళ్ళితోనయితే
మాది మూడుముళ్ళ బందం కాదు
పెళ్ళి రెండు హృదయాలని కలిపేదైతే 
మాది ఏడడుగుల సంబందం
అతను నా సహచరుడు 
చేతిలో చేయివేసి
ముడుపులు కట్టలేదు మేము 
ఒక స్త్రా తో రెండు మనస్సులను కలిపాము మేము
బైక్ పై షికార్లు కొట్టలేదు
కాని బైండ్ ఓవర్ అయ్యాము
ఒకరం మరొకరికి
జన్మజన్మలకి ........    

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ