కోరి అల్లుకున్న వరాలు...gotelugu

అది ఒక చిన్న పళ్ళెటూరు. మా పాపాయిలను తీసుకొని నేను, మా అయన ప్రతి వేసవి సెలవులకు ప్రయాణమవుతాము అక్కడకి సరదాగా. అక్కడ మాకోసం ఎదురుచూస్తూ మావయ్య, అత్తయ్య, మరిది, తోడికోడళ్ళు, మరదళ్ళు, వదినమ్మలు, అన్నయ్యలు, బావలు, మేనకొడళ్ళు ఇంకా చాలమంది. 

ఆ ఊర్లొ కురుస్తాయి బంధాలు వర్షంలా. మా ఆయన అక్కడ తన తోడళ్ళుళ్ళతో మొదలెడతారు పరుగుపందాలు సరదాగా ఊరినుండి ఆనకట్టవరకు. ఇక మా ఆడాళ్ళకు చేతినిండా పని. లడ్డూలు, మినపుండలు, అత్తిరసాలు, పెరుగువడలు, కారప్పూస, కజ్జికాయలు,  ఎన్నేన్నొ రుచులు.  వేడివేడి అన్నంలొ నేతి ఆవకాయ రుచులతో, ప్రేమపాశాలని జున్నుపాలతో   నంజుకుంటాము మా బంధాలని. 

కాలానికి అతీతంగా మా అందరి పరుగులు, పట్నపు వాసాలు, సూర్యోదయం,  సూర్యాస్తమయం ఎరుగక మా పరుగులు, నిద్రలేని రాత్రులు, అన్నిటిని మరచి మేమందరం జరుపుకుంటాము ఎండు వేసవి పండుగని మా అందరి కలయికతో. అందరూ అక్కడ చేరిన వారు బంధం కోరే మా చుట్టాలు. ప్రేమపాశాన్ని ముడివేసుకొన్నవారు. పిల్లల కేరింతలతో, ఆవుదూడల మొరాయిపులతో మొదలౌతుంది మా ఉదయం. 

చల్లని ప్రకృతి, చిక్కని బంధాలు. అమ్మా, నాన్న, అత్తయ్య, మావయ్య, తాతయ్య, బామ్మలు అంతా కోరి అల్లుకున్న వరాలు. రక్తపాశముతోకాక హృదయపాశముతో ముడి వేసుకొన్న అనురాగాలు, కోరి వచ్చిన దూరతీరాల బంధువులు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ