మై డియర్ పద్మిని


అబ్బాయి ప్రేమ లేఖ .............


మై డియర్ పద్మిని 
ఓ సారి నిన్ను చూసాక 
రివ్వున తారజువ్వవలే ఎగిరి నిన్నుతాకాలని
నీ కలలో నేనే యువరాజునవ్వాలని 
నీ స్వయంవరంలో నీవు నన్నే వరించావని
నీ రాజ్యనికి నేనే రాజునయ్యానని
నీవు నా పాదదాసివయ్యావని
అబ్బా ఒకటే కలలు 
మరి మన స్వయంవరంబెపుడు ?



అమ్మాయి తిరుగు టపా.................


మై డియర్ ఆలౌద్దిన్ ఖిల్జీ
మన స్వయంబరమేపుడో
ఓసారి మా అయన్ని అడిగి చెబుతా
నీవు తారాజువ్వవయితే
తను త్రాచుపాముని అవుతానంటున్నాడు
తన కలలో నీమీద పగబట్టి
నిన్ను తన దాసానుదాసుడిని చేసుకుంటానంటున్నాడు
మరి నీ జవాబేమిటో ?


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ