సూరీడి అసుర ప్రేమ


అబ్బా ఏంటది 
ఎర్రెర్రగా ఆకాశం 
ఎవరైనా తాంబూళం  

నమలి నింపారా ఆ నింగిన 
పారాణి రాసినట్లు పైపూతలు
పెదవుల లిఫ్స్టిక్ సోయగాలు 
కనుబొమ్మలు ముడివేసి    
రావణాసురిని చూపుతో
శాసిస్తున్న ఆ సూరీడు    
నింగినంతటిని తన కబంద
హస్తాలలో ఇముడ్చుకొని
వామనుడి రెండవ అడుగుని
విశాల వినీలాకాశంలోని 
బ్లాక్ హొల్స్  లోకి నెట్టి వేసి   
తన అసుర ప్రేమని ప్రకటిస్తూ......     

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ