పోస్ట్‌లు

జూన్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

చెలికాడ నిదురపోతున్నావా

మనస్సు మదిలో లేదు  అది నీతో దోబూచులాడుతోంది  చెలికాడ నిదురపోతున్నావా   మరపురాని లోకానికి  మరలి పోతున్నావా మదిన నీ సువాసన  నను నీ మమతలను  హృదయాన్నే నింపగా  పెదవులు కంపించి  నినే కలవరిoచంగా  నది ఓ సముద్రముతో  కూడినట్లు  సూర్యుడు ఆకాశాన్ని ముద్దిడినట్లు కంపించిపోతున్నాను నేను  నిలువెల్లా.........   

పండు

పండు అందరు నీవెలా ఉంటావని అడుగుతున్నారు ఒకసారి నా కళ్ళల్లో చూడండి నావాడు కనపడతాడు అన్నాను నిజమేకదా నీ కన్నులలో నేనున్నానని నా కనుసన్నలలో నిన్ను ఆడిస్తున్నానని వీళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు     నీవైన చెప్పవా నేను నీ ప్రేయసినని  దాసినని  నీ దానినని   

రసరాజ్య నాయకుడు

    పండు చూడు ఇలా అలిగావా బుజ్జిని మరచావా అరే అలా వెళ్ళకు నన్ను  నీకు దూరం చేయకు నీ కన్నులలో ఏమిటది  ఆ తడి నన్ను కుదిపేస్తున్నది  నా తలపుని నమ్మవేంటి   నీ నవ్వు చూడక నీ కళ్ళని చూస్తె అందరు నిన్ను అమాయకుడవని తలచేరు కానీ నాకు తెలుసు నీవు రసరాజ్య నాయకుడవని

హృదయం తలుపుతడుతోంది

 హృదయం తలుపుతడుతోంది  నీ రాక కోసం ఎదురుచూస్తూ అనురాగాబందీవై  నీవెక్కడో  ఆమె కడలిని దాచినట్లు పెదవులు చిట్లి  రక్తపు బొట్టుగా మారి  కనురెప్పల మాటున గుండె చిట్లి  రక్తాశ్రువులని రాల్చగా  సన్నటి నవ్వు చిన్నగా మొదలై అది భూమ్యకాశాలని ఏకంచేస్తూ ఎడబాటుని మరవలేక ఆది  అంతంలేని అనురాగాపుచిహ్నంగా

అమృతము కురిసిన రాత్రి

అనురాగముతో  నా పెదవులు నిను పిలుస్తున్నాయి  ఊపిరి లో ఊపిరిగా  నీ దరిని చేరాలని  అమృతము కురిసిన రాత్రి  నక్షత్ర లోకాన్నే మదించాలని  నా కన్నులలో నినే నిలుపుకోవాలని  నీ  పై  నా హృదయాన్ని నిలిపి  అమృతాన్నే గ్రోలాలని  ఓ అమృతపు చినుకై నీవు ... నా నుదిటిన నా ...జీవనపుధారవై  రావా నా ప్రియతమా  

నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగిపోవాలని

        నా నీడ తప్ప నేను నాకు కనిపించడం లేదు నా లోన ఏదో  సందిగ్ధత అది పెరిగి పెద్దదై చివురు నుండి మ్రానుగా తుఫానుగా మారుతుంటే  తుమ్మెదల ఝూoఝూoకారం  నాథoగా నాథాకారంగా లోకాన్నంతా అలుముతుంటే    విషాదమో ఆనందమో  విశదీకరించలేని స్తితి ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి  కన్నులలోకి  జారుతున్న కన్నీళ్ళు  ఏదో తరుముకొస్తున్నట్లు  అంతా వేగంగా కదలిపోతుంటే, ........ఇక్కడే ఒక్క క్షణం  స్తబ్దంగా మిగిలిపోవాలని  మారే కాలాన్నిగుప్పెటన బంధించి నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగిపోవాలని నీ దాహాన్ని తీర్చే నీటి బోట్టునై నీ హృదయాన్ని చేరాలని .......     

చిన్ని జీవితం

ఈ నా చిన్ని జీవితంలో  నీ మాట మృదుమధురము గా  నా హృదయాన్ని ప్రతిక్షణం .....రాగం పలికిస్తూ ఉంటుంది  నీ చూపు ప్రతిక్షణం నాకు  చక్కలిగింతలు  పెడుతూoది   కాని నీ నిరసన వెన్నెలలో ఎండలా..  నన్ను మండిస్తున్నాయి ప్రతిక్షణం నీ కళ్ళలో ప్రతిబింబించే  ఆ మాటల తీక్షణం ?????? ఎడారిలో కురిసిన వానగా   నాలో నన్ను రగిలిస్తున్నాయి  వెన్నెల చల్లనిదేమోనని తాకాను కానీ ఆ వేడిని తాగలేను అందుకే నాకు వెన్నెల వద్దు నువ్వు ............