నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగిపోవాలని
నా నీడ తప్ప
నేను నాకు కనిపించడం లేదు
నా లోన ఏదో సందిగ్ధత
అది పెరిగి పెద్దదై
చివురు నుండి మ్రానుగా
తుఫానుగా మారుతుంటే
తుమ్మెదల ఝూoఝూoకారం
నాథoగా నాథాకారంగా
లోకాన్నంతా అలుముతుంటే
విషాదమో ఆనందమో
విశదీకరించలేని స్తితి
ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి
ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి
కన్నులలోకి జారుతున్న కన్నీళ్ళు
ఏదో తరుముకొస్తున్నట్లు
అంతా వేగంగా కదలిపోతుంటే,
........ఇక్కడే ఒక్క క్షణం
స్తబ్దంగా మిగిలిపోవాలని
మారే కాలాన్నిగుప్పెటన బంధించి
నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగిపోవాలని
నీ దాహాన్ని తీర్చే నీటి బోట్టునై
నీ దాహాన్ని తీర్చే నీటి బోట్టునై
నీ హృదయాన్ని చేరాలని .......
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి