పోస్ట్‌లు

ప్రేమపాశం

    https://www.neccheli.com/2022/12/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%aa%e0%b0%be%e0%b0%b6%e0%b0%82-%e0%b0%95%e0%b0%a5/     మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం. నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను  తాలింపు  పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు. మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను.  అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లో ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము. మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగ...

అభయ హస్తం

  https://sanchika.com/abhaya-hastam-story-dr-bh/ "అమ్మా"...అంటూ నా కూతురు నీల ఇంటి లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చుని ఉన్న నన్ను చూడగానే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలో పడుకుని ఏడవడం మొదలు పెట్టింది...   "ఏమైందమ్మా...చెప్పు! ఏమి జరిగింది" ఆదుర్దగా నేను అడిగా...   అమ్మా మా కాలేజ్ లో ఈ రోజు మా సీనియర్  రఘు అందరి ముందు నా చెయ్యి పట్టుకుని లాగాడు !!! "నేను  వదులు... వదులు".... అంటూ ఉన్నా వినిపించుకోకుండా "నేను నిన్ను   ప్రేమిస్తున్నాను"... "నువ్వు ఒప్పుకోవాలి అంటున్నాడు".....నా కూతురి ఏడుపు చూసి అమ్మగా నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా..... నీల ఏడుస్తూ అంటున్నది "అమ్మా నేను నా వేదన ఎవరికి చెప్పుకోవాలి? అతను మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళే దారి కాసి తన చేతులు అడ్డుపెట్టి మరీ నన్ను ప్రేమించు....అంటున్నాడు" . నా కూతురు పడే బాధని చూసి కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు !!! ఆడపిల్లలకు అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో ! తాకుతారోనని !    నేన...

నిజమైన స్నేహం

  https://www.gotelugu.com/telugustories/view/10867/nijamaina-sneham అమృత గుర్తుకు రాగానే మనస్సంతా తియ్యగా మూలిగింది. అమ్ము తో ముందే పరిచయం అయ్యుంటే ఎంత బాగుండేది. శనివారం బిర్లా మందిర్ కి వెళ్ళడం హైదరాబాద్ వచ్చినప్పటి నుండి అలవాటు. రెండు నెలల క్రితం అలవాటుగా శనివారం బిర్లా మందిర్ వెళ్ళడానికి ఆటో ఎక్కాను. ఆటో నెమ్మదిగానే వెళుతోంది కానీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి. ఆటోలో నా ఆఫీస్ బాగ్ వదలి ఆటో దిగేసాను. ప్రశాంతంగా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని కళ్లు మూసుకుని కూర్చున్నా. నా కళ్ళ ముందు చిటికెల చప్పుడు విని కళ్లు తెరిచి చూసా. అమ్మాయి నన్నే చూస్తూ. నన్నేనా పిలిచింది అని అటూ ఇటూ చూసా. "మిమ్మలేనండి"...అంటూ చిరునవ్వుతో..."ఈ బాగ్ అంది"..."ఓహ్ నాదే"...అంటూ ఆ అమ్మాయి వైపు చూసా...అంత మా లోకం అయితే ఎలాగండి! బాగ్ మర్చిపోయారు. నేను ఆటోలో మీ పక్కనే ఉన్నాను కాబట్టి గమనించాను అంది. థాంక్యూ అని చిరునవ్వు తో అన్నాను. "వట్టి నవ్వేనా ...కాఫీ ఇప్పించండి". నేను తనని ఆశ్చర్యంగా చూస్తున్నా.  కొత్త పాత లేదా ఈమెకు అని. కనీసం పేరు కూడా తెలుసుకోకుండా ఏదో జన్మ జన్...

దారి తప్పిన పడుచు

మా మేనత్త జయమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం... బారెడు జడ...చారెడు కండ్లు...నవ్వుతుంటే పలువరుస నక్షత్రాలను తలపించేది.అందరూ అనేవాళ్ళు నీలమ్మ నీకు మీ మేనత్త పోలికలు వచ్చాయి అని. నాకు దగ్గర ఉండి స్నానం చేపించేది. తలకు నూనె బాగా పట్టించి జడలు వేసేది. నా చిన్నతనంలో అమ్మ దగ్గర కంటే అత్త దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని. రాత్రిళ్ళు కథలు చెప్తూ నిద్రపుచ్చేది. నాకు పూల జడ వేసి మా యమ్మ నీలమ్మ...నీ అందం చందం ఎవ్వరికీ రాదే అంటూ మెటికలు విరుస్తూ దిష్టి తీసేది. చమ్మ  చక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగా ఆరగించంగా ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులేసి రత్నాల చెమ్మ చెక్క రంగులేసి ....అంటూ ఆడుకునేదాన్ని నేను మా అత్తమ్మ ఇద్దరం. గోళీలాట, కబడ్డీ, క్రికెట్, కోకో, ఒకటేమిటి అన్ని ఆటలు ఆడేవాళ్ళము. మా అత్తమ్మ వీధిలో పిల్లలందరిని పోగేసేది ఆటలకు. అప్పటికి మా అమ్మ అరుస్తూ ఉండేది ఏంటే  మీకు మగ  పిల్లల ఆటలు. కొంచెం సద్దుగా ఉండండి అని. మేము వింటేనా... నవ్వుకుంటూ అలాగే అంటూ మా ఆటలు మావి. మా అమ్మ మాటలు ఆమెవి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళము నేను మా అత్త పోటీ పడి. రంగుల ముగ్గులతో మా వీధి ...

బతుకు భయం భయంగా

https://www.gotelugu.com/telugustories/view/10800/batuku-bhayam-bhayamgaa నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ! వద్దా ! వెళ్లితే ఏమౌతుంది! కొడ్తారేమో ! తన జీవితం నాశనం అవుతుంది !!! ఒక జీవితాన్ని నాశనం చేయవచ్చా?...వెళ్లకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలి ! నా వేదనని ఎవరికి చెప్పుకోవాలి? స్పర్శ సుఖాన్ని ఇస్తుందా?లేక దహిస్తుందా? గుండె కాలడమే నాకు తెలుసు! ఆ మంటలో నేను కాలిపోతూ ఉంటే...వాడికి అది సుఖమా? స్పర్శ సుఖాన్ని పొందే మానవ మృగాలు!!! చర్మం కాలుతున్న వాసన వారికి రాదా? వేలకొద్దీ ముల్లులు ఏకకాలంలో వళ్లంతా దిగబడినట్లు ఉంది !!! గునపంతో ఎక్కడో గట్టిగా పొడిచినట్లు ఉంది !! కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు!!! అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో! తాకుతారోనాని! భారతదేశ చట్టాల ప్రకారం, ఒక అమ్మాయి అంగీకారం లేకుండా ఆమెని తాకి భయాన్ని కలిగించినప్పుడు IPC సెక్షన్ 354 A  ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఏడు  సంవత్సరాల వరకు వరకు జైలు శిక్ష ను పొందుతాడు. అలా అని తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో....

మాధవీయం

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10827/maadhaveeyam   జమీందారీ పోయింది!!!  తాతల రాశులు కరిగిపోయాయి!!!   కానీ మా మావయ్య కి తన పొగరు మాత్రం తగ్గలేదు. మిగిలింది పెంకుల ఇల్లు ఒక్కటే.  ఉన్న ఒక్క కొడుకు అదే నా మొగుడు ఆయనకు వారసుడు ఆ పొగరులో.  ఇద్దరూ ఇద్దరే.  మీసాలు తిప్పుకుంటూ బ్రతకడానికి.  పెద్దిల్లు అని మా నాయన నన్ను ఆ ఇంటి కోడలు చేశారు.  ఇల్లేమో పెద్దదే. ఎకరా పైమాటే.   ఇల్లు ఊడ్చాలంటే నడుములు విరగాల్సిందే. ఎక్కడ చూడు రాలే సున్నం, విరిగిన పెంకులకు అతుకులు మా జీవితాలకి లానే.  ఎలా బ్రతుకుతాను నేను అనుకున్నాడో ఏమో ఆ దేవుడు నాకు ఒక దారి చూపెట్టాడు. చిన్నప్పటి నుండి అమ్మ చీరలు అంటే నాకెంతో ఇష్టం. రంగు రంగుల చీరలు నన్ను ఆకర్షించేవి. వాటిని అలా చుట్టుకొని ఇలా దోపుకొని పైన వేసుకుని నడుము క్రింద కుచ్చిళ్ళు తో భుజం పై పైట గా కప్పుకొని కొంగు ముడి వేసుకుని అనందించేదాన్ని... అబ్బో ఎన్నో ఎన్నెన్నో కలలు ఆశలు ఆ చీరలు.  ఆ అందాల చీరల ఆశ నన్ను ఎంతో ఆకర్షించేది. కాలంతో నేను ఎదగడం తో పాటు నా చీరల ఆకర్షణ కూడా ఎదిగింది. ఏ చీర ఎలా కట్టుకోవాలి...

అమృతము కురిసిన రాత్రి

అనురాగముతో  నా పెదవులు నిను పిలుస్తున్నాయి  ఊపిరి లో ఊపిరిగా  నీ దరిని చేరాలని  అమృతము కురిసిన రాత్రి  నక్షత్ర లోకాన్నే మదించాలని  నా కన్నులలో నినే నిలుపుకోవాలని  నీ  పై  నా హృదయాన్ని నిలిపి  అమృతాన్నే గ్రోలాలని  ఓ అమృతపు చినుకై నీవు ... నా నుదిటిన నా ...జీవనపుధారవై  రావా నా ప్రియతమా