పోస్ట్‌లు

january లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మోహపు వల

 (https://www.gotelugu.com/telugustories/view/10924/mohapu-vala)  సెయ్ వసంత... ఇట్న రా బయటకి అంటూ వంటగదిలోకి దడ దడ మంటూ అరుస్తూ నవనీత వచ్చి రాగానే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కోని వచ్చింది నన్ను. ఏమే తొందర నీకు...అంటూ బయటకు రాగానే  నా కళ్ళల్లోకి నవనీత చూస్తూ మోచేతితో పొడిచింది ఇంటి బయట తిన్నె పైన చూడమంటూ. అటు చూద్దును కదా...అక్కడ ఎవరో ఒక బక్కచిక్కిన ఆమె నిండా ముసుగు వేసుకుని కూర్చుని ఉంది మొహమైన కనిపించకుండా... ఎవ్వరా అంటూ నవనీత వైపు చూస్తే, కళ్లతో సైగ చేసింది దగ్గరకు వెళ్లి చూడమంటూ, దగ్గరకు నేను పోయి పోగానే, ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వసంతా అంటూ.. గబాల్న ముసుగు లాగి చూసా. గౌరీ హా గౌరీ ! అంటూ...ఏమ్మేయ్ ఇన్ని రోజులు ఎట్న పోయినావు మే...అని నవనీత వైపు చూసి ఇదెందే ఇట్లాగా అయిపోయిందే... అని నేను ఏడవడం ఎత్తుకున్న. నవనీతం నా దగ్గరగా వచ్చి ముందు లోపలికి పోండెహే బగిస పోతోంది యీదిలో... అని నన్ను పక్కకి లాగి  దాన్ని పైకి లేపింది.  అది బరువు తూకం కాలేక చేతులు నేలకు మోపి లెయ్యలేక లేసిన్ది. చూస్తుంటే గర్భం తో ఉన్న...

నేను సముద్రుడనైతే

 (http://vihanga.com/?p=3276)   నీవు తీరానివైతే నా అలలు అలజడులై నాలోని కోరికలై సుడులు తిరుగుతూ ఊ......ప్ మని ఉప్పెనగా సాగి నీపై మోహంతో నిన్ను ఒడిసిపట్టుకోవాలని నిన్ను ఒరుసుకొనిపోతూ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ మౌనంగా నీవు నన్ను సహిస్తూ నాలోని జీవానివి నీవై  పగలంతా ప్రశాంతతా రాత్రైతే నీఒడిలో పసిపాపనై సవ్వడి చేయక ప్రపంచమంతా నిద్దురలో జోగుతుంటే నా నెచ్చెలి చెక్కిలిపై చిరుచెమట కూడా నాకు అమృతమేకదా

నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ

(https://www.neccheli.com/2023/01/%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%82-%e0%b0%95/)   దప్పికతో ఒయాసిస్సులను వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనకలాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుచున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తిర్చినందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ      నాది నావాళ్ళంటూ  ప్రాణం పొయినా మమకారాన్ని చంపుకోలేక నా అత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు   అమ్మ కడుపున ఊపిరి పొసినందుకు     నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవైనందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ  కడుపు నిండినా మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నాగుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలివై, భార్యవైనందుకు ...

మరుపెంత కావాలి నీ కళ్ళు చూడకుండ ఉండటానికి

( https://sanchika.com/marupenta-kaavali-nee-kallu-choodakundaa-undadaaniki-dr-bh-poem/ )   ఎక్కే రైలు, దిగే బస్సు సాగే నడక అంతా నీ కోసం నా ఆరాటం నీ స్నేహం ఎంతో మాధుర్యమైనదని అది నా హృదయాన్నే నింపినదని  నీకు తెలియనిదేమి మనము మిత్రులమో కానివారమో నాకెరుక లేకపోయనేమి  నిన్ను చూస్తే కంటికెదురుగా వర్షాన్నేచూసినట్లు   మాసిన గాయం మళ్ళీ రేగెనేమి    ఎంత జీవితం చూసానేమి   నాకంత విశాల హృదయం ఉండటానికి    మరుపెంత కావాలి నీ కళ్ళు   చూడకుండ ఉండటానికి కనుసన్నలలొనుండి నీ మోము  నే చూచాను, హృదయం లోని గాయం కరుగగా వర్షించేను మేఘమై