పోస్ట్‌లు

in gotelugu లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మోహపు వల

 (https://www.gotelugu.com/telugustories/view/10924/mohapu-vala)  సెయ్ వసంత... ఇట్న రా బయటకి అంటూ వంటగదిలోకి దడ దడ మంటూ అరుస్తూ నవనీత వచ్చి రాగానే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కోని వచ్చింది నన్ను. ఏమే తొందర నీకు...అంటూ బయటకు రాగానే  నా కళ్ళల్లోకి నవనీత చూస్తూ మోచేతితో పొడిచింది ఇంటి బయట తిన్నె పైన చూడమంటూ. అటు చూద్దును కదా...అక్కడ ఎవరో ఒక బక్కచిక్కిన ఆమె నిండా ముసుగు వేసుకుని కూర్చుని ఉంది మొహమైన కనిపించకుండా... ఎవ్వరా అంటూ నవనీత వైపు చూస్తే, కళ్లతో సైగ చేసింది దగ్గరకు వెళ్లి చూడమంటూ, దగ్గరకు నేను పోయి పోగానే, ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వసంతా అంటూ.. గబాల్న ముసుగు లాగి చూసా. గౌరీ హా గౌరీ ! అంటూ...ఏమ్మేయ్ ఇన్ని రోజులు ఎట్న పోయినావు మే...అని నవనీత వైపు చూసి ఇదెందే ఇట్లాగా అయిపోయిందే... అని నేను ఏడవడం ఎత్తుకున్న. నవనీతం నా దగ్గరగా వచ్చి ముందు లోపలికి పోండెహే బగిస పోతోంది యీదిలో... అని నన్ను పక్కకి లాగి  దాన్ని పైకి లేపింది.  అది బరువు తూకం కాలేక చేతులు నేలకు మోపి లెయ్యలేక లేసిన్ది. చూస్తుంటే గర్భం తో ఉన్న...

నిజమైన స్నేహం

  https://www.gotelugu.com/telugustories/view/10867/nijamaina-sneham అమృత గుర్తుకు రాగానే మనస్సంతా తియ్యగా మూలిగింది. అమ్ము తో ముందే పరిచయం అయ్యుంటే ఎంత బాగుండేది. శనివారం బిర్లా మందిర్ కి వెళ్ళడం హైదరాబాద్ వచ్చినప్పటి నుండి అలవాటు. రెండు నెలల క్రితం అలవాటుగా శనివారం బిర్లా మందిర్ వెళ్ళడానికి ఆటో ఎక్కాను. ఆటో నెమ్మదిగానే వెళుతోంది కానీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి. ఆటోలో నా ఆఫీస్ బాగ్ వదలి ఆటో దిగేసాను. ప్రశాంతంగా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని కళ్లు మూసుకుని కూర్చున్నా. నా కళ్ళ ముందు చిటికెల చప్పుడు విని కళ్లు తెరిచి చూసా. అమ్మాయి నన్నే చూస్తూ. నన్నేనా పిలిచింది అని అటూ ఇటూ చూసా. "మిమ్మలేనండి"...అంటూ చిరునవ్వుతో..."ఈ బాగ్ అంది"..."ఓహ్ నాదే"...అంటూ ఆ అమ్మాయి వైపు చూసా...అంత మా లోకం అయితే ఎలాగండి! బాగ్ మర్చిపోయారు. నేను ఆటోలో మీ పక్కనే ఉన్నాను కాబట్టి గమనించాను అంది. థాంక్యూ అని చిరునవ్వు తో అన్నాను. "వట్టి నవ్వేనా ...కాఫీ ఇప్పించండి". నేను తనని ఆశ్చర్యంగా చూస్తున్నా.  కొత్త పాత లేదా ఈమెకు అని. కనీసం పేరు కూడా తెలుసుకోకుండా ఏదో జన్మ జన్...

బతుకు భయం భయంగా

https://www.gotelugu.com/telugustories/view/10800/batuku-bhayam-bhayamgaa నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ! వద్దా ! వెళ్లితే ఏమౌతుంది! కొడ్తారేమో ! తన జీవితం నాశనం అవుతుంది !!! ఒక జీవితాన్ని నాశనం చేయవచ్చా?...వెళ్లకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలి ! నా వేదనని ఎవరికి చెప్పుకోవాలి? స్పర్శ సుఖాన్ని ఇస్తుందా?లేక దహిస్తుందా? గుండె కాలడమే నాకు తెలుసు! ఆ మంటలో నేను కాలిపోతూ ఉంటే...వాడికి అది సుఖమా? స్పర్శ సుఖాన్ని పొందే మానవ మృగాలు!!! చర్మం కాలుతున్న వాసన వారికి రాదా? వేలకొద్దీ ముల్లులు ఏకకాలంలో వళ్లంతా దిగబడినట్లు ఉంది !!! గునపంతో ఎక్కడో గట్టిగా పొడిచినట్లు ఉంది !! కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు!!! అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో! తాకుతారోనాని! భారతదేశ చట్టాల ప్రకారం, ఒక అమ్మాయి అంగీకారం లేకుండా ఆమెని తాకి భయాన్ని కలిగించినప్పుడు IPC సెక్షన్ 354 A  ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఏడు  సంవత్సరాల వరకు వరకు జైలు శిక్ష ను పొందుతాడు. అలా అని తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో....

మాధవీయం

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10827/maadhaveeyam   జమీందారీ పోయింది!!!  తాతల రాశులు కరిగిపోయాయి!!!   కానీ మా మావయ్య కి తన పొగరు మాత్రం తగ్గలేదు. మిగిలింది పెంకుల ఇల్లు ఒక్కటే.  ఉన్న ఒక్క కొడుకు అదే నా మొగుడు ఆయనకు వారసుడు ఆ పొగరులో.  ఇద్దరూ ఇద్దరే.  మీసాలు తిప్పుకుంటూ బ్రతకడానికి.  పెద్దిల్లు అని మా నాయన నన్ను ఆ ఇంటి కోడలు చేశారు.  ఇల్లేమో పెద్దదే. ఎకరా పైమాటే.   ఇల్లు ఊడ్చాలంటే నడుములు విరగాల్సిందే. ఎక్కడ చూడు రాలే సున్నం, విరిగిన పెంకులకు అతుకులు మా జీవితాలకి లానే.  ఎలా బ్రతుకుతాను నేను అనుకున్నాడో ఏమో ఆ దేవుడు నాకు ఒక దారి చూపెట్టాడు. చిన్నప్పటి నుండి అమ్మ చీరలు అంటే నాకెంతో ఇష్టం. రంగు రంగుల చీరలు నన్ను ఆకర్షించేవి. వాటిని అలా చుట్టుకొని ఇలా దోపుకొని పైన వేసుకుని నడుము క్రింద కుచ్చిళ్ళు తో భుజం పై పైట గా కప్పుకొని కొంగు ముడి వేసుకుని అనందించేదాన్ని... అబ్బో ఎన్నో ఎన్నెన్నో కలలు ఆశలు ఆ చీరలు.  ఆ అందాల చీరల ఆశ నన్ను ఎంతో ఆకర్షించేది. కాలంతో నేను ఎదగడం తో పాటు నా చీరల ఆకర్షణ కూడా ఎదిగింది. ఏ చీర ఎలా కట్టుకోవాలి...

కల్కి

https://www.gotelugu.com/telugustories/view/10718/kalki అమ్మ చెప్పిందని హాస్టల్లో చేరా కాని సుతరాం  నాకు ఇష్టం  లేదు  అమ్మని వదలివెళ్ళడం వంటరిగా ఆ చీకటి హాస్టల్లోకి ......హాస్టల్లో చాలామంది నా స్నేహితులు పల్లేటూరిలో చదువులు బాగా లేవని అక్కడ చేరినవారే. ఇంకొందరు నాన్ లోకల్  అయిపోతే.....  ఎంసెట్ లో సీట్ రాదని....  నార్త్ లో ఉజ్జొగం చేస్తున్నవారు వాళ్ళ పిల్లలని అక్కడ వదిలిపెట్టారు. నన్నోరోజు మా కెమిస్ట్రీ టీచర్ అడిగారు  నిన్ను ఇక్కడ చేర్చింది ఎవ్వరని. నేనన్నాను అమ్మని. చాలా ఆశ్చర్యంగా ఉంది !!!!! ఇంట్లో చిన్నవాళ్ళ అల్లరి భరించలేక కొద్దిరోజులైనా ఉండని క్రమశిక్షణ అబ్బుతుందని   చేర్పించే నాన్నలని.....  చూసా కాని ఇలా బంగారు బొమ్మలాంటి .....  నిన్ను ఇక్కడ చేర్చిన అమ్మని ఇప్పుడే చూస్తున్నా అన్నారు. అందరి మద్య ఉన్నా చాలా ఏడుపు వచ్చేది అమ్మని మిస్సయ్యానని...  నువ్వు నా గారాలపట్టివి అంటూ అమ్మ చెప్పే కథలు  చెల్లెలితో...  నా ఆటలు అన్నీ బంద్ అయ్యాయి. దుఖంతో ఒకచోట మౌనంగా నాలో నేను ముడుచుకొని కూర్చునేదాన్ని. అమ్మ ఆ రోజు ఫొన్లో ది...

కలల సౌధాలు

https://www.gotelugu.com/telugustories/view/10796/kalala-soudhalu     అతను ..... నాతో అంటున్న మాటలు వినలేక రెండు చెవులు చిల్లులు పడుతున్నాయి నాకు. ఎన్నెన్ని కలలు కన్నాను నేను ,  నా వాడు నా కలల రాకుమారుడు నేనే ప్రాణమంటూ నన్ను ఏలుకొంటాడని.... నా కలల సౌధాలన్నీ పేకమెడల్లా  కూలిపోతున్నాయి. కాదు కాదు నేనే.....దానికి కారణం. నా ఉద్యోగప్రయత్నాలని చూసి  నాన్న ముందు పెళ్ళి చేసుకో అమ్మా... చాలా మంచి సంబంధం... ఆ అబ్బాయి నిన్ను మీ అక్క పెళ్ళిలో చూసినప్పటి నుండి మాటలు జరుగుతున్నాయి....  అంటుంటే పల్లెటూరి చాధస్తాలని వాళ్ళని లెక్కచేయక ఉద్యొగంలో చేరా.... ఆ రోజు మొదటి జీతం తీసుకొన్న రోజు ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు సంతోషంతో ఉప్పొంగా. నా వర్క్ నేచుర్ చూసి ఆరు నెలలైనా  కాలేదు.... కాని ఈ అమ్మాయి ప్రొగ్రామ్మింగ్ అద్బుతం... అంటూ తన సత్తా చాటింది.......అని  పొగుడుతూ నన్ను విదేశాలలోని మా బ్రాంచ్ కి  రెకమ్మండ్ చేసినప్పుడు...సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవ్వుతూ....మా స్టాఫ్  పార్టీ ఇవ్వమంటుంటే అందరి తో కలసి డిస్కో కి వెళ్ళా....అతిగా మద్యం తాగి  అలవాటులేని తప్పు తో  అ...

దీక్ష

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10762/deeksha       ఆ రోజు మా స్కూల్ ఎంతో కళకళలాడుతోంది. పిల్లలందరూ సంతోషముతో తుళ్ళి పడుతూ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హాజరవుతూ ఉన్నారు. అన్ని రోజుల మా కష్టాన్ని పిల్లల ఆనందముతో మరచిపోయాము. ముఖ్య అతిథిగా మా ఊరి నుంచి మినిస్టర్ గా ఎన్నికయిన ఎం.ఎల్.ఏ ని పిలుద్దామని మా హెడ్మాస్టర్ ని ఎంతో ప్రాధేయపడ్డాము. ఆయన ఓ పట్టాన ఒప్పుకోలేదు. మా స్కూల్ ఒకప్పటి ఓల్డ్ స్టూడెంట్ ప్రస్తుత  త్రోబాల్ ఛాంపియన్ అయిన సదాశివాన్ని పిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. మినిస్టర్ చేతుల మీదుగా అతనికి సన్మానం చేయాలని నిర్ణయించారు.  ఆయన నిర్ణయాన్ని మేము హర్షించ లేకపోయినా, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ, ఆహ్వాన పత్రిక ముద్రించడం దగ్గరనుండి, స్కూల్ ఫంక్షన్ కి స్పాన్సర్స్ ని వెతకడం వరకు అన్నీ మేము ముందుండి చూసుకున్నాము. మాకు మా హెడ్మాస్టర్ మీద ఎంతో గౌరవం మరియు నమ్మకమూను. ఆయన స్వతహాగా చాలా మితభాషి. కానీ న్యూ టీచింగ్ మెథడ్స్ ద్వారా పిల్లలకు పాఠాలను బొధించడాన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు. స్కూల్లో పిల్లలను ఎంతో ప్రేమగా చూసేవార...

ద్రౌపతి పుత్రులు

చిత్రం
  https://www.gotelugu.com/telugustories/view/10691/droupati-putrulu   మార్నింగ్ నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు దుబాయి పోలిస్ నుండి నాకు కాల్ వచ్చింది. ఎంతో విశిస్టమైన విషయమని తొందరగా రమ్మని చెప్పడంతో నాకు విలేఖరి గా బారతీయ రాయబారితో సమావేశం ఉన్నా, నేను ఒక గంట ఆగి వస్తానని వెంటనే మెస్సేజ్ పంపి దుబాయి పొలిస్ టవర్ కి వెళ్ళా.  నన్ను చూడగానే ఎంతో గౌరవంగా విష్ చేసిన దుబాయి ముఖ్య పోలిస్ అధికారి తనతో తీసుకొనివెళ్ళి ఒక బారతీయ కుటుంబాన్ని నాకు పరిచయం చేసాడు. తన మాటలలొ సంగ్రహముగా ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళనుండి ఎటువంటి విసా పత్రాలు లేకుండానే వారి దేశాన నివసిస్తున్నారని చెప్తూ వారిని చూపించాడు. అక్కడ ముక్కు పచ్చాలారని పసిపిల్లలు దుబాయి సేఠ్ దుస్తులలో , వారితో వాళ్ళ తల్లి. అతని మాటలలొ ఆ కుటుంబాన్ని ఇండియా పంపడానికి ఆమ్నేస్టి ముందుకు వచ్చిందని కాని వారికి ఎటువంటి జన్మ ద్రువ పత్రాలు కాని, విసా కాని, పాస్ పోర్ట్ కాని లేదని, వారిని వారి దేశానికి ఎలా పంపాలొ తెలియడంలేదని చెప్తూ వారి తల్లి ఆ పిల్లలని తన పిల్లలని ఒప్పుకోవడంలేదని, ఈ ఇస్స్యు తనకి చాల తలనొప్పి కలిగిస్తున్నదని, ఒకసారి నన్ను వారిత...

ప్రేమించిన మనస్సు

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10759/preminchina-manassu     "వాసు ఇంకోసారి ఆలోచించు, ఇలా చేయడం మంచిదేనంటావా", ఆ మాట నేను అప్పటికి అడగడం ఏ పదిహేనోసారి అని అనుకొంటా.     "నా ఆలోచన మంచిదే భాస్కర్", అని వాసు జవాబు.   "నువ్వొకసారి ప్రతిమా ని సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుపోవడం నేను మంచిదనుకొంటున్నాను. తను మనస్సులో ఏదో దాచుకొని నీతో దగ్గరగా మసలడం లేదని నాకు అనిపిస్తున్నది భాస్కర్".    కాని.......వాసు, ప్రతిమ నేను ప్రేమించే కదా పెళ్లి చేసు కు న్నాం, మరి తను నన్ను ఎందుకు ఇలా దూరం ఉంచుతున్నది. ప్రతిమకు నేనంటే ఎంతో ఇష్టం. తను చక్కగా వంట చేస్తుంది, ప్రేమగా అమ్మ నాన్నలని పలకరిస్తుంది, కానీ ........... నన్ను ఎందుకు తనతో చేరువగా మసలనీయడంలేదని నాకు చాలా బాధగా ఉంది.     "భాస్కర్,  ఈరోజు సాయంత్రం సైకాలజిస్ట్ దగ్గరకు  నీవు ప్రతిమని తీసుకొని వెళ్ళు. నేను  డాక్టర్  గారికి మీ గురించి చెప్పి ఉంచాను" .   మా వాసుకి తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం. తను నాకు అక్కే కాదు, ఒక మంచి గైడ్ కూడా. ...

భార్య కన్నీళ్ళు

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10789/bharya-kannellu   మామా ఎందుకు అలా ఉన్నావు, "రాత్రంతా నిద్ర లేనట్టు, ఎర్రటి కళ్ళతో, అచ్చు గడ్డం లేని దేవదాసు లా"' ప్రభు అంటుంటే నేను వాడి వంక చూసాను.   ప్రభు  చెప్పేది నిజమే..... వాడు నిశ్సబ్దంగా తనని కాదన్నట్లు ఎటో చూస్తూ ఏదో ఆలోచనలో మమ్మల్ని దాటి వెళ్ళబోయాడు..... వెంటనే ప్రభు, "పద మామా అలా కాంటీన్ వరకు " అంటూ వాడిని బలవంతంగా లాక్కొని పోతుంటే నేను  కూడా  ప్రభు ని అనుసరించాను.    "చెప్పరా'  అంటూ చాయ్ ఆర్డర్ చేసి వాడిని గద్దించాడు.... ప్రభు మా గ్యాంగ్ లో ఎవ్వరికి ఎటువంటి కష్టం వచ్చినా ఓర్చుకోలేడు. మేమందరము కాలేజ్ రోజులనుండి, ఇప్పటివరకు కలిసే ఉన్నాము. వేరు వేరు కంపెనీలలో పనిచేస్తున్నా  అందరమూ వారానికొకసారైనా కలుస్తుంటాం.....  ప్రభు..... అంటూ వాడి కంట్లో కన్నీళ్లు.  'ఏమైందిరా. ఇంట్లో అందరూ క్షేమమే కదా'....అన్నాను నేను. వాడు తల పైకి ఎత్తి ఒక్కసారి మమ్మల్ని చూసి, " రాత్రి సుసీ నిద్ర మాత్రలు మింగిందిరా, చాలా ఎక్కువగా".... పొద్దున తొందరగా నిద్ర లేవకపోతే, డాక్టర్ దగ్గరకు తీసుకు...

అతను ఎవరు ?

చిత్రం
  https://www.gotelugu.com/telugustories/view/10818/atanu-evaru   ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం అతనే. అతన్ని మరవడమంటే  నన్ను నేను మరవడమే.  అతను నా జీవితములోని ప్రతి మలుపులో నేనున్నానంటూ నన్ను ఆదుకున్నాడు. పాపాయి గా ఉన్నప్పుడు అన్నం తిననని మారాం చేస్తుంటే, నాకు ఎన్నో కథలని చెప్పి నన్ను తన భుజాలపై ఎక్కించుకుని అటూ ఇటూ తిప్పుతూ నన్ను గారం చేస్తూ నాకు అన్నం తినిపించేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత కొడుకు కోసం ఎదురుచూస్తున్న అమ్మకి నేను పుట్టానని అమ్మ విసుక్కుంటుంటే నేనున్నానంటూ నన్ను జోల పాడి నిద్రపుచ్చేవాడు. తనని నేను ఎలా మరువగలను. బామ్మ నన్ను గడుగ్గాయి నని, అల్లరి పిల్లనని తిడుతుంటే, అతను నన్ను, నా అల్లరిని ఓపిగ్గా భరించేవాడు.  కాలేజీకి పంపడం వద్దు, ఇది ఇంటి మీదకు తెచ్చిన తంపులు చాలు, అక్కడకు వెళ్ళి ఇక మన మీదకు ఏ ముసలాన్ని తెస్తుందో అని అమ్మ అన్నదని అత్త తో చెప్పి ఏడుస్తున్నప్పుడు, అమ్మని ఎదిరించి నన్ను పై చదువులకు పంపిన అతను.  నాకు పెళ్లి సంబందాలు  వస్తున్నాయని తెలిసి, మా సీనియర్ డేవిడ్ ని ప్రేమించానని, అతన్నే పెళ్ల...

అమ్మాయి పెళ్ళి

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10784/ammayi-pelli ఆ అమ్మాయిని చూడగానే చెప్పవచ్చు తన కళ్ళు చాలా బాగున్నాయని.... ఎవరినైనా ఇట్టే అయస్కాంతంలా ఆకర్షించే తన చామనచాయ రూపం, అందానికి నిర్వచనం రంగులో లేదని అమరిన తన కనుముక్కు తీరులో ఉందని. సుద్దముక్కకు ఎక్కడైనా ఆకర్షణ ఉంటుందా. నాకా పొద్దు పోక అలా తీరుబడిగా ఇంటి వసారా లో కూర్చుని వాలే పిట్టలని, ఎకిరే పక్షులని చూడటం అలవాటు. ఆ పాప పొద్దున్నే పావడ ఓణి లో చలాకీగా తను నవ్వుతూ చకచక పనులు చేస్తూ తిరుగుతుంటే చూడముచ్చట వేసేది. మా ఇంటి యజమాని గూర్చి చెప్పకూడదు, కానీ అబ్బో చండశాసనుడు. మండలం కార్యాలయం లో ఏదో ఉద్యోగం  వెలగబెడుతున్నాడని పేరుకే కానీ, ఎప్పుడూ ఇంటిపట్టునే ఉంటూ భార్యను, బిడ్డను కంటికి రెప్పలా ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటున్నాడు. పొద్దున నిద్దుర లేస్తూనే అమ్మ సరోజా మొక్కలకు నీళ్లు పెట్టమ్మా, అమ్మ కాఫీ పట్టుకు రామ్మ, అమ్మాయి పేపర్ తీసుకురా అమ్మా అని ప్రతి క్షణం తనను కలవరించేవాడు. మరి నా గురించి చెప్పనే లేదు కదూ. నేను ఈ మధ్యనే పీలేరు లోని డిగ్రీ కళాశాల లో జంతుశాస్త్రం లెక్చరర్ గా చేరాను. ఇదిగో ఈ అమ్మాయి సరోజ ఇంట్లో...

మనసారా నాదైన

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10775/manasara-naadaina     మా కుట్టి అంటే నాకెంతో ఇష్టం. తన ఆలోచన, నడవడిక  అందరికి  భిన్నంగా ఉండేవి. ఏయ్ కుట్టి అలా వీది చివరవరకు రారా,  అంటే  నేను తన బావనైనా, కాబోయె భర్తనైనా, సారి బావ, ఇటువంటివి నన్ను అడగకు అనేది. నేను తనకు ఎంతో నచ్చచెప్పాలని చూసా, వింటెనా,  నాకు తనతో కలసి నడుస్తూ ఉంటే గాలిలొ తేలిపొయినట్లు ఉండేది.అలా జీవితం చివరవరకు నడవాలని ఉండేది. కుట్టీ మనం చిలకా గోరింకలా ఉన్నామంటున్నారు నా స్నేహితులు అన్నా ఓ రోజు. "చాల్లే బావా,  మనమేమన్న పక్ష్లులమా అలా ఆకాశంలో ఎగిరిపోవడానికి,కొంచెం నేల మీద నడువు బావా,"అన్నది. నేను తన ఇంట్లో ఉన్నపుడు,నేనేమి అడగకున్న నాకేమేమి ఇష్టమో చేసిపెట్టి కొసరి కొసరి వడ్డించెది.  నాకు బిసిబేళ్ బాత్ ఇష్టమని బెంగుళూర్ లో ఉన్న తన స్నేహితురాలిని అడిగి నేర్చుకొని నాకోసం వండిపెట్టింది. నామీద నీకెందుకంత ప్రేమ బంగారు మరదలా అంటే "నువ్వు నా మురళీ మనోహరుడివి బావా"  అనేది. అలాంటి నేను ఇలా మారిపొయానేంటి ? వాడెవడో తన వెంటపడుతున్న, తనని ప్రేమించమని పోరుతున్నా, ఆ విషయం తను ...

మూడు తరాల కథ

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10725/moodu-tarala-katha      "వద్దు వద్దంటే మెడ గట్టినారు పెద్ద ఎద్దంటి పెళ్ళాన్ని కూర్చుంటే గుంజిల్లు లేస్తే మెడిగాల్లు అబ్బో అది ఆలి కాదు ఎర్రతేలు " అని మా తాత అనేవాడని మా అమ్మమ్మ చెప్పేది. పుణ్యాత్ముడు మా తాత ఏ లోకాన ఉన్నాడో గాని  మా అవ్వ ఇప్పటికి "బెత్తెడు మనిషి జానెడు బుద్ది"  అంటూ  ఆయన చమత్కారాలని తలస్తూనే ఉంది. తాత ఈ లోకానికి టాటా చేప్పెసి ఐదు దశాబ్దాలు దాటింది. అమ్మమ్మ నవదశకాన్ని పూర్థి చేసింది. అమ్మమ్మ తోటి ప్రయాణీకులందరూ కాలగతిన కలసిపోయారు. మా అవ్వని నలుగురు పిల్లల తల్లిని చేసి ఆయన బాద్యతలు తీసుకోక "డబ్బు మిథ్య"  అంటూ "కలగంటి కలగంటి నేను కమలాక్షునయనాలను కలగంటి" అంటూ జీవితాన్ని కీర్తనలతో గడిపేశాడు. ఆమె నలుగురు పిల్లలలో మా అమ్మ ఒక్కతి.   మా మావయ్య పెళ్ళి :.................... మా అమ్మమ్మ కుటుంబంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా పెద్ద మావయ్య గురించి.  ఆయన ఒక రాబిన్ హూడ్ లా ఫీల్ అయ్యేవాడు. ఇంట్లొ ఉన్న బియ్యము పప్పులు అన్నీ ఎవరైనా వచ్చి బియ్యం నిండుకున్నాయి అంటే చాలు ఇచ్చేసేవాడ...