పోస్ట్‌లు

published కవితలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

కొంగ్రొత్త వేకువకై ప్రేమతో .......

   https://sanchika.com/kogrotta-vekuvakai-premato-dr-bh-poem/     నువ్వు ఎవ్వరినైనా ప్రేమిస్తున్నప్పుడు అలా.........ప్రేమిస్తున్నావని చెప్పక దాచడం అది ప్రేమకు ఉరి లాంటిదేనని నీకు తెలుసా ప్రియతమా.....కృష్ణా నువ్వు చెప్పావని ఆ ప్రేమ కరిగి నీదౌతుందని కోరుకోవడం తప్పేనని నీకు తెలియదా రాధా!!!      అమావాస్యనాడు వెన్నెల లేదని  వెన్నెలకాడు పౌర్ణమినాట తిరిగిరాడని నీవు నాతో గిల్లికజ్జలెట్టుకొని చెప్పడం నీకు తగునా కన్నయ్యా... నీ హృదయాన్ని  పరిచి నువ్వు స్వాగతించినప్పుడు నిన్ను తృణీకరించి కొంగ్రొత్త వెలుగులపై నే పయనిస్తుంటే బిడుస్సువారిన మనస్సు పై నీకెందుకు వలపు ప్రియ.....  రాధా ... ఓ నా మనోహరిణి నక్షత్రపు వెలుగులు నాకై వేచిఉన్నాయని     తృణీకరింపు  సెగలను తుడిచివేసి   కొంగ్రొత్త వేకువకై  ప్రేమతో ఎదురు చూస్తా యుగాన్తందాటి నా చెలికాడా ............ నల్లనయ్యా !!!!

వలపు తాడో పలుపు తాడో తెలియక

చిత్రం
https://www.koumudi.net/Monthly/2022/october/index.html       నన్ను నేను తప్పించుకొని తిరుగుతున్నాను ఎండనక వాననక పగలనక రేయనక కంటిచూపు మేరలో కానరాలా ఎవ్వరూ అయినా ఎందుకో భయం గుప్పెట్లో చిన్న చిరు చప్పుడుకే తత్తర బిత్తర పడి కాళ్ళ గజ్జలు ఎక్కడ చప్పుడు చేస్తాయోనని అడుగు తీసి అడుగు వేస్తూ అర మైలు దూరం నడిచినంతలోనే అలుపు తీర్చుకొంటూ వగరొస్తూ సెగలు పొస్తూ భయం గుప్పెట్లో నేను కానరాని కారడివా అంటే కానే కాదు ఘాండ్రించే పులులు పాకే పురుగులు తిరిగే నడవా కాదు నరబలులు కోరే నేర ప్రపంచం రక్తాన్ని పీల్చే నరలోకం ఎవ్వరు మన పురుషులో ఎవ్వరు పరపురుషులో తెలియని మాయ లోకం వలపు తాడో పలుపు తాడో తెలియక అమాయకపు బిత్తర చూపులతో చిత్తడి నేలపై వెనుదిరిగి చూస్తూ ముందడుగు వేసి వేయలేక పక్కల చూస్తూ రాబందువుల భయంతో నేను  !!!!      

వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా

చిత్రం
http://100.26.73.229/nee-gnaapakam-oonaadu-dr-bh-poem/      నీ ఙ్ఞాపకం ఓనాడు మంటలా మండుతుంటే ఈనాడు నీ ఙ్ఞాపకం స్మృతిలా వెలుగునిస్తోంది వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా నా హృదయం నీ పరమైంది నీ హృదయం నాకు వలైంది వదలనంటోంది ఒక్క క్షణం నాదో లోకం నీదో లోకం     మేఘుని ఉరుముకి చంద్రుని అలక కంటిపై కనుపాప అలక పాయల్ పై పాదం అలక కృష్ణునిపై రాధ అలక   ..ప్రియా నీ పై నా అలక..      

నమ్ముతారా మీరైనా

https://sanchika.com/nammutaaraa-meerainaa-dr-bh-poem/     ఎంతో ప్రేమగా పెంచిన పూల తోట నన్ను కాదని వెళ్ళింది ఇక ఎదురుగా కనిపిస్తూ నన్ను ఎంతో వేదనకి గురిచేస్తూ......... నన్ను కాదని అంటూనే నా వైపు పూల నవ్వులు విసురుతూ ... అవి రవ్వలు పుట్టిస్తూ నా గుండెన రాదని తెలిసి కాదనుకోలేక ఔననికూడ అది నాదని అనుకోలేక ఆకాశాన్ని అంటిన దుమ్ము దులుపుతూ నేను అంతలా ఆక్రోశించా ప్రియా.......రా..........రమ్మని నమ్ముతారా మీరైనా !!! ఆ పూలతోట నాదని ??????

నీవు నా ఙ్ఞాపికవి

చిత్రం
http://100.26.73.229/neevu-naa-gnaapikavi-dr-bh-poem/     నీవు నా ఙ్ఞాపికవి  ఇసుక తిన్నులపై నా అడుగుల చప్పుడిని అలల సవ్వడులతో కలిపి నా స్వప్నావస్థలో నుండి  సుప్థావస్తలోనికి మోసుకొచ్చిన  నా ఙ్ఞాపికవి   కాలం చిరుగులో దుఃఖపు తెరలు వినిపిస్తుంటే నీకు నేను తోడున్నానన్నపుడు  నీవో  ఙ్ఞాపికవి పచ్చదనపు చీర చెరుగులో వెచ్చదనపు నీ కౌగిలి జోల పాడుతూ నన్ను మైమరిపించడం నా ఙ్ఞాపకం   అత్తవారింట అడుగు పెట్టినప్పుడు అంతా కొత్తగా అవరోహణంలో జీవిస్తున్నప్పుడు నా కడుపున నీవో ఙ్ఞాపికవి  వస్తూ వంటరిగా వస్తాము తిరిగి వెళ్ళుతూ వంటరిగా వెళతామని నీకు నీవే తోడని  నీవన్నప్పుడు నీవో ఙ్ఞాపికవి అద్దాన మోము చూసినప్పుడు కంటి క్రింద చారలు కరుగుతున్న యవ్వనానికి ఓ ఙ్ఞాపిక   ఆశ నిరాశల మధ్య తప్పొప్పుల గెలుపోటములతో సాగుతున్న జీవితంపై తృష్ణ నా  ఙ్ఞాపిక ...........            

వళ్ళంతా నెమలికన్నులతో ప్రియా.............ఎదురుచూపులు

https://sanchika.com/ollanta-nemalikannulato-dr-bh-poem/   వళ్ళంతా నెమలికన్నులతో ప్రియా.............ఎదురుచూపులు ప్రేమంటే వలపంటే ప్రేమంటే మోహమైతే నా తలపుల తలుపులు తీసి నీకోసం నే చూస్తున్నా  కళ్ళళ్ళో వత్తులు వేసి నా జీవనజ్యోతిని ఆరనీయక నిలిపి వలపు తీపి వడలంతా పాకి కుదురుగా నన్ను నిలవనీయక నీ చెంత నిలచి కావి వైరాగ్యముతో నీవు నా వరసంపదవనీ  నీవే నా అష్టైశ్వర్యాలవనీ   నీ తలపులే నా కీర్తిసంపదలనీ ఈ లోకానికంతా నేచాటాలని    నేను సన్యసిస్తున్నా .... భావి జీవితాన్ని....

ఆరాధన

    చిన్న చిరు సవ్వడి నడిరేయినా మనస్సు ఉలిక్కిపాటును అణచుకోలేక తత్తరపడి తొందరపెట్టి తలదిండుగా పెట్టుకొన్న అరచేయిని గుండెలపైన ఉన్న చేయితో కలపి కన్నుల మబ్బుల తెరలను తొలగిస్తూ కిటికీ తెరచాటున నిలబడి నా నీడని చూసి నేనే ఉలిక్కిపడి నన్ను తలచిన వారిని తలస్తూ ఎవ్వరో ఎప్పుడో నాకు పంపిన మేఘసందేశాన్ని తీరికచేసుకొని ఈవేళ మేఘుడు నాకు వినిపిస్తుంటే ఆరాధన లోని అమృతాన్ని ఆస్వాదిస్తూ కన్నా వినిపిస్తుందా నా ఈ ఆలాపన ..........          

నేను సముద్రుడనైతే

 (http://vihanga.com/?p=3276)   నీవు తీరానివైతే నా అలలు అలజడులై నాలోని కోరికలై సుడులు తిరుగుతూ ఊ......ప్ మని ఉప్పెనగా సాగి నీపై మోహంతో నిన్ను ఒడిసిపట్టుకోవాలని నిన్ను ఒరుసుకొనిపోతూ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ మౌనంగా నీవు నన్ను సహిస్తూ నాలోని జీవానివి నీవై  పగలంతా ప్రశాంతతా రాత్రైతే నీఒడిలో పసిపాపనై సవ్వడి చేయక ప్రపంచమంతా నిద్దురలో జోగుతుంటే నా నెచ్చెలి చెక్కిలిపై చిరుచెమట కూడా నాకు అమృతమేకదా

రుద్రభూమి

https://sanchika.com/rudrabhoomi-dr-bh-poem/   నువ్వన్నావు నా గురించి నీకేమి తెలుసని నేనన్నాను ప్చ్.... నాకేమి తెలియదని   నువ్వన్నావు నేనంటే నీకెందుకంత ప్రేమని నేనన్నాను జాబిలి అంటే  ఎవ్వరికి ఇష్టముండదని నువ్వన్నావు మరి నన్ను వదలి వెళ్ళవుకదా అని నేనన్నాను కలలో కూడా నీతోటే నేనని     నువ్వన్నావు ఫారిన్ చాన్సని రేపే ప్రయాణమని నేనన్నాను నీకల నిజమైందని త్వరగా తిరిగిరమ్మని నువ్వన్నావు నాన్న మాట కాదనలేనని పెళ్ళికి తొందరని నేనన్నాను నీ తరువాతే నాకెవరైనా అని నువ్వన్నావు చెల్లి పెళ్ళి చేయాలని కట్నం కావాలని నేనన్నాను  నా మనస్సు నీదని  ధనదాహం తీరనిదని నువ్వన్నావు తల్లితండ్రుల మాట జవదాటనని   నేనన్నాను నీమాట కాదనలేనని ...........   నువ్వన్నావు నిన్ను ఎన్నటికి మరువనని నా హృదయం నీ దని   నేనన్నాను నీకు హృదయమే లేదని అది ఒక రుద్రభూమి అని     

ఎడారి మొక్కలా ...........నిన్నటి నేటితో

  https://vihanga.com/?p=32671   మోజుపడి నీవు మోహంతో నా వెంట పడ్డ ఆనాడు నా బాహ్యదృష్టికి నీవొక ప్రేమికుడివి  కాని నా అంతఃదృష్టికి నీవోక సాధకుడివి  నా నీడకూడా ఏ క్షణం నిన్ను మరువలేదు    కౌమారములో నీవు నన్ను మాయ చేసి బుద్దిహీనుడవై మరలిపొయావు తిరిగి ఇక రానని పూర్ణవయస్కుడవై మరలి వచ్చి  నువ్వు నేను ఒకటన్నవు ఏంటి తాళి అంటే ఎగతాళా ? రెక్కలు తెగిన పక్షి వలే నేను నేల వాలిన నాడు రాబందువులు నాకై కాచుకున్న నేడు  నేను నీకోసం తిరిగి చూడలేదు నీవు నన్ను మోహంతో బందిస్తావని తెగిన గాలిపటము దిక్కులేక సుడిగాలితో స్తానబ్రంశమై  కాసింత వాలు కోసం వెదకిన నాడు నిన్ను ద్వేషించలేదు తీరం దరిచేరిన నేడు జీవించలేను రాతియుగంలో ఎడారి మొక్కలా ...........నిన్నటి నేటితో ఇసుకపర్రలలో దాగిన నీటికోసం అర్రులు చాస్తూ పరదాల మాటున ఉన్నా నేను  తోడేలు నీడనైనా ఎదిరించగలను ముఖాముఖి  

నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ

(https://www.neccheli.com/2023/01/%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%82-%e0%b0%95/)   దప్పికతో ఒయాసిస్సులను వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనకలాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుచున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తిర్చినందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ      నాది నావాళ్ళంటూ  ప్రాణం పొయినా మమకారాన్ని చంపుకోలేక నా అత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు   అమ్మ కడుపున ఊపిరి పొసినందుకు     నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవైనందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ  కడుపు నిండినా మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నాగుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలివై, భార్యవైనందుకు ...

చెల్లని కాసు

  http://100.26.73.229/chellani-kaasu-dr-bh-poem/       ఎంతో అందమైనదానినని నాకు పొగరు కన్నుల మిలమిల నా వంటి తళతళ అందరూ నన్ను కావాలనుకొనేవాళ్ళే హృదయంలో పదిలపరచుకొనేవాళ్ళే నా చుట్టూ అల్లుకొన్న కథలు ఎన్నో   కూటికి బిచ్చగాడైన్న కోటికి నవాబైనా గుప్పెట్లో వెచ్చగా నిద్రపుచ్చినవారే కలల్లొ నేనే      ఆడించా పాడించా కవ్వించా నన్నుచేజిక్కించుకొవడానికి గిరగిర గాలిలో నన్ను తిప్పి బొమ్మా బొరుసు ఆడి  నాకోసం ప్రాణం వదిలిన వాళ్ళెందరో  నన్ను చూడగానే చిన్నారుల కళ్ళళ్ళో మెరుపులు ముసలి వాని పడుచు పెళ్ళాం నన్నోరొజు నా మీద మోజు తీరిందన్నది   నన్నో చెల్లని కాసన్నది  వీది గుమ్మం వైపు విసిరి కొట్టింది తమకంతో నన్నందుకొంటారేమోనని నేచూసాను    నన్నందరూ చూసి నవ్విపొయిరి  నేను తగనని నిన్నటికి నేనెంతో విలువైనదానిని  ఈరోజు నాకాళ్ళు కడిగి దానం చేసేవారేరి  నేనైనాను బిడియాన్ని వదలించే సిగ్గుబిళ్ళని  చెల్లని కాసుని   

నాన్న గారాల కన్నా

https://sanchika.com/naannagaa-nenu-marugujjantaivaadini-dr-bh-poem/   చిన్నారి చిట్టి తండ్రి   నాన్న గారాల కన్నా నీ ముద్దు మురిపాలతో నాకు ఇంద్రధనుస్సునే చూపావురా కన్నా  నీ కన్నులలో సూర్య చంద్రుళ్ళనే నే చూసానురా నాన్న నీ రతనాల పలుకులతో నన్ను ఓలలాడించావురా నా చిన్నా  నీ పలుకులే అమృతపు చినుకులై నీ ఒడిలో నన్ను లాలిస్తుంటే మెరుపే మెరిసినా బూచాడంటూ నన్ను వాటేసుకుంటే  నా ఒడిలో తల దూర్చి గారాలు పొతూ నాన్నానన్ను వదలి వెళ్లొద్దంటూ నడి రేయి నిద్రలోను నన్నే కలవరిస్తుంటే నాన్నగా నేను మరుగుజ్జంతటివాడిని  మహాస్వరూపాన్నే చూపలేనా.. ............చిట్టి తండ్రి హర్షిత్ కి ...........     

తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని

https://www.neccheli.com/2023/02/%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b%e0%b0%b7%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a4%e0%b1%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf/   సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని    పబ్బుల్లొ ఉందో మబ్బుల్లొ ఉందో  తాగే మందులో ఉందో చల్లటి చెట్టునీడలో ఉందో   మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లొ లేకా ప్రేమించే గుండెలోనా హిమాలయాలలోనే కలియతిరుగుచూ   కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిల్లలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలొ యవ్వనాన ఎదిగేను మహావృక్షంలా   నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచిపొయెను నేను ఎదిగానని తలచి      

మరుపెంత కావాలి నీ కళ్ళు చూడకుండ ఉండటానికి

( https://sanchika.com/marupenta-kaavali-nee-kallu-choodakundaa-undadaaniki-dr-bh-poem/ )   ఎక్కే రైలు, దిగే బస్సు సాగే నడక అంతా నీ కోసం నా ఆరాటం నీ స్నేహం ఎంతో మాధుర్యమైనదని అది నా హృదయాన్నే నింపినదని  నీకు తెలియనిదేమి మనము మిత్రులమో కానివారమో నాకెరుక లేకపోయనేమి  నిన్ను చూస్తే కంటికెదురుగా వర్షాన్నేచూసినట్లు   మాసిన గాయం మళ్ళీ రేగెనేమి    ఎంత జీవితం చూసానేమి   నాకంత విశాల హృదయం ఉండటానికి    మరుపెంత కావాలి నీ కళ్ళు   చూడకుండ ఉండటానికి కనుసన్నలలొనుండి నీ మోము  నే చూచాను, హృదయం లోని గాయం కరుగగా వర్షించేను మేఘమై    

ఎంతని ఎదురు చూసేది https://kavithalu.in/telugu-poetry-543/

ఎంతని ఎదురు చూసేది  ఎంతని మరులు సైచేది ప్రొద్దే గడవక  నిదురే రాక  కనులు తెరచినా  నీ రూపు కనులు మూసినా  నీరూపు ఆ కనులే లేకున్నా ఆ మనస్సే లేకున్నా నేనే లేకున్నా  నీవే లేకున్నా https://kavithalu.in/telugu-poetry-543/