పోస్ట్‌లు

కథలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రయాణం లో ఒక రోజు

https://sanchika.com/prayaanamlo-oka-roju-dr-bh-story/feb 19/2023 రాయచోటి..రాత్రి 7.30 ...కడపకు చివరి బస్...జనాలు ఎక్కుతున్నారు తోసుకుంటూ.... కొంతమంది ఇది చివరి బస్సు అంటూ ఉరుక్కుంటూ బస్ వైపు వస్తున్నారు. నేను కిటికిలో నుండి బ్యాగ్ సీటు పైకి అలాగ్గా విసిరి వేసాను.... అమ్మయ్య ఇక నా సీట్ కి డోకా లేదు అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించి... సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ అటు ఇటు చూస్తున్నా. "ఏమబ్బా యీ బస్సు యాడి వరకు పోతాంది" అన్న మాట నా పక్క నుంచి వినిపించి అటు చూసా. అరవై ఏండ్ల పెద్దామె నోట్లో పొగాకు నములుతూ నా వైపు చూస్తోంది. "పెద్దమ్మా ఈ బస్సు కడప పోతాంది అన్నాను" నేను. "నీదే ఊరబ్బా" అనింది మళ్లీ. "పెద్దమ్మ మాది చిన్నగొట్టిగల్లు. పని మీద పులివెందుల పోతాండా" అన్నా నేను. "వక్కాకుకు పది రూపాయలు లెక్క ఉంటే ఈ నాయనా" అంది ముసలమ్మ ... "ఇగో పెద్దమ్మ తీసుకో" ..పది రూపాయలు యాడనో పోతాంటాయి .....అదేమన్నా భాగ్యమాా ! అంటూ పది రూపాయలు ఇఛ్చినాను ... "నీ అమ్మ కడుపు చల్లగుండా" అని ఆయమ్మ అంటున్నంతలో... అటు బస్సు వ...

మోహపు వల

 (https://www.gotelugu.com/telugustories/view/10924/mohapu-vala)  సెయ్ వసంత... ఇట్న రా బయటకి అంటూ వంటగదిలోకి దడ దడ మంటూ అరుస్తూ నవనీత వచ్చి రాగానే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కోని వచ్చింది నన్ను. ఏమే తొందర నీకు...అంటూ బయటకు రాగానే  నా కళ్ళల్లోకి నవనీత చూస్తూ మోచేతితో పొడిచింది ఇంటి బయట తిన్నె పైన చూడమంటూ. అటు చూద్దును కదా...అక్కడ ఎవరో ఒక బక్కచిక్కిన ఆమె నిండా ముసుగు వేసుకుని కూర్చుని ఉంది మొహమైన కనిపించకుండా... ఎవ్వరా అంటూ నవనీత వైపు చూస్తే, కళ్లతో సైగ చేసింది దగ్గరకు వెళ్లి చూడమంటూ, దగ్గరకు నేను పోయి పోగానే, ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వసంతా అంటూ.. గబాల్న ముసుగు లాగి చూసా. గౌరీ హా గౌరీ ! అంటూ...ఏమ్మేయ్ ఇన్ని రోజులు ఎట్న పోయినావు మే...అని నవనీత వైపు చూసి ఇదెందే ఇట్లాగా అయిపోయిందే... అని నేను ఏడవడం ఎత్తుకున్న. నవనీతం నా దగ్గరగా వచ్చి ముందు లోపలికి పోండెహే బగిస పోతోంది యీదిలో... అని నన్ను పక్కకి లాగి  దాన్ని పైకి లేపింది.  అది బరువు తూకం కాలేక చేతులు నేలకు మోపి లెయ్యలేక లేసిన్ది. చూస్తుంటే గర్భం తో ఉన్న...

ప్రేమపాశం

    https://www.neccheli.com/2022/12/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%aa%e0%b0%be%e0%b0%b6%e0%b0%82-%e0%b0%95%e0%b0%a5/     మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం. నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను  తాలింపు  పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు. మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను.  అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లో ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము. మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగ...

అభయ హస్తం

  https://sanchika.com/abhaya-hastam-story-dr-bh/ "అమ్మా"...అంటూ నా కూతురు నీల ఇంటి లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చుని ఉన్న నన్ను చూడగానే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలో పడుకుని ఏడవడం మొదలు పెట్టింది...   "ఏమైందమ్మా...చెప్పు! ఏమి జరిగింది" ఆదుర్దగా నేను అడిగా...   అమ్మా మా కాలేజ్ లో ఈ రోజు మా సీనియర్  రఘు అందరి ముందు నా చెయ్యి పట్టుకుని లాగాడు !!! "నేను  వదులు... వదులు".... అంటూ ఉన్నా వినిపించుకోకుండా "నేను నిన్ను   ప్రేమిస్తున్నాను"... "నువ్వు ఒప్పుకోవాలి అంటున్నాడు".....నా కూతురి ఏడుపు చూసి అమ్మగా నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా..... నీల ఏడుస్తూ అంటున్నది "అమ్మా నేను నా వేదన ఎవరికి చెప్పుకోవాలి? అతను మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళే దారి కాసి తన చేతులు అడ్డుపెట్టి మరీ నన్ను ప్రేమించు....అంటున్నాడు" . నా కూతురు పడే బాధని చూసి కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు !!! ఆడపిల్లలకు అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో ! తాకుతారోనని !    నేన...

నిజమైన స్నేహం

  https://www.gotelugu.com/telugustories/view/10867/nijamaina-sneham అమృత గుర్తుకు రాగానే మనస్సంతా తియ్యగా మూలిగింది. అమ్ము తో ముందే పరిచయం అయ్యుంటే ఎంత బాగుండేది. శనివారం బిర్లా మందిర్ కి వెళ్ళడం హైదరాబాద్ వచ్చినప్పటి నుండి అలవాటు. రెండు నెలల క్రితం అలవాటుగా శనివారం బిర్లా మందిర్ వెళ్ళడానికి ఆటో ఎక్కాను. ఆటో నెమ్మదిగానే వెళుతోంది కానీ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి. ఆటోలో నా ఆఫీస్ బాగ్ వదలి ఆటో దిగేసాను. ప్రశాంతంగా గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని కళ్లు మూసుకుని కూర్చున్నా. నా కళ్ళ ముందు చిటికెల చప్పుడు విని కళ్లు తెరిచి చూసా. అమ్మాయి నన్నే చూస్తూ. నన్నేనా పిలిచింది అని అటూ ఇటూ చూసా. "మిమ్మలేనండి"...అంటూ చిరునవ్వుతో..."ఈ బాగ్ అంది"..."ఓహ్ నాదే"...అంటూ ఆ అమ్మాయి వైపు చూసా...అంత మా లోకం అయితే ఎలాగండి! బాగ్ మర్చిపోయారు. నేను ఆటోలో మీ పక్కనే ఉన్నాను కాబట్టి గమనించాను అంది. థాంక్యూ అని చిరునవ్వు తో అన్నాను. "వట్టి నవ్వేనా ...కాఫీ ఇప్పించండి". నేను తనని ఆశ్చర్యంగా చూస్తున్నా.  కొత్త పాత లేదా ఈమెకు అని. కనీసం పేరు కూడా తెలుసుకోకుండా ఏదో జన్మ జన్...

బతుకు భయం భయంగా

https://www.gotelugu.com/telugustories/view/10800/batuku-bhayam-bhayamgaa నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ! వద్దా ! వెళ్లితే ఏమౌతుంది! కొడ్తారేమో ! తన జీవితం నాశనం అవుతుంది !!! ఒక జీవితాన్ని నాశనం చేయవచ్చా?...వెళ్లకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలి ! నా వేదనని ఎవరికి చెప్పుకోవాలి? స్పర్శ సుఖాన్ని ఇస్తుందా?లేక దహిస్తుందా? గుండె కాలడమే నాకు తెలుసు! ఆ మంటలో నేను కాలిపోతూ ఉంటే...వాడికి అది సుఖమా? స్పర్శ సుఖాన్ని పొందే మానవ మృగాలు!!! చర్మం కాలుతున్న వాసన వారికి రాదా? వేలకొద్దీ ముల్లులు ఏకకాలంలో వళ్లంతా దిగబడినట్లు ఉంది !!! గునపంతో ఎక్కడో గట్టిగా పొడిచినట్లు ఉంది !! కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు!!! అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో! తాకుతారోనాని! భారతదేశ చట్టాల ప్రకారం, ఒక అమ్మాయి అంగీకారం లేకుండా ఆమెని తాకి భయాన్ని కలిగించినప్పుడు IPC సెక్షన్ 354 A  ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఏడు  సంవత్సరాల వరకు వరకు జైలు శిక్ష ను పొందుతాడు. అలా అని తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో....

మాధవీయం

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10827/maadhaveeyam   జమీందారీ పోయింది!!!  తాతల రాశులు కరిగిపోయాయి!!!   కానీ మా మావయ్య కి తన పొగరు మాత్రం తగ్గలేదు. మిగిలింది పెంకుల ఇల్లు ఒక్కటే.  ఉన్న ఒక్క కొడుకు అదే నా మొగుడు ఆయనకు వారసుడు ఆ పొగరులో.  ఇద్దరూ ఇద్దరే.  మీసాలు తిప్పుకుంటూ బ్రతకడానికి.  పెద్దిల్లు అని మా నాయన నన్ను ఆ ఇంటి కోడలు చేశారు.  ఇల్లేమో పెద్దదే. ఎకరా పైమాటే.   ఇల్లు ఊడ్చాలంటే నడుములు విరగాల్సిందే. ఎక్కడ చూడు రాలే సున్నం, విరిగిన పెంకులకు అతుకులు మా జీవితాలకి లానే.  ఎలా బ్రతుకుతాను నేను అనుకున్నాడో ఏమో ఆ దేవుడు నాకు ఒక దారి చూపెట్టాడు. చిన్నప్పటి నుండి అమ్మ చీరలు అంటే నాకెంతో ఇష్టం. రంగు రంగుల చీరలు నన్ను ఆకర్షించేవి. వాటిని అలా చుట్టుకొని ఇలా దోపుకొని పైన వేసుకుని నడుము క్రింద కుచ్చిళ్ళు తో భుజం పై పైట గా కప్పుకొని కొంగు ముడి వేసుకుని అనందించేదాన్ని... అబ్బో ఎన్నో ఎన్నెన్నో కలలు ఆశలు ఆ చీరలు.  ఆ అందాల చీరల ఆశ నన్ను ఎంతో ఆకర్షించేది. కాలంతో నేను ఎదగడం తో పాటు నా చీరల ఆకర్షణ కూడా ఎదిగింది. ఏ చీర ఎలా కట్టుకోవాలి...

అతనో పర్వర్టేడ్ అయితే నేనొక కోవార్ట్ ని

చిత్రం
http://100.26.73.229/atano-perverted-ayite-nenoka-covertni-story-dr-bh/ చాలారోజుల  తరువాత  కన్నయ్య ఇంటి పట్టున పదిరోజులుంది. పిలాని నుండి గుర్గావ్కి మారింది కాని అమ్మా ఇంకా స్టూడెంట్ గా ఉండాలనిపిస్తోంది అంటోంది. మేమిద్దరము షాప్పింగ్ నుండి వచ్చేటప్పుడు అమ్మా నాకు పెళ్లి చేసేయమ్మా అంది. ఏంటే    ఆలోచనలేకుండా వాగుతున్నావ్ అప్పుడే పెళ్లి జంజాటం ఎందుకే  నీకు హాయిగా ఉండక అన్నాను. నాకు తెలీదని అనుకొంటున్నావా నీ భయం అంది.  ఎంటే  మాట్లాడుతున్నావు అన్నా షాకింగా నమ్మలేనట్లుగా తనను చూస్తూ . నాన్న ఎందుకు అలా చేసాడమ్మా అంది దిగులుగా నేను ఇక్కడ ఉండలేనమ్మా అంది. అమ్మా నువ్వు చెప్పావని హాస్టల్లో చేరా కాని సుతరాం  నాకు ఇష్టం  లేదు  ఎప్పుడూ నిన్ను వదలివెళ్ళడం......నీకు తెలుసు కదా అమ్మా హాస్టల్లో చాలామంది నా స్నేహితులు పల్లేటూరిలో చదువులు బాగా లేవని అక్కడ చేరినవారే. ఇంకొందరు నాన్ లోకల్  అయిపోతే.....  ఎంసెట్ లో సీట్ రాదని....  నార్త్ లో ఉజ్జొగం చేస్తున్నవారు వాళ్ళ పిల్లలని అక్కడ వదిలిపెట్టారు. కాని నన్నోరోజు మా కెమిస్ట్రీ టీచర్ అ...

కల్కి

https://www.gotelugu.com/telugustories/view/10718/kalki అమ్మ చెప్పిందని హాస్టల్లో చేరా కాని సుతరాం  నాకు ఇష్టం  లేదు  అమ్మని వదలివెళ్ళడం వంటరిగా ఆ చీకటి హాస్టల్లోకి ......హాస్టల్లో చాలామంది నా స్నేహితులు పల్లేటూరిలో చదువులు బాగా లేవని అక్కడ చేరినవారే. ఇంకొందరు నాన్ లోకల్  అయిపోతే.....  ఎంసెట్ లో సీట్ రాదని....  నార్త్ లో ఉజ్జొగం చేస్తున్నవారు వాళ్ళ పిల్లలని అక్కడ వదిలిపెట్టారు. నన్నోరోజు మా కెమిస్ట్రీ టీచర్ అడిగారు  నిన్ను ఇక్కడ చేర్చింది ఎవ్వరని. నేనన్నాను అమ్మని. చాలా ఆశ్చర్యంగా ఉంది !!!!! ఇంట్లో చిన్నవాళ్ళ అల్లరి భరించలేక కొద్దిరోజులైనా ఉండని క్రమశిక్షణ అబ్బుతుందని   చేర్పించే నాన్నలని.....  చూసా కాని ఇలా బంగారు బొమ్మలాంటి .....  నిన్ను ఇక్కడ చేర్చిన అమ్మని ఇప్పుడే చూస్తున్నా అన్నారు. అందరి మద్య ఉన్నా చాలా ఏడుపు వచ్చేది అమ్మని మిస్సయ్యానని...  నువ్వు నా గారాలపట్టివి అంటూ అమ్మ చెప్పే కథలు  చెల్లెలితో...  నా ఆటలు అన్నీ బంద్ అయ్యాయి. దుఖంతో ఒకచోట మౌనంగా నాలో నేను ముడుచుకొని కూర్చునేదాన్ని. అమ్మ ఆ రోజు ఫొన్లో ది...

ఒక చిన్నారి ఆశయం

మనచుట్టు ఎంతోమంది ఎన్నెన్నో ఆశయాలు కలిగి ఉంటారు. కొంతమంది ధనాన్ని సంపాదించాలని, కొంతమంది సమాజంలొ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, రాజకీయ నాయకులు కావాలని, గొప్ప నాయకుడిగా ఎదగాలని, ఇంకొంతమంది శాస్త్రవేత్తలుగా ప్రఖ్యాతి సంపాదించాలని, నటులుగా, నాట్యకారులుగా, కళాకారులుగా, ఫాషన్ డిసైనర్లుగా, ఇంజినీర్లుగా ఎన్నెనో ఆశయాలు.   మరికొంతమంతి సాహసికులుగా పర్వతాలను అధిరోహించడం, సముద్ర ప్రయాణాలు చేయడం, క్రీడలలొ రాణించడాన్ని మనము చూస్తూనే ఉన్నాం.       ప్రతి మనిషికి జీవితాన ఒక ఆశయం ఉండాలి. నా ఆశయం డాక్టర్ కావడం. నా చుట్టూ ఉన్న వ్యక్తులకు సహయం చేయడం.  వైద్యురాలిగా నా ప్రాంత ప్రజలకు, అసహాయకులకు సేవ చేసి నా వృత్తి ద్వారా గౌరవ ప్రఖ్యాతులు సంపాదించి నా కుటుంబానికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంపొందించడం నా ఆశయం.  అనారోగ్యంతో ఉన్నవారికి సేవచేయడంలోనే సంతోషం ఉందని నేను నమ్ముతాను. వారి శారీరక బాధలను నా వైద్యంతో నయం చేసి నేను ఆత్మసంతృప్తి పొందుతాను.  ఇనుమును కరిగించడానికి వేడి చేసినట్లు నేను నా మాటలతో వారికి స్వాంతన కలిగిస్తూ వారి శారీరక మానసిక అనారోగ్యాలను నా మం...

కలల సౌధాలు

https://www.gotelugu.com/telugustories/view/10796/kalala-soudhalu     అతను ..... నాతో అంటున్న మాటలు వినలేక రెండు చెవులు చిల్లులు పడుతున్నాయి నాకు. ఎన్నెన్ని కలలు కన్నాను నేను ,  నా వాడు నా కలల రాకుమారుడు నేనే ప్రాణమంటూ నన్ను ఏలుకొంటాడని.... నా కలల సౌధాలన్నీ పేకమెడల్లా  కూలిపోతున్నాయి. కాదు కాదు నేనే.....దానికి కారణం. నా ఉద్యోగప్రయత్నాలని చూసి  నాన్న ముందు పెళ్ళి చేసుకో అమ్మా... చాలా మంచి సంబంధం... ఆ అబ్బాయి నిన్ను మీ అక్క పెళ్ళిలో చూసినప్పటి నుండి మాటలు జరుగుతున్నాయి....  అంటుంటే పల్లెటూరి చాధస్తాలని వాళ్ళని లెక్కచేయక ఉద్యొగంలో చేరా.... ఆ రోజు మొదటి జీతం తీసుకొన్న రోజు ఎంతో ఎత్తుకు ఎదిగినట్లు సంతోషంతో ఉప్పొంగా. నా వర్క్ నేచుర్ చూసి ఆరు నెలలైనా  కాలేదు.... కాని ఈ అమ్మాయి ప్రొగ్రామ్మింగ్ అద్బుతం... అంటూ తన సత్తా చాటింది.......అని  పొగుడుతూ నన్ను విదేశాలలోని మా బ్రాంచ్ కి  రెకమ్మండ్ చేసినప్పుడు...సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవ్వుతూ....మా స్టాఫ్  పార్టీ ఇవ్వమంటుంటే అందరి తో కలసి డిస్కో కి వెళ్ళా....అతిగా మద్యం తాగి  అలవాటులేని తప్పు తో  అ...

పుట్టినింటి మట్టి

చిత్రం
https://vihanga.com/?p=32513      నా కూతుళ్ళు హరిజా, విరిజా దిగులు మొహాలతో బుజాలు భూమిలోకి వంచుకొని మరీ నడుస్తున్నారు,  ఇంటి వైపు. నాకు వాళ్ల దిగులు మొహాలు చూస్తుంటే ఏడుపు ఆగడంలేదు. నా కన్నీళ్ళను వాళ్ళకి కనిపించకుండా దాయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. విరజా చిన్నగా పిలిచాను............ఏంటమ్మా అంది వంచిన తల ఎత్తకుండా. ఇక్కడ జరిగిన విషయాలు నాన్నతో చెప్పకండమ్మా అన్నాను. విరజా చటుక్కున తల పైకి ఎత్తి ఎలా చెప్తామని నీవనుకున్నావమ్మా అంది. చిన్న పిల్లలు, రంగుల ప్రపంచాన్ని ఇప్పుడే తమ విప్పారిన కళ్ళతో చూస్తున్నవారు, బాధను, అవమానాన్ని దిగమింగుకొంటున్నారు.  హరిజా వంచిన తల ఎత్తకుండా నడుస్తున్నది మా ఇంటి వైపు. ఆయన గడప దగ్గర ఇంకా మేము రాలేదేమని ఎదురు చూస్తున్నాడు. మేము దగ్గరకు వెళ్ళగానే, హరీ ఏంటమ్మా చీకటి పడే లోపే ఇల్లు చేరవచ్చుగదా. ఊ............ ఫంక్షన్ బాగా జరిగిందా అంటుంటే వంచిన తల ని బలవంతంగా పైకి ఎత్తి ఆ....అ.............నాన్న చాలా బాగా జరిగింది నాన్న, అంటూ ఎక్కడలేని సంతోషాన్ని తమ కంఠంలో చూపుతూ, నాన్న నీవు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. అమ్మమ్మ, తాతయ్య ని...

దారి తప్పిన కొడుకా..........నన్ను క్షమించు

అప్పుడే తెలతెలవారబోతోంది.  సూరిడు రోమాలను నిక్కపొడుచుకొని తొంగి తొంగి మేఘాలను దాటి ముందుకొచ్చి చూస్తున్నాడు.  మా మొబైల్ క్లినిక్ తారురోడ్లపై సర్రుమని దూసుకొని పోతున్నది.  డెంగు ఫీవర్ తో పల్లెలన్ని గడగాడలాడుతున్నాయని మా మెడికల్ కాలేజి కి ఎన్నెన్నో వినతులు రావడం మూలాన ఫ్రెష్ మేడికోస్  అయిన మమ్ములను ఇలా పల్లెలకి పంపారు.  కుర్రకారంతా ఆనందముతో కొత్త సినిమా పాటలకు లయబద్దంగా హం చేస్తూ ఊగుతున్నాము.  మా డ్రైవర్ కూడా కుర్రవాడు కావడం మూలాన ఒడుపుగా బండిని పరిగెత్తిస్తున్నాడు.  గతవారం నుండి మేము, మా లేడిడాక్టర్స్ రాత్రనక పగలనక పల్లె పల్లెకి మా క్లినిక్ ని తిప్పుతున్నాము.    ఉన్నట్లుండి మా డ్రైవర్  గావుకేక పెడుతూ మా వెహికల్ ని ఒక్క కుదుపుతో ఆపాడు.  అలా చూద్దుం కదా,  ఒక ముసల్ది రోడ్డుమీద ప్రాణం లేనట్లు పడి ఉంది.  మాకందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంతపనైంది.  మా డ్రైవర్ గావుకేకలు పెడుతూ, ఒక్కసారిగా క్రిందకు దూకి, ఈ ముసల్ది చావడానికి హాస్పిటల్ బండే దొరికిందా అని తిడుతున్నాడు.   ఆతను మావైపు చూస్తూ తానెంతో జాగ్రత్తగా బండ...

అక్కరకు రాని చెట్టు - ఆసరా ఇవ్వని కొడుకు

మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం. నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను  తాలింపు  పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు. మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను.  అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లొ ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము. మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగు చేతులు ఆడుతుంటేనే కష్టమైన రోజుల్లొ, నేనొక్కటే పనికి పోబెట్టినాను. కొడుకు చేతికి ఎప్పుడు అందివస్తాడా అని చూస్తున్నా.  నేను మా పెరట్లో నాటిన మునగకొమ్మ ...