పోస్ట్‌లు

కథ sanchika లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రయాణం లో ఒక రోజు

https://sanchika.com/prayaanamlo-oka-roju-dr-bh-story/feb 19/2023 రాయచోటి..రాత్రి 7.30 ...కడపకు చివరి బస్...జనాలు ఎక్కుతున్నారు తోసుకుంటూ.... కొంతమంది ఇది చివరి బస్సు అంటూ ఉరుక్కుంటూ బస్ వైపు వస్తున్నారు. నేను కిటికిలో నుండి బ్యాగ్ సీటు పైకి అలాగ్గా విసిరి వేసాను.... అమ్మయ్య ఇక నా సీట్ కి డోకా లేదు అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించి... సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ అటు ఇటు చూస్తున్నా. "ఏమబ్బా యీ బస్సు యాడి వరకు పోతాంది" అన్న మాట నా పక్క నుంచి వినిపించి అటు చూసా. అరవై ఏండ్ల పెద్దామె నోట్లో పొగాకు నములుతూ నా వైపు చూస్తోంది. "పెద్దమ్మా ఈ బస్సు కడప పోతాంది అన్నాను" నేను. "నీదే ఊరబ్బా" అనింది మళ్లీ. "పెద్దమ్మ మాది చిన్నగొట్టిగల్లు. పని మీద పులివెందుల పోతాండా" అన్నా నేను. "వక్కాకుకు పది రూపాయలు లెక్క ఉంటే ఈ నాయనా" అంది ముసలమ్మ ... "ఇగో పెద్దమ్మ తీసుకో" ..పది రూపాయలు యాడనో పోతాంటాయి .....అదేమన్నా భాగ్యమాా ! అంటూ పది రూపాయలు ఇఛ్చినాను ... "నీ అమ్మ కడుపు చల్లగుండా" అని ఆయమ్మ అంటున్నంతలో... అటు బస్సు వ...

అభయ హస్తం

  https://sanchika.com/abhaya-hastam-story-dr-bh/ "అమ్మా"...అంటూ నా కూతురు నీల ఇంటి లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చుని ఉన్న నన్ను చూడగానే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలో పడుకుని ఏడవడం మొదలు పెట్టింది...   "ఏమైందమ్మా...చెప్పు! ఏమి జరిగింది" ఆదుర్దగా నేను అడిగా...   అమ్మా మా కాలేజ్ లో ఈ రోజు మా సీనియర్  రఘు అందరి ముందు నా చెయ్యి పట్టుకుని లాగాడు !!! "నేను  వదులు... వదులు".... అంటూ ఉన్నా వినిపించుకోకుండా "నేను నిన్ను   ప్రేమిస్తున్నాను"... "నువ్వు ఒప్పుకోవాలి అంటున్నాడు".....నా కూతురి ఏడుపు చూసి అమ్మగా నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా..... నీల ఏడుస్తూ అంటున్నది "అమ్మా నేను నా వేదన ఎవరికి చెప్పుకోవాలి? అతను మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళే దారి కాసి తన చేతులు అడ్డుపెట్టి మరీ నన్ను ప్రేమించు....అంటున్నాడు" . నా కూతురు పడే బాధని చూసి కన్నీళ్లు కారిపోతున్నాయి తెలియకుండానే నా హృదయము లోని బాధకు !!! ఆడపిల్లలకు అడుగు తీసి అడుగు వేయాలంటేనే భయం...ఎక్కడ ఎవరు ముట్టుకుంటారో ! తాకుతారోనని !    నేన...

అతనో పర్వర్టేడ్ అయితే నేనొక కోవార్ట్ ని

చిత్రం
http://100.26.73.229/atano-perverted-ayite-nenoka-covertni-story-dr-bh/ చాలారోజుల  తరువాత  కన్నయ్య ఇంటి పట్టున పదిరోజులుంది. పిలాని నుండి గుర్గావ్కి మారింది కాని అమ్మా ఇంకా స్టూడెంట్ గా ఉండాలనిపిస్తోంది అంటోంది. మేమిద్దరము షాప్పింగ్ నుండి వచ్చేటప్పుడు అమ్మా నాకు పెళ్లి చేసేయమ్మా అంది. ఏంటే    ఆలోచనలేకుండా వాగుతున్నావ్ అప్పుడే పెళ్లి జంజాటం ఎందుకే  నీకు హాయిగా ఉండక అన్నాను. నాకు తెలీదని అనుకొంటున్నావా నీ భయం అంది.  ఎంటే  మాట్లాడుతున్నావు అన్నా షాకింగా నమ్మలేనట్లుగా తనను చూస్తూ . నాన్న ఎందుకు అలా చేసాడమ్మా అంది దిగులుగా నేను ఇక్కడ ఉండలేనమ్మా అంది. అమ్మా నువ్వు చెప్పావని హాస్టల్లో చేరా కాని సుతరాం  నాకు ఇష్టం  లేదు  ఎప్పుడూ నిన్ను వదలివెళ్ళడం......నీకు తెలుసు కదా అమ్మా హాస్టల్లో చాలామంది నా స్నేహితులు పల్లేటూరిలో చదువులు బాగా లేవని అక్కడ చేరినవారే. ఇంకొందరు నాన్ లోకల్  అయిపోతే.....  ఎంసెట్ లో సీట్ రాదని....  నార్త్ లో ఉజ్జొగం చేస్తున్నవారు వాళ్ళ పిల్లలని అక్కడ వదిలిపెట్టారు. కాని నన్నోరోజు మా కెమిస్ట్రీ టీచర్ అ...