పోస్ట్‌లు

2023 లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

ప్రయాణం లో ఒక రోజు

https://sanchika.com/prayaanamlo-oka-roju-dr-bh-story/feb 19/2023 రాయచోటి..రాత్రి 7.30 ...కడపకు చివరి బస్...జనాలు ఎక్కుతున్నారు తోసుకుంటూ.... కొంతమంది ఇది చివరి బస్సు అంటూ ఉరుక్కుంటూ బస్ వైపు వస్తున్నారు. నేను కిటికిలో నుండి బ్యాగ్ సీటు పైకి అలాగ్గా విసిరి వేసాను.... అమ్మయ్య ఇక నా సీట్ కి డోకా లేదు అనుకుంటూ సిగరెట్ తీసి వెలిగించి... సిగరెట్ పొగ రింగులు రింగులుగా గాలిలోకి వదులుతూ అటు ఇటు చూస్తున్నా. "ఏమబ్బా యీ బస్సు యాడి వరకు పోతాంది" అన్న మాట నా పక్క నుంచి వినిపించి అటు చూసా. అరవై ఏండ్ల పెద్దామె నోట్లో పొగాకు నములుతూ నా వైపు చూస్తోంది. "పెద్దమ్మా ఈ బస్సు కడప పోతాంది అన్నాను" నేను. "నీదే ఊరబ్బా" అనింది మళ్లీ. "పెద్దమ్మ మాది చిన్నగొట్టిగల్లు. పని మీద పులివెందుల పోతాండా" అన్నా నేను. "వక్కాకుకు పది రూపాయలు లెక్క ఉంటే ఈ నాయనా" అంది ముసలమ్మ ... "ఇగో పెద్దమ్మ తీసుకో" ..పది రూపాయలు యాడనో పోతాంటాయి .....అదేమన్నా భాగ్యమాా ! అంటూ పది రూపాయలు ఇఛ్చినాను ... "నీ అమ్మ కడుపు చల్లగుండా" అని ఆయమ్మ అంటున్నంతలో... అటు బస్సు వ...

మోహపు వల

 (https://www.gotelugu.com/telugustories/view/10924/mohapu-vala)  సెయ్ వసంత... ఇట్న రా బయటకి అంటూ వంటగదిలోకి దడ దడ మంటూ అరుస్తూ నవనీత వచ్చి రాగానే చెయ్యి పట్టుకుని బయటకు లాక్కోని వచ్చింది నన్ను. ఏమే తొందర నీకు...అంటూ బయటకు రాగానే  నా కళ్ళల్లోకి నవనీత చూస్తూ మోచేతితో పొడిచింది ఇంటి బయట తిన్నె పైన చూడమంటూ. అటు చూద్దును కదా...అక్కడ ఎవరో ఒక బక్కచిక్కిన ఆమె నిండా ముసుగు వేసుకుని కూర్చుని ఉంది మొహమైన కనిపించకుండా... ఎవ్వరా అంటూ నవనీత వైపు చూస్తే, కళ్లతో సైగ చేసింది దగ్గరకు వెళ్లి చూడమంటూ, దగ్గరకు నేను పోయి పోగానే, ఆ మనిషి నా కాళ్ళు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది వసంతా అంటూ.. గబాల్న ముసుగు లాగి చూసా. గౌరీ హా గౌరీ ! అంటూ...ఏమ్మేయ్ ఇన్ని రోజులు ఎట్న పోయినావు మే...అని నవనీత వైపు చూసి ఇదెందే ఇట్లాగా అయిపోయిందే... అని నేను ఏడవడం ఎత్తుకున్న. నవనీతం నా దగ్గరగా వచ్చి ముందు లోపలికి పోండెహే బగిస పోతోంది యీదిలో... అని నన్ను పక్కకి లాగి  దాన్ని పైకి లేపింది.  అది బరువు తూకం కాలేక చేతులు నేలకు మోపి లెయ్యలేక లేసిన్ది. చూస్తుంటే గర్భం తో ఉన్న...

కొంగ్రొత్త వేకువకై ప్రేమతో .......

   https://sanchika.com/kogrotta-vekuvakai-premato-dr-bh-poem/     నువ్వు ఎవ్వరినైనా ప్రేమిస్తున్నప్పుడు అలా.........ప్రేమిస్తున్నావని చెప్పక దాచడం అది ప్రేమకు ఉరి లాంటిదేనని నీకు తెలుసా ప్రియతమా.....కృష్ణా నువ్వు చెప్పావని ఆ ప్రేమ కరిగి నీదౌతుందని కోరుకోవడం తప్పేనని నీకు తెలియదా రాధా!!!      అమావాస్యనాడు వెన్నెల లేదని  వెన్నెలకాడు పౌర్ణమినాట తిరిగిరాడని నీవు నాతో గిల్లికజ్జలెట్టుకొని చెప్పడం నీకు తగునా కన్నయ్యా... నీ హృదయాన్ని  పరిచి నువ్వు స్వాగతించినప్పుడు నిన్ను తృణీకరించి కొంగ్రొత్త వెలుగులపై నే పయనిస్తుంటే బిడుస్సువారిన మనస్సు పై నీకెందుకు వలపు ప్రియ.....  రాధా ... ఓ నా మనోహరిణి నక్షత్రపు వెలుగులు నాకై వేచిఉన్నాయని     తృణీకరింపు  సెగలను తుడిచివేసి   కొంగ్రొత్త వేకువకై  ప్రేమతో ఎదురు చూస్తా యుగాన్తందాటి నా చెలికాడా ............ నల్లనయ్యా !!!!

నేను సముద్రుడనైతే

 (http://vihanga.com/?p=3276)   నీవు తీరానివైతే నా అలలు అలజడులై నాలోని కోరికలై సుడులు తిరుగుతూ ఊ......ప్ మని ఉప్పెనగా సాగి నీపై మోహంతో నిన్ను ఒడిసిపట్టుకోవాలని నిన్ను ఒరుసుకొనిపోతూ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ మౌనంగా నీవు నన్ను సహిస్తూ నాలోని జీవానివి నీవై  పగలంతా ప్రశాంతతా రాత్రైతే నీఒడిలో పసిపాపనై సవ్వడి చేయక ప్రపంచమంతా నిద్దురలో జోగుతుంటే నా నెచ్చెలి చెక్కిలిపై చిరుచెమట కూడా నాకు అమృతమేకదా

రుద్రభూమి

https://sanchika.com/rudrabhoomi-dr-bh-poem/   నువ్వన్నావు నా గురించి నీకేమి తెలుసని నేనన్నాను ప్చ్.... నాకేమి తెలియదని   నువ్వన్నావు నేనంటే నీకెందుకంత ప్రేమని నేనన్నాను జాబిలి అంటే  ఎవ్వరికి ఇష్టముండదని నువ్వన్నావు మరి నన్ను వదలి వెళ్ళవుకదా అని నేనన్నాను కలలో కూడా నీతోటే నేనని     నువ్వన్నావు ఫారిన్ చాన్సని రేపే ప్రయాణమని నేనన్నాను నీకల నిజమైందని త్వరగా తిరిగిరమ్మని నువ్వన్నావు నాన్న మాట కాదనలేనని పెళ్ళికి తొందరని నేనన్నాను నీ తరువాతే నాకెవరైనా అని నువ్వన్నావు చెల్లి పెళ్ళి చేయాలని కట్నం కావాలని నేనన్నాను  నా మనస్సు నీదని  ధనదాహం తీరనిదని నువ్వన్నావు తల్లితండ్రుల మాట జవదాటనని   నేనన్నాను నీమాట కాదనలేనని ...........   నువ్వన్నావు నిన్ను ఎన్నటికి మరువనని నా హృదయం నీ దని   నేనన్నాను నీకు హృదయమే లేదని అది ఒక రుద్రభూమి అని     

నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ

(https://www.neccheli.com/2023/01/%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%82-%e0%b0%95/)   దప్పికతో ఒయాసిస్సులను వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనకలాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుచున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తిర్చినందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ      నాది నావాళ్ళంటూ  ప్రాణం పొయినా మమకారాన్ని చంపుకోలేక నా అత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు   అమ్మ కడుపున ఊపిరి పొసినందుకు     నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవైనందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ  కడుపు నిండినా మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నాగుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలివై, భార్యవైనందుకు ...

నాన్న గారాల కన్నా

https://sanchika.com/naannagaa-nenu-marugujjantaivaadini-dr-bh-poem/   చిన్నారి చిట్టి తండ్రి   నాన్న గారాల కన్నా నీ ముద్దు మురిపాలతో నాకు ఇంద్రధనుస్సునే చూపావురా కన్నా  నీ కన్నులలో సూర్య చంద్రుళ్ళనే నే చూసానురా నాన్న నీ రతనాల పలుకులతో నన్ను ఓలలాడించావురా నా చిన్నా  నీ పలుకులే అమృతపు చినుకులై నీ ఒడిలో నన్ను లాలిస్తుంటే మెరుపే మెరిసినా బూచాడంటూ నన్ను వాటేసుకుంటే  నా ఒడిలో తల దూర్చి గారాలు పొతూ నాన్నానన్ను వదలి వెళ్లొద్దంటూ నడి రేయి నిద్రలోను నన్నే కలవరిస్తుంటే నాన్నగా నేను మరుగుజ్జంతటివాడిని  మహాస్వరూపాన్నే చూపలేనా.. ............చిట్టి తండ్రి హర్షిత్ కి ...........     

తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని

https://www.neccheli.com/2023/02/%e0%b0%b8%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b%e0%b0%b7%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%86%e0%b0%a4%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a4%e0%b1%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf/   సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని    పబ్బుల్లొ ఉందో మబ్బుల్లొ ఉందో  తాగే మందులో ఉందో చల్లటి చెట్టునీడలో ఉందో   మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లొ లేకా ప్రేమించే గుండెలోనా హిమాలయాలలోనే కలియతిరుగుచూ   కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిల్లలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలొ యవ్వనాన ఎదిగేను మహావృక్షంలా   నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచిపొయెను నేను ఎదిగానని తలచి      

మరుపెంత కావాలి నీ కళ్ళు చూడకుండ ఉండటానికి

( https://sanchika.com/marupenta-kaavali-nee-kallu-choodakundaa-undadaaniki-dr-bh-poem/ )   ఎక్కే రైలు, దిగే బస్సు సాగే నడక అంతా నీ కోసం నా ఆరాటం నీ స్నేహం ఎంతో మాధుర్యమైనదని అది నా హృదయాన్నే నింపినదని  నీకు తెలియనిదేమి మనము మిత్రులమో కానివారమో నాకెరుక లేకపోయనేమి  నిన్ను చూస్తే కంటికెదురుగా వర్షాన్నేచూసినట్లు   మాసిన గాయం మళ్ళీ రేగెనేమి    ఎంత జీవితం చూసానేమి   నాకంత విశాల హృదయం ఉండటానికి    మరుపెంత కావాలి నీ కళ్ళు   చూడకుండ ఉండటానికి కనుసన్నలలొనుండి నీ మోము  నే చూచాను, హృదయం లోని గాయం కరుగగా వర్షించేను మేఘమై