పోస్ట్‌లు

తిరిగి నిన్ను చేరాలని !!!!! క్రిష్నా !

మనస్సు వర్షించగా నీరై కన్నీరై మడుగై వలువలు కలువలై మౌనంతో నే భువినై సహనంతో  నీ సాంఘత్యంతో పగలంతా తాపంతో ఆవిరై మేఘుడినై నిన్ను సృష్టించిన నేను నీ చినుకుల చలువదనంతో నిశిరాత్రి విచ్చుకొన్న జాజినై రేపటికై ఎదురుచూస్తూ......... తిరిగి నిన్ను చేరాలని !!!!!   క్రిష్నా  !

ఇహం పరం నీవై !!!

ప్రాణిని నేను నా ప్రాణం నీవు పెదవులు నావైనా పలికే ప్రతి పదం నీవు నడక నాదైనా నా నడత నీవు ఊహలు నావైన ప్రతి ఊసు నీవే కనులు నావైనా అవి చూపే కరుణ నీదే పలికే కంఠం నాదైనా  ఇచ్చే ఆఙ్ఞ నీదే ఆశ నాదైన ఆశయం నీదే నవ్వు నాదైన నా పెదవుల చివ్వరి చిరునవ్వు నీవు  మరువపు తోటలో మనమిరువరం ఇహం పరం నీవై .............. కృష్ణా !!!

ఒక ముద్దడిగిన పాపానికి?

ఒక బందం ఆవేశంతో ఎగసి ఆవేదనతో ముగిసింది  సముద్రపు ఉప్పెనకైన కరుణ ఉంటుందేమోకాని అమెకి అపద్దానికి  అద్దం  అవసరం లేకపోయింది కాలానికి నేను గాలం వేయాలని తనని ఆపాలని తత్తరపాటు తో నేను తనకిచ్చిన ముద్దు మంచుతెరలా నాపై అగ్నిశిఖని వెలిగించి నన్ను నేను కాచుకొనేలోగా నాకు దూరంగా  తను..........రెక్కలు తెగి  రక్తపుమడుగులో ఒక ముద్దడిగిన పాపానికి నేను కాలిపోతున్న భగ్నప్రేమలో ......... ?????

మారాల్సింది మనమే...........

ఏమిటండి మీ ఉద్దేసం ఆడబిడ్డ పుట్టడం తప్పా లేక నేను దాన్ని కనడం తప్పా. ఓ ఏమిటి మీరంటున్నది  మీరెంతో మంచివారు కాబట్టి, మొదటిసారి ఆడబిడ్డ పుట్టినా నన్ను పుట్టింటికి తరమలేదా....   ఏమిటత్తమ్మ నువ్వు నన్ను నీ బిడ్దలతో పుట్టింటికి పో అంటున్నారు, వాళ్ళు ఈ ఇంటి బిడ్డలు కారా???? మామగారు మీరు ఆస్థి ఇవ్వరా  అబ్బాయిని కనకపోతే...... ఏమిటండి మీరు నాకింకో చాన్స్ ఇస్తారా అబ్బాయిని కనడానికి........ అప్పుడూ అమ్మాయే పుడితే ఏంచేస్తారు ??  పుట్టకముందే మీకు తెలుసున్న డాక్టర్ దగ్గర అబార్ట్ చేయిస్తారా ? ఏమంటున్నారు నాకింకోచాన్స్ ఇస్తారా..... లేకుంటే ఇంకో పెళ్ళి చేసుకొంటారా.......   నాకు తెలియని నిజమా ఏమంటున్నావే .... నీవు నా స్నేహితురాలివి కావే ??? నీవు ఆడబిడ్డని తీసివేయించావా...... కొడుకే కావాలని.............?? అదేంటి అలా అంటుంది చాకలమ్మ ఆడబిడ్డ మేలు.....  మగపిల్లానికంటే ...చెప్పినట్లు పడి ఉంటుందని???? తల్లికి బిడ్దళ్ళో మగ ఆడ అని తేడాలుండవని తెలియదా పిన్నమ్మా ........... అమ్మా ఆఖరకు నువ్వు కూడా వీళ్ళని  .........నన్ను ఇంకోసారి కనమంటున్నావా............

ఆడబిడ్డగ పుట్టడమే తప్పా.....

నిన్నటి విశేషము నేటి అవశేషము అమ్మకి పొత్తిళ్ళలో చిన్నారి పాపని కేరింతలతో నట్టింట పాకిన చిట్టితల్లిని అంటున్నారందరూ ఆడపిల్లని అక్కున చేర్చుకొన్న అమ్మ నన్ను చేసేసింది ఒక విశేషం  వార్తళ్ళో వార్తనై నేనొక అవశేషాన్నయ్యాను   ........?

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ

నా ప్రేమ పల్లకి పెళ్ళి వరకు రానే లేదు    ఐతేనేమి ఙ్ఞాపకాలను నేను భారంగా మోసుకొనే తిరుగుతున్నా     సముద్రము పొంగి పొరలి  ఒడ్డు ఒరుసుకుపోయినా ఎదురుచూస్తూనే ఉన్నా బాటసారివి నీవు కావని చేరువైన చుక్కలు గతాన్ని వెలిగిస్తుంటే భారమైన బ్రతుకులు చితిమంటలకు ఎగిసిపడుతున్నాయి అటెటో ఏవ్వరో వేస్తున్న కేక...  కుక్కల అరుపులు రౌద్రంగా చిక్కటి వెలుగుని మింగేసిన ఒంటి కన్ను రాక్షసుడు చీకటిని చుట్టూ కమ్మేసి   ఎక్కడో  నింగినుండి రాలుతున్న తోకచుక్క నాకు చుక్కానిలా చిన్నప్పుడెప్పుడో  అమ్మ చెప్పిన కథ  కోరుకున్నా కోరిక  పొద్దుకోసం చూస్తూ........... తెగువతో ఎదురీదుతున్నా పొంగి పొరలుతున్న వాగు పైపైకి ......   

పండూ............

పండూ............ మల్లె మొగ్గలు విరిసాయి మధుబాలలు మురిసారు నీ మోమునంటిన పాలనవ్వుని చూసి మురిపాలే రువ్వాయి నా మనస్సులో నిన్ను కవ్వించాలని............... షికారుకి రమ్మని నువ్వంటే అమ్మ దగ్గరికి వెళ్దామన్నాను ! దగ్గరకు రమ్మని పిలిస్తే నది పాయలో చిక్కుబడిన  నా  ఒత్తైన జుట్టుని సాఫీ చేస్తున్నానన్నాను  !!! గాలికి వాలుగా నా పరువం నిన్ను కవ్విస్తుంటే కౌగిలికి అందక నేను నిన్ను ఉడికిస్తూ .......  నీ చుట్టూ నేను తిరుగుతున్నా నువ్వు నన్ను గమనించకుండా  !!!!