పోస్ట్‌లు

పండూ.......

పండూ....... పూవుకు లేని తావి  భువికి లేని ఓపిక దివికి లేని మనస్సు గాలికి లేని ఓదార్పు నిప్పుకి లేని జ్వాల నీటికి లేని దాహం సూరీనికే లేని ఓజస్సు చందూరూనికే లేని చల్లదనం ఆమెకి లేని అందం అది నీదే సుమా !!!

కొంగ్రొత్త వేకువకై ప్రేమతో .......

   https://sanchika.com/kogrotta-vekuvakai-premato-dr-bh-poem/     నువ్వు ఎవ్వరినైనా ప్రేమిస్తున్నప్పుడు అలా.........ప్రేమిస్తున్నావని చెప్పక దాచడం అది ప్రేమకు ఉరి లాంటిదేనని నీకు తెలుసా ప్రియతమా.....కృష్ణా నువ్వు చెప్పావని ఆ ప్రేమ కరిగి నీదౌతుందని కోరుకోవడం తప్పేనని నీకు తెలియదా రాధా!!!      అమావాస్యనాడు వెన్నెల లేదని  వెన్నెలకాడు పౌర్ణమినాట తిరిగిరాడని నీవు నాతో గిల్లికజ్జలెట్టుకొని చెప్పడం నీకు తగునా కన్నయ్యా... నీ హృదయాన్ని  పరిచి నువ్వు స్వాగతించినప్పుడు నిన్ను తృణీకరించి కొంగ్రొత్త వెలుగులపై నే పయనిస్తుంటే బిడుస్సువారిన మనస్సు పై నీకెందుకు వలపు ప్రియ.....  రాధా ... ఓ నా మనోహరిణి నక్షత్రపు వెలుగులు నాకై వేచిఉన్నాయని     తృణీకరింపు  సెగలను తుడిచివేసి   కొంగ్రొత్త వేకువకై  ప్రేమతో ఎదురు చూస్తా యుగాన్తందాటి నా చెలికాడా ............ నల్లనయ్యా !!!!

మీ పెంపకం మీద మీకు నమ్మకముందా ?

చిన్నా ఈ లెక్క ఎలావేసావు చక్కగా ! అమ్మా నేనే చేశా   .... నువ్వా అదెలా నాన్న ! అమ్మా నేనే చేసానమ్మా ...... మీ టీచర్  నేర్పిందా ? లేదమ్మా నాకే వచ్చు ......... నీ  పక్కన   కూర్చునే  దిశా చెప్పించిన్దా ? కాదమ్మా నాకు వచ్చు ............. కాఫీ చేసావా విశాల్ నోట్స్  నుండి  ! లేదమ్మా నేను  సొంతంగా చేసా ..... చూడండి ఈ లెక్క తనే చేసానంటుంది ? నిజం అమ్మా నేనే చేశా ............  అది ఎలా నాన్న !!!నిజం చెప్పు ? నిజంగా చెప్తున్నా మరేమో ..........  నేను పుట్టగానే ఒకటోసారి మాథ్స్  అన్నా.  రెండోసారి మాథ్స్  అన్నా . మూడోసారి మాథ్స్  అన్నా.  హహహ !!!!! బలే బలే అమ్మ ఏప్రిల్ పూల్ ??? మరేమో అమ్మా మరి ...... నాకు మాథ్స్  అంటే ఇష్టం ...... మరి అమ్మా నీకు నేనంటే ఇష్టం లేదా . అన్నిసార్లు నన్ను   అడుగుతున్నావు  నామీద నమ్మకంలేకుండా !!!!

hearts blog

some people who thyself very near we regret some people who thyself very far we accept the longer the journey the longer the thrust my dear friend i believe winds blow to boost the clouds rain to raise flowers blossom the wish on my lips whip faith around u

పండు !!!!!

పండు !!!!! నాకు చిన్నతన౦ గుర్తూ  లేదు  నీ నవ్వులు గుర్తూ లేవు  నీతో ఆటలు లేవు పాటలు లేవు  నేను గుక్క పెట్టి ఏడుస్తున్న  చప్పుడూ వినిపించలేదు  కాని నీ మీద అలక  అటక మీద పలక  నా  పొట్టి జెడ పాపిటబిల్ల  నీ చీమిడి ముక్కు  వంటికి రాసుకున్న పౌడరు  ఏవి గుర్తు లేవు ఒక్క నీ బుంగమూతి  నా సొట్ట బుగ్గలపై నీ  ముద్దు తప్ప ..........  

ఒక చిన్నారి ఆశయం

మనచుట్టు ఎంతోమంది ఎన్నెన్నో ఆశయాలు కలిగి ఉంటారు. కొంతమంది ధనాన్ని సంపాదించాలని, కొంతమంది సమాజంలొ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, రాజకీయ నాయకులు కావాలని, గొప్ప నాయకుడిగా ఎదగాలని, ఇంకొంతమంది శాస్త్రవేత్తలుగా ప్రఖ్యాతి సంపాదించాలని, నటులుగా, నాట్యకారులుగా, కళాకారులుగా, ఫాషన్ డిసైనర్లుగా, ఇంజినీర్లుగా ఎన్నెనో ఆశయాలు.   మరికొంతమంతి సాహసికులుగా పర్వతాలను అధిరోహించడం, సముద్ర ప్రయాణాలు చేయడం, క్రీడలలొ రాణించడాన్ని మనము చూస్తూనే ఉన్నాం.       ప్రతి మనిషికి జీవితాన ఒక ఆశయం ఉండాలి. నా ఆశయం డాక్టర్ కావడం. నా చుట్టూ ఉన్న వ్యక్తులకు సహయం చేయడం.  వైద్యురాలిగా నా ప్రాంత ప్రజలకు, అసహాయకులకు సేవ చేసి నా వృత్తి ద్వారా గౌరవ ప్రఖ్యాతులు సంపాదించి నా కుటుంబానికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంపొందించడం నా ఆశయం.  అనారోగ్యంతో ఉన్నవారికి సేవచేయడంలోనే సంతోషం ఉందని నేను నమ్ముతాను. వారి శారీరక బాధలను నా వైద్యంతో నయం చేసి నేను ఆత్మసంతృప్తి పొందుతాను.  ఇనుమును కరిగించడానికి వేడి చేసినట్లు నేను నా మాటలతో వారికి స్వాంతన కలిగిస్తూ వారి శారీరక మానసిక అనారోగ్యాలను నా మం...

భువనాన వసంతం నీకోసమే.....

పండు!!!! మాన్యవిని  నేను మానవుడివి నీవు నీ కళ్ళపైన ఒక ముద్ర చూపుడు వేలుని నా పెదవులపై  ముంచి    నీ పెదవులకద్దిన ఒక తేనె చుక్కలా.......... శోదిస్తూ  నీ విశాల బాహూవుల బిగువు  నన్ను నేను నిలుపుకోనీ స్వామి ఆశలతో ఆకాశం నుండి భువి వరకు పండు!!!! మధురం ఒక స్వప్నం అతి మధురం నీవు నేను అందరూ అంటున్నారు అనాగరికం నీ నా కలయిక అని భువనాన వసంతం నీకోసమే..... నేను చేరవలసినదే నీహృదయాన్ని!!     పండు !!!!   కోలాహాలంగా కోలాటం ఆడదామంటే కయ్యానికి పిలుస్తావేం ? నా జబ్బ పట్టుకొనీ మరి నా కళ్ళలోకి చూస్తూ సయ్యాటకు పిలుస్తావేం !!! రాగసుధామృతం తో రాగాలాపనకి నా తోడై   నర్తించమని నే నిన్ను పిలిస్తే .... నీవేమో రాగాలాహరిని కాదని ప్రేమాలాహరిని ఆలపిస్తానంటే  ఆత్మతో హృదయం ఎలా సంగమించేది ?