పోస్ట్‌లు

భువనాన వసంతం నీకోసమే.....

పండు!!!! మాన్యవిని  నేను మానవుడివి నీవు నీ కళ్ళపైన ఒక ముద్ర చూపుడు వేలుని నా పెదవులపై  ముంచి    నీ పెదవులకద్దిన ఒక తేనె చుక్కలా.......... శోదిస్తూ  నీ విశాల బాహూవుల బిగువు  నన్ను నేను నిలుపుకోనీ స్వామి ఆశలతో ఆకాశం నుండి భువి వరకు పండు!!!! మధురం ఒక స్వప్నం అతి మధురం నీవు నేను అందరూ అంటున్నారు అనాగరికం నీ నా కలయిక అని భువనాన వసంతం నీకోసమే..... నేను చేరవలసినదే నీహృదయాన్ని!!     పండు !!!!   కోలాహాలంగా కోలాటం ఆడదామంటే కయ్యానికి పిలుస్తావేం ? నా జబ్బ పట్టుకొనీ మరి నా కళ్ళలోకి చూస్తూ సయ్యాటకు పిలుస్తావేం !!! రాగసుధామృతం తో రాగాలాపనకి నా తోడై   నర్తించమని నే నిన్ను పిలిస్తే .... నీవేమో రాగాలాహరిని కాదని ప్రేమాలాహరిని ఆలపిస్తానంటే  ఆత్మతో హృదయం ఎలా సంగమించేది ?   

సూరీడు నువ్వు వస్తావోమోనని

నువ్వు వస్తవేమోనని  మొహంతో ఎదురు చూసి నువ్వు రాక గడప మెట్లు ఎక్కక నేను సూరీడు కూడా నా ఎదురు చూపులను చూసి ఇక రాననుకొన్నాడో ఏమో కాని చీకట్లో దుప్పటి ముసుగేసి తోంగొంటూ   చంద్రునీ వైపు చూసి చిలిపి నవ్వోటి నవ్వి కన్ను గీటి నా కాటుక కళ్ళని చూడమంటూ నిద్రలోకి జారుకొంటూ తన దుప్పటిని మరింత పట్టుగా బిగించి ఊరినంతా నిద్దట్లోకి చుట్టి చీకటి తావున దాకొన్నాడు  ఒంటరి నక్షత్రామొకటి ఆకాసానికే దిష్టిచుక్కలా  నిల్చోని  నే చూస్తున్నా నేడైనా  అది నింగినుండి దిగునని...........

కొత్త దుంఖపు తెరలు తెరచి............

కన్నులలో కలలు ఆ కలలో నీవు కన్నులకే జాగారం నిద్దురలేక నీకు జాగారం పాత దుంఖపు తెరలు మూసివేసి కొత్త దుంఖపు తెరలు తెరచి............పరచి కాగితంపై నీ చేవ్రాలు చిరిగిన నీ పాత నోటు పుస్తకాలు నిన్ను వీడిన నీ చొక్కా గుండీ దాచుకొన్నా పెద్ద పేరున్న బాంక్ లోని లాకర్లో నా పొట్టి జెడనుంచి జారిన రోజా రేకులు  నే తిని పారేసిన పీచు మిఠాయి పొట్లాం  నాగుర్తుగా నీ గుండెల్లో  ప్రియ నేస్తమా   !!! 

వలపు తాడో పలుపు తాడో తెలియక

చిత్రం
https://www.koumudi.net/Monthly/2022/october/index.html       నన్ను నేను తప్పించుకొని తిరుగుతున్నాను ఎండనక వాననక పగలనక రేయనక కంటిచూపు మేరలో కానరాలా ఎవ్వరూ అయినా ఎందుకో భయం గుప్పెట్లో చిన్న చిరు చప్పుడుకే తత్తర బిత్తర పడి కాళ్ళ గజ్జలు ఎక్కడ చప్పుడు చేస్తాయోనని అడుగు తీసి అడుగు వేస్తూ అర మైలు దూరం నడిచినంతలోనే అలుపు తీర్చుకొంటూ వగరొస్తూ సెగలు పొస్తూ భయం గుప్పెట్లో నేను కానరాని కారడివా అంటే కానే కాదు ఘాండ్రించే పులులు పాకే పురుగులు తిరిగే నడవా కాదు నరబలులు కోరే నేర ప్రపంచం రక్తాన్ని పీల్చే నరలోకం ఎవ్వరు మన పురుషులో ఎవ్వరు పరపురుషులో తెలియని మాయ లోకం వలపు తాడో పలుపు తాడో తెలియక అమాయకపు బిత్తర చూపులతో చిత్తడి నేలపై వెనుదిరిగి చూస్తూ ముందడుగు వేసి వేయలేక పక్కల చూస్తూ రాబందువుల భయంతో నేను  !!!!      

వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా

చిత్రం
http://100.26.73.229/nee-gnaapakam-oonaadu-dr-bh-poem/      నీ ఙ్ఞాపకం ఓనాడు మంటలా మండుతుంటే ఈనాడు నీ ఙ్ఞాపకం స్మృతిలా వెలుగునిస్తోంది వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా నా హృదయం నీ పరమైంది నీ హృదయం నాకు వలైంది వదలనంటోంది ఒక్క క్షణం నాదో లోకం నీదో లోకం     మేఘుని ఉరుముకి చంద్రుని అలక కంటిపై కనుపాప అలక పాయల్ పై పాదం అలక కృష్ణునిపై రాధ అలక   ..ప్రియా నీ పై నా అలక..      

నమ్ముతారా మీరైనా

https://sanchika.com/nammutaaraa-meerainaa-dr-bh-poem/     ఎంతో ప్రేమగా పెంచిన పూల తోట నన్ను కాదని వెళ్ళింది ఇక ఎదురుగా కనిపిస్తూ నన్ను ఎంతో వేదనకి గురిచేస్తూ......... నన్ను కాదని అంటూనే నా వైపు పూల నవ్వులు విసురుతూ ... అవి రవ్వలు పుట్టిస్తూ నా గుండెన రాదని తెలిసి కాదనుకోలేక ఔననికూడ అది నాదని అనుకోలేక ఆకాశాన్ని అంటిన దుమ్ము దులుపుతూ నేను అంతలా ఆక్రోశించా ప్రియా.......రా..........రమ్మని నమ్ముతారా మీరైనా !!! ఆ పూలతోట నాదని ??????

కవిథక

మీ తోటలో నే పెంచిన పూవులు మరి మీ హృదయములో నేను నా పెదవులపై మీరు వ్రాసిన వీలునామా మన ఙ్ఞాపకం ఓ చిరునవ్వుకు చిరునామా