పోస్ట్‌లు

వలపు తాడో పలుపు తాడో తెలియక

చిత్రం
https://www.koumudi.net/Monthly/2022/october/index.html       నన్ను నేను తప్పించుకొని తిరుగుతున్నాను ఎండనక వాననక పగలనక రేయనక కంటిచూపు మేరలో కానరాలా ఎవ్వరూ అయినా ఎందుకో భయం గుప్పెట్లో చిన్న చిరు చప్పుడుకే తత్తర బిత్తర పడి కాళ్ళ గజ్జలు ఎక్కడ చప్పుడు చేస్తాయోనని అడుగు తీసి అడుగు వేస్తూ అర మైలు దూరం నడిచినంతలోనే అలుపు తీర్చుకొంటూ వగరొస్తూ సెగలు పొస్తూ భయం గుప్పెట్లో నేను కానరాని కారడివా అంటే కానే కాదు ఘాండ్రించే పులులు పాకే పురుగులు తిరిగే నడవా కాదు నరబలులు కోరే నేర ప్రపంచం రక్తాన్ని పీల్చే నరలోకం ఎవ్వరు మన పురుషులో ఎవ్వరు పరపురుషులో తెలియని మాయ లోకం వలపు తాడో పలుపు తాడో తెలియక అమాయకపు బిత్తర చూపులతో చిత్తడి నేలపై వెనుదిరిగి చూస్తూ ముందడుగు వేసి వేయలేక పక్కల చూస్తూ రాబందువుల భయంతో నేను  !!!!      

వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా

చిత్రం
http://100.26.73.229/nee-gnaapakam-oonaadu-dr-bh-poem/      నీ ఙ్ఞాపకం ఓనాడు మంటలా మండుతుంటే ఈనాడు నీ ఙ్ఞాపకం స్మృతిలా వెలుగునిస్తోంది వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా నా హృదయం నీ పరమైంది నీ హృదయం నాకు వలైంది వదలనంటోంది ఒక్క క్షణం నాదో లోకం నీదో లోకం     మేఘుని ఉరుముకి చంద్రుని అలక కంటిపై కనుపాప అలక పాయల్ పై పాదం అలక కృష్ణునిపై రాధ అలక   ..ప్రియా నీ పై నా అలక..      

నమ్ముతారా మీరైనా

https://sanchika.com/nammutaaraa-meerainaa-dr-bh-poem/     ఎంతో ప్రేమగా పెంచిన పూల తోట నన్ను కాదని వెళ్ళింది ఇక ఎదురుగా కనిపిస్తూ నన్ను ఎంతో వేదనకి గురిచేస్తూ......... నన్ను కాదని అంటూనే నా వైపు పూల నవ్వులు విసురుతూ ... అవి రవ్వలు పుట్టిస్తూ నా గుండెన రాదని తెలిసి కాదనుకోలేక ఔననికూడ అది నాదని అనుకోలేక ఆకాశాన్ని అంటిన దుమ్ము దులుపుతూ నేను అంతలా ఆక్రోశించా ప్రియా.......రా..........రమ్మని నమ్ముతారా మీరైనా !!! ఆ పూలతోట నాదని ??????

కవిథక

మీ తోటలో నే పెంచిన పూవులు మరి మీ హృదయములో నేను నా పెదవులపై మీరు వ్రాసిన వీలునామా మన ఙ్ఞాపకం ఓ చిరునవ్వుకు చిరునామా

నీవు నా ఙ్ఞాపికవి

చిత్రం
http://100.26.73.229/neevu-naa-gnaapikavi-dr-bh-poem/     నీవు నా ఙ్ఞాపికవి  ఇసుక తిన్నులపై నా అడుగుల చప్పుడిని అలల సవ్వడులతో కలిపి నా స్వప్నావస్థలో నుండి  సుప్థావస్తలోనికి మోసుకొచ్చిన  నా ఙ్ఞాపికవి   కాలం చిరుగులో దుఃఖపు తెరలు వినిపిస్తుంటే నీకు నేను తోడున్నానన్నపుడు  నీవో  ఙ్ఞాపికవి పచ్చదనపు చీర చెరుగులో వెచ్చదనపు నీ కౌగిలి జోల పాడుతూ నన్ను మైమరిపించడం నా ఙ్ఞాపకం   అత్తవారింట అడుగు పెట్టినప్పుడు అంతా కొత్తగా అవరోహణంలో జీవిస్తున్నప్పుడు నా కడుపున నీవో ఙ్ఞాపికవి  వస్తూ వంటరిగా వస్తాము తిరిగి వెళ్ళుతూ వంటరిగా వెళతామని నీకు నీవే తోడని  నీవన్నప్పుడు నీవో ఙ్ఞాపికవి అద్దాన మోము చూసినప్పుడు కంటి క్రింద చారలు కరుగుతున్న యవ్వనానికి ఓ ఙ్ఞాపిక   ఆశ నిరాశల మధ్య తప్పొప్పుల గెలుపోటములతో సాగుతున్న జీవితంపై తృష్ణ నా  ఙ్ఞాపిక ...........            

వళ్ళంతా నెమలికన్నులతో ప్రియా.............ఎదురుచూపులు

https://sanchika.com/ollanta-nemalikannulato-dr-bh-poem/   వళ్ళంతా నెమలికన్నులతో ప్రియా.............ఎదురుచూపులు ప్రేమంటే వలపంటే ప్రేమంటే మోహమైతే నా తలపుల తలుపులు తీసి నీకోసం నే చూస్తున్నా  కళ్ళళ్ళో వత్తులు వేసి నా జీవనజ్యోతిని ఆరనీయక నిలిపి వలపు తీపి వడలంతా పాకి కుదురుగా నన్ను నిలవనీయక నీ చెంత నిలచి కావి వైరాగ్యముతో నీవు నా వరసంపదవనీ  నీవే నా అష్టైశ్వర్యాలవనీ   నీ తలపులే నా కీర్తిసంపదలనీ ఈ లోకానికంతా నేచాటాలని    నేను సన్యసిస్తున్నా .... భావి జీవితాన్ని....

ఆరాధన

    చిన్న చిరు సవ్వడి నడిరేయినా మనస్సు ఉలిక్కిపాటును అణచుకోలేక తత్తరపడి తొందరపెట్టి తలదిండుగా పెట్టుకొన్న అరచేయిని గుండెలపైన ఉన్న చేయితో కలపి కన్నుల మబ్బుల తెరలను తొలగిస్తూ కిటికీ తెరచాటున నిలబడి నా నీడని చూసి నేనే ఉలిక్కిపడి నన్ను తలచిన వారిని తలస్తూ ఎవ్వరో ఎప్పుడో నాకు పంపిన మేఘసందేశాన్ని తీరికచేసుకొని ఈవేళ మేఘుడు నాకు వినిపిస్తుంటే ఆరాధన లోని అమృతాన్ని ఆస్వాదిస్తూ కన్నా వినిపిస్తుందా నా ఈ ఆలాపన ..........