పోస్ట్‌లు

పుట్టినింటి మట్టి

చిత్రం
https://vihanga.com/?p=32513      నా కూతుళ్ళు హరిజా, విరిజా దిగులు మొహాలతో బుజాలు భూమిలోకి వంచుకొని మరీ నడుస్తున్నారు,  ఇంటి వైపు. నాకు వాళ్ల దిగులు మొహాలు చూస్తుంటే ఏడుపు ఆగడంలేదు. నా కన్నీళ్ళను వాళ్ళకి కనిపించకుండా దాయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. విరజా చిన్నగా పిలిచాను............ఏంటమ్మా అంది వంచిన తల ఎత్తకుండా. ఇక్కడ జరిగిన విషయాలు నాన్నతో చెప్పకండమ్మా అన్నాను. విరజా చటుక్కున తల పైకి ఎత్తి ఎలా చెప్తామని నీవనుకున్నావమ్మా అంది. చిన్న పిల్లలు, రంగుల ప్రపంచాన్ని ఇప్పుడే తమ విప్పారిన కళ్ళతో చూస్తున్నవారు, బాధను, అవమానాన్ని దిగమింగుకొంటున్నారు.  హరిజా వంచిన తల ఎత్తకుండా నడుస్తున్నది మా ఇంటి వైపు. ఆయన గడప దగ్గర ఇంకా మేము రాలేదేమని ఎదురు చూస్తున్నాడు. మేము దగ్గరకు వెళ్ళగానే, హరీ ఏంటమ్మా చీకటి పడే లోపే ఇల్లు చేరవచ్చుగదా. ఊ............ ఫంక్షన్ బాగా జరిగిందా అంటుంటే వంచిన తల ని బలవంతంగా పైకి ఎత్తి ఆ....అ.............నాన్న చాలా బాగా జరిగింది నాన్న, అంటూ ఎక్కడలేని సంతోషాన్ని తమ కంఠంలో చూపుతూ, నాన్న నీవు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. అమ్మమ్మ, తాతయ్య ని...

దారి తప్పిన కొడుకా..........నన్ను క్షమించు

అప్పుడే తెలతెలవారబోతోంది.  సూరిడు రోమాలను నిక్కపొడుచుకొని తొంగి తొంగి మేఘాలను దాటి ముందుకొచ్చి చూస్తున్నాడు.  మా మొబైల్ క్లినిక్ తారురోడ్లపై సర్రుమని దూసుకొని పోతున్నది.  డెంగు ఫీవర్ తో పల్లెలన్ని గడగాడలాడుతున్నాయని మా మెడికల్ కాలేజి కి ఎన్నెన్నో వినతులు రావడం మూలాన ఫ్రెష్ మేడికోస్  అయిన మమ్ములను ఇలా పల్లెలకి పంపారు.  కుర్రకారంతా ఆనందముతో కొత్త సినిమా పాటలకు లయబద్దంగా హం చేస్తూ ఊగుతున్నాము.  మా డ్రైవర్ కూడా కుర్రవాడు కావడం మూలాన ఒడుపుగా బండిని పరిగెత్తిస్తున్నాడు.  గతవారం నుండి మేము, మా లేడిడాక్టర్స్ రాత్రనక పగలనక పల్లె పల్లెకి మా క్లినిక్ ని తిప్పుతున్నాము.    ఉన్నట్లుండి మా డ్రైవర్  గావుకేక పెడుతూ మా వెహికల్ ని ఒక్క కుదుపుతో ఆపాడు.  అలా చూద్దుం కదా,  ఒక ముసల్ది రోడ్డుమీద ప్రాణం లేనట్లు పడి ఉంది.  మాకందరికీ ఒక్కసారిగా గుండె ఆగినంతపనైంది.  మా డ్రైవర్ గావుకేకలు పెడుతూ, ఒక్కసారిగా క్రిందకు దూకి, ఈ ముసల్ది చావడానికి హాస్పిటల్ బండే దొరికిందా అని తిడుతున్నాడు.   ఆతను మావైపు చూస్తూ తానెంతో జాగ్రత్తగా బండ...

అక్కరకు రాని చెట్టు - ఆసరా ఇవ్వని కొడుకు

మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం. నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ లేత చిగురులను  తాలింపు  పెట్టించేదాన్ని. కమ్మని ఆ రుచి నాకు ఇంకెక్కడా తగలలేదు. మేము టౌన్లొ చిన్న ఇల్లు కట్టగానే నేను ఆ మునగ కొమ్మను తెచ్చి మా పెరట్లొ పాతాను.  అప్పటికి నాకొడుకు ఇంకా చేతికి అందిరాలేదు. టౌన్లొ ఏది కొనాలన్నా కష్టమే. నాలుగు కడుపులు నింపడానికి నేను, నా మొగుడు చానా అవస్థలు పడ్డాము. మా ముసలాడు చూస్తే నాలుగు పదులు రాకనే అదేదో మాయజారి జబ్బుతో శక్తిలేనివాడై పనికిపోక ఇంట్లో కూర్చోని తినబెట్టినాడు. నాలుగు చేతులు ఆడుతుంటేనే కష్టమైన రోజుల్లొ, నేనొక్కటే పనికి పోబెట్టినాను. కొడుకు చేతికి ఎప్పుడు అందివస్తాడా అని చూస్తున్నా.  నేను మా పెరట్లో నాటిన మునగకొమ్మ ...

దీక్ష

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10762/deeksha       ఆ రోజు మా స్కూల్ ఎంతో కళకళలాడుతోంది. పిల్లలందరూ సంతోషముతో తుళ్ళి పడుతూ స్కూల్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హాజరవుతూ ఉన్నారు. అన్ని రోజుల మా కష్టాన్ని పిల్లల ఆనందముతో మరచిపోయాము. ముఖ్య అతిథిగా మా ఊరి నుంచి మినిస్టర్ గా ఎన్నికయిన ఎం.ఎల్.ఏ ని పిలుద్దామని మా హెడ్మాస్టర్ ని ఎంతో ప్రాధేయపడ్డాము. ఆయన ఓ పట్టాన ఒప్పుకోలేదు. మా స్కూల్ ఒకప్పటి ఓల్డ్ స్టూడెంట్ ప్రస్తుత  త్రోబాల్ ఛాంపియన్ అయిన సదాశివాన్ని పిలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. మినిస్టర్ చేతుల మీదుగా అతనికి సన్మానం చేయాలని నిర్ణయించారు.  ఆయన నిర్ణయాన్ని మేము హర్షించ లేకపోయినా, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ, ఆహ్వాన పత్రిక ముద్రించడం దగ్గరనుండి, స్కూల్ ఫంక్షన్ కి స్పాన్సర్స్ ని వెతకడం వరకు అన్నీ మేము ముందుండి చూసుకున్నాము. మాకు మా హెడ్మాస్టర్ మీద ఎంతో గౌరవం మరియు నమ్మకమూను. ఆయన స్వతహాగా చాలా మితభాషి. కానీ న్యూ టీచింగ్ మెథడ్స్ ద్వారా పిల్లలకు పాఠాలను బొధించడాన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తారు. స్కూల్లో పిల్లలను ఎంతో ప్రేమగా చూసేవార...

నేను -నీవు

నీలో నేను నేను లేను లేనడం నిజం కాదు........ నాలో నీవు నీవు లేవు మాలో మీరు మీరు కారు మనం............ మనం అన్నది నిజం ! మనం విన్నది సత్యం ! నువ్వే నేను నాలో నీవు అదే మనం...... 

"మనీ" షి

ఏది నీదనుకొంటావో అది ఎప్పటికి నీది కాదు నీది కాదనుకున్నది నీదవ్వడం, అది సత్యం ! ప్రపంచములో నాదనుకున్నది ఏది లేదు, నేను తప్ప నేను కూడా నా మనిషిని కాను, నీ "మనీ" షిని !

ఙ్ఞాపకాలు

నిన్ను మరచిపోవాలని హృదయాన్ని శిలగా మార్చుకొంటే నీ ఙ్ఞాపకాలు ఆ శిలని శిల్పంగా మలుచుతున్నాయి!   ఆ శిలా శిల్పం నీవే అయితే, నిన్ను మరవడం ఎలా? కాలపు ప్రయాణములో క్షీణిస్తున్న ఙ్ఞాపకాలు  వాలుతున్న సౌధాలు బీటలు ఇస్తున్న బురుజులపై పునర్నిర్మించాను మన ఙ్ఞాపకాల సౌధాన్ని మరిన్ని ఙ్ఞాపకాలు ప్రొగుచేసి ........ నిన్ను మరువకుండా!!!