పోస్ట్‌లు

అమ్మాయి పెళ్ళి

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10784/ammayi-pelli ఆ అమ్మాయిని చూడగానే చెప్పవచ్చు తన కళ్ళు చాలా బాగున్నాయని.... ఎవరినైనా ఇట్టే అయస్కాంతంలా ఆకర్షించే తన చామనచాయ రూపం, అందానికి నిర్వచనం రంగులో లేదని అమరిన తన కనుముక్కు తీరులో ఉందని. సుద్దముక్కకు ఎక్కడైనా ఆకర్షణ ఉంటుందా. నాకా పొద్దు పోక అలా తీరుబడిగా ఇంటి వసారా లో కూర్చుని వాలే పిట్టలని, ఎకిరే పక్షులని చూడటం అలవాటు. ఆ పాప పొద్దున్నే పావడ ఓణి లో చలాకీగా తను నవ్వుతూ చకచక పనులు చేస్తూ తిరుగుతుంటే చూడముచ్చట వేసేది. మా ఇంటి యజమాని గూర్చి చెప్పకూడదు, కానీ అబ్బో చండశాసనుడు. మండలం కార్యాలయం లో ఏదో ఉద్యోగం  వెలగబెడుతున్నాడని పేరుకే కానీ, ఎప్పుడూ ఇంటిపట్టునే ఉంటూ భార్యను, బిడ్డను కంటికి రెప్పలా ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటున్నాడు. పొద్దున నిద్దుర లేస్తూనే అమ్మ సరోజా మొక్కలకు నీళ్లు పెట్టమ్మా, అమ్మ కాఫీ పట్టుకు రామ్మ, అమ్మాయి పేపర్ తీసుకురా అమ్మా అని ప్రతి క్షణం తనను కలవరించేవాడు. మరి నా గురించి చెప్పనే లేదు కదూ. నేను ఈ మధ్యనే పీలేరు లోని డిగ్రీ కళాశాల లో జంతుశాస్త్రం లెక్చరర్ గా చేరాను. ఇదిగో ఈ అమ్మాయి సరోజ ఇంట్లో...

మనసారా నాదైన

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10775/manasara-naadaina     మా కుట్టి అంటే నాకెంతో ఇష్టం. తన ఆలోచన, నడవడిక  అందరికి  భిన్నంగా ఉండేవి. ఏయ్ కుట్టి అలా వీది చివరవరకు రారా,  అంటే  నేను తన బావనైనా, కాబోయె భర్తనైనా, సారి బావ, ఇటువంటివి నన్ను అడగకు అనేది. నేను తనకు ఎంతో నచ్చచెప్పాలని చూసా, వింటెనా,  నాకు తనతో కలసి నడుస్తూ ఉంటే గాలిలొ తేలిపొయినట్లు ఉండేది.అలా జీవితం చివరవరకు నడవాలని ఉండేది. కుట్టీ మనం చిలకా గోరింకలా ఉన్నామంటున్నారు నా స్నేహితులు అన్నా ఓ రోజు. "చాల్లే బావా,  మనమేమన్న పక్ష్లులమా అలా ఆకాశంలో ఎగిరిపోవడానికి,కొంచెం నేల మీద నడువు బావా,"అన్నది. నేను తన ఇంట్లో ఉన్నపుడు,నేనేమి అడగకున్న నాకేమేమి ఇష్టమో చేసిపెట్టి కొసరి కొసరి వడ్డించెది.  నాకు బిసిబేళ్ బాత్ ఇష్టమని బెంగుళూర్ లో ఉన్న తన స్నేహితురాలిని అడిగి నేర్చుకొని నాకోసం వండిపెట్టింది. నామీద నీకెందుకంత ప్రేమ బంగారు మరదలా అంటే "నువ్వు నా మురళీ మనోహరుడివి బావా"  అనేది. అలాంటి నేను ఇలా మారిపొయానేంటి ? వాడెవడో తన వెంటపడుతున్న, తనని ప్రేమించమని పోరుతున్నా, ఆ విషయం తను ...

చెల్లని కాసు

  http://100.26.73.229/chellani-kaasu-dr-bh-poem/       ఎంతో అందమైనదానినని నాకు పొగరు కన్నుల మిలమిల నా వంటి తళతళ అందరూ నన్ను కావాలనుకొనేవాళ్ళే హృదయంలో పదిలపరచుకొనేవాళ్ళే నా చుట్టూ అల్లుకొన్న కథలు ఎన్నో   కూటికి బిచ్చగాడైన్న కోటికి నవాబైనా గుప్పెట్లో వెచ్చగా నిద్రపుచ్చినవారే కలల్లొ నేనే      ఆడించా పాడించా కవ్వించా నన్నుచేజిక్కించుకొవడానికి గిరగిర గాలిలో నన్ను తిప్పి బొమ్మా బొరుసు ఆడి  నాకోసం ప్రాణం వదిలిన వాళ్ళెందరో  నన్ను చూడగానే చిన్నారుల కళ్ళళ్ళో మెరుపులు ముసలి వాని పడుచు పెళ్ళాం నన్నోరొజు నా మీద మోజు తీరిందన్నది   నన్నో చెల్లని కాసన్నది  వీది గుమ్మం వైపు విసిరి కొట్టింది తమకంతో నన్నందుకొంటారేమోనని నేచూసాను    నన్నందరూ చూసి నవ్విపొయిరి  నేను తగనని నిన్నటికి నేనెంతో విలువైనదానిని  ఈరోజు నాకాళ్ళు కడిగి దానం చేసేవారేరి  నేనైనాను బిడియాన్ని వదలించే సిగ్గుబిళ్ళని  చెల్లని కాసుని   

మోహనాంగినై

నీకు నాకు మద్య ఎడమున్నది అన్నది అది ఎవరని ప్రభూ  ! జీవాత్మ పరమాత్మ చెంతకు చేరినది కాని నీ హృదయం నా చెంతనే నిలచి ఉన్నది వరదలా నీ ప్రేమతో నన్ను ముంచెత్తుతున్నావు. నా కాలి అందియల సవ్వడి నిన్ను మేల్కొలుపునేమోనని తత్తరపడుచూ మోహనాంగినై   నీ అడుగుజాడలనే నేను వెతుకుచున్నాను....

మూడు తరాల కథ

చిత్రం
https://www.gotelugu.com/telugustories/view/10725/moodu-tarala-katha      "వద్దు వద్దంటే మెడ గట్టినారు పెద్ద ఎద్దంటి పెళ్ళాన్ని కూర్చుంటే గుంజిల్లు లేస్తే మెడిగాల్లు అబ్బో అది ఆలి కాదు ఎర్రతేలు " అని మా తాత అనేవాడని మా అమ్మమ్మ చెప్పేది. పుణ్యాత్ముడు మా తాత ఏ లోకాన ఉన్నాడో గాని  మా అవ్వ ఇప్పటికి "బెత్తెడు మనిషి జానెడు బుద్ది"  అంటూ  ఆయన చమత్కారాలని తలస్తూనే ఉంది. తాత ఈ లోకానికి టాటా చేప్పెసి ఐదు దశాబ్దాలు దాటింది. అమ్మమ్మ నవదశకాన్ని పూర్థి చేసింది. అమ్మమ్మ తోటి ప్రయాణీకులందరూ కాలగతిన కలసిపోయారు. మా అవ్వని నలుగురు పిల్లల తల్లిని చేసి ఆయన బాద్యతలు తీసుకోక "డబ్బు మిథ్య"  అంటూ "కలగంటి కలగంటి నేను కమలాక్షునయనాలను కలగంటి" అంటూ జీవితాన్ని కీర్తనలతో గడిపేశాడు. ఆమె నలుగురు పిల్లలలో మా అమ్మ ఒక్కతి.   మా మావయ్య పెళ్ళి :.................... మా అమ్మమ్మ కుటుంబంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా పెద్ద మావయ్య గురించి.  ఆయన ఒక రాబిన్ హూడ్ లా ఫీల్ అయ్యేవాడు. ఇంట్లొ ఉన్న బియ్యము పప్పులు అన్నీ ఎవరైనా వచ్చి బియ్యం నిండుకున్నాయి అంటే చాలు ఇచ్చేసేవాడ...

అమ్మ పాల కే కరువాయే

రాజులు పోయారు రాజ్యాలు పోయాయి రాణివాసపు చెర వీడింది నదులు నదీగర్బాలు మాంసపు ముద్దల్లా పచ్చని పంట పొలాలలొ బీటలు మొలకెత్తే పుత్తడి చిత్తడి గా మారె రైతన్నకే నేతికే కరవు నకనకలాడే కడుపును చేతబట్టి ఊళ్ళనే దొడ్డి బయల్లుగా మార్చి  పట్నంవైపు సాగె  కనుతెరచినా ఆకాశసౌధాలు    ఇటుకపై ఇటుక పేర్చి సిమెంటుతో   పొట్ట నింపి ఎముకల పోగయ్యాడు  కళ్ళుబైర్లు క్రమ్మితే నిలచిన పొద    కాళరాత్రినే చూపె నట్టనడవి నిట్ట నిలువునా ముంచే సరస్సులే గడ్డ కట్టి  అమ్మ పాల కే కరువాయే

మనుషులు ఇరువురు

 మనుషులు ఇరువురు వారిమధ్య చీకటి అగాథం   చుట్టూ బీటలు వారిన కోటలు శత్రురాజ్యపు  సైనికుల్లా అప్పుడప్పుడు  సుతిమెత్తటి మాటల ఈటెలు    నిశ్శబ్దపు  ఈదురుగాలులు  కాటుక క్రమ్మిన మబ్బులు అల్లంతదూరాన చిరు దివ్వెలు