పోస్ట్‌లు

అక్టోబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?

నాకో తోడు కావాలి ఆ తోడు నా నీడై రావాలి నన్ను వెన్నంటి సముద్రపు సునామిలోనికి వెండి పాయలు నన్ను ముగ్గుబుట్టని చేస్తుంటే ప్రేమెందుకని అంటున్నారా  వానపాముకి మట్టిమీద ఎందుకు ప్రేమో అడిగారా మీరెవరైనా జాబిల్లి వయస్సెంతో కనుక్కోగలరా మీరెవరైనా కూకూ పిట్టలు కులుకుతూ ఎగురుతుంటే కళ్ళప్పగించిచూస్తున్నారే నాకోతోడు చూడాలని అనిపించలేదా పండుటాకులా నే నేల రాలిపోకముందే నన్ను ప్రేమించే ఓ హృదయం కావాలి నాకు మీరెప్పుడైనా అటువంటి హృదయాన్ని చూసారా?

హృదయములోనే తనను దాచుకొని

తన జాడ తెలియక ఎక్కడుందో ఏమైందోనని కొండలు కోనలు గాలించా కుదరక సముద్రాన్నే తోడించా రాసులు పోసిన తారలచే నెలవంకను  అడిగించా కలలోకి రాక తన జాడ తెలియక నేనల్లాడిపోయా...............  హృదయములోనే తనను దాచుకొని 

నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ

(https://www.neccheli.com/2023/01/%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%82-%e0%b0%95/)   దప్పికతో ఒయాసిస్సులను వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనకలాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుచున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తిర్చినందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ      నాది నావాళ్ళంటూ  ప్రాణం పొయినా మమకారాన్ని చంపుకోలేక నా అత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు   అమ్మ కడుపున ఊపిరి పొసినందుకు     నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవైనందుకు   నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ  కడుపు నిండినా మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నాగుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలివై, భార్యవైనందుకు ...

జీవించి ఉన్న రాతిబోమ్మవలే

అబ్బబ్బా ఏంటో ఈ చిరుతిండ్లు                 హై న్యూట్రియంట్  ఫూడ్ లు             నాలుకపై జారి లొగొంతుకతో  పిజాను జాగింగ్ తో  ట్రెక్కింగ్ ని కింగ్ బ్రాండ్ తో   కవర్ చేస్తూ  ఓర సూపులు చూస్తూ ఓర్వలేక నా బొజ్జాసురిడిని గోళాసూరిడిని చేసి  బిగ్ బెల్లీ గా మురిపిస్తూ ప....కోడి   ప....లావులను ఆరగిస్తూ డబ్బును కరిగిస్తూ ఒళ్ళుని ఓడను చేసి కరగని మస్తితో 16.....కే......60 నడిచే మనిషి నడవని హృదయంతో గుండె తన రైడింగ్ ని కోలా స్టిరాల్ తో  సిప్ చేస్తూ పగలు వంద చాటింగ్లు వేలకొద్ది SMS   లు సాయం సంద్యలు పబ్ లలో చలి కాచుతూ   లిజాలు లాజాల తో భుజాలు కలుపుతూ  ధం ధం కి మత్తు  మస్త్ మస్త్ గా చాట్ మసాలాలు ప....నీర్ పాస్తాలు   రాత్రిళ్ళు పగటి కలలతో వేడి ఊపిర్లు వదలుతూ జీవించి ఉన్న రాతిబోమ్మవలే  

పరువాల వాన

ఓహ్ పరువాల వాన అశరీరంగా నేలను తడిపె సూక్ష్మబిందువై  కోరికలు సుల్లు తిరుగుతూ పచ్చాని గరికై మొలిచె మొగ్గ తొడిగి గడ్డిపూల పరిమళాలు నాశికాపుటలను దాటి    మస్తిస్కానికే సోకి పలుకరించె రెమ్మ రెమ్మని సీతకోక చిలుకల సవ్వడికి తూగుటుయ్యాలలూగె పచ్చపచ్చని పిట్టలు పాటను నేర్పె పరువాల వానకి కోకిలల కుహూ రాగాలు  టప టపమని ప్రతిద్వని చేస్తూ ఖవ్వాలి పాడుతూ      ప్రకృతిని నిద్రపుచ్చె    జోల పాడి

సంధ్య పొద్దుకాడ

తొలి సంద్య ఆ అద్బుతాన్ని ఎప్పుడైనా చూసారా వళ్ళు విరుచుకొంటూ సూరిని తొలి పాదపుటడుగులు తూర్పు దిక్కున పడుతుంటే  వెచ్చని అతని వెలుగులు పిల్లతెమ్మరలు తాకిన వసుఃసుందరి వయస్సుని మెరిపిస్తూ ఒల్లంతా పసిడిని నింపి కన్నెపిల్ల బుగ్గలలొని పసుపుదనాన్ని తన అధరాల ఎర్రదనాన్ని శయన మందిరంగా చేసుకొని తన గుండెల లోలోనికి ఒరుసుకోనిపోతూ ప్రతి సంద్యోదయము  మొదటి రాత్రికి నవోదయంగా  కాటుకకళ్ళలోని కాళరాత్రిని తరుముతూ వెలుగు చీకటిలు తమకంగా వాటేసుకొని ఒకరు తూర్పున పడమట అలిగిన రాత్రిని చెట్టాపట్టాలేసుకొని జాబిల్లి తన చల్లదనాన్ని పానం చేస్తూ జొడుగుర్రలపై స్వారీచేస్తూ వస్తున్న ఆ వెలుగుల రేడుకి తనని అందుకోమని బుగ్గన సొట్టపెట్టుకొని కైపెక్కిన కళ్ళతో ఆహ్వానం చెబుతూ సంద్య వాకిటిన ఆ కిరీటిని నిలిపి 

కృష్ణా

క్రుపావల్లభా చేతులు ముఖులించి ప్రార్తించి  వెనుతిరిగి నే చూచిన నీ పాదపు గుర్తులు నా వెంటే ఉండి నన్ను నడిపించుచున్నవి   చిమ్మ చీకటిన వెలుగులు పంచే నక్షత్రాలు   నాకు దారి చూపుతూ నా హృదయాన్న నీపై కోరికనే పెంచి నిన్ను చేరరమ్మని నన్ను తొందరపెట్టుచున్నవి భుజములు పై మోపిన కావిడికుండలు నీటిబుడగలై నీ రాధనై నీకై నేను నడచుచున్న వగర్చుచూ నిన్ను చేర

ద్రౌపతి పుత్రులు

చిత్రం
  https://www.gotelugu.com/telugustories/view/10691/droupati-putrulu   మార్నింగ్ నేను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు దుబాయి పోలిస్ నుండి నాకు కాల్ వచ్చింది. ఎంతో విశిస్టమైన విషయమని తొందరగా రమ్మని చెప్పడంతో నాకు విలేఖరి గా బారతీయ రాయబారితో సమావేశం ఉన్నా, నేను ఒక గంట ఆగి వస్తానని వెంటనే మెస్సేజ్ పంపి దుబాయి పొలిస్ టవర్ కి వెళ్ళా.  నన్ను చూడగానే ఎంతో గౌరవంగా విష్ చేసిన దుబాయి ముఖ్య పోలిస్ అధికారి తనతో తీసుకొనివెళ్ళి ఒక బారతీయ కుటుంబాన్ని నాకు పరిచయం చేసాడు. తన మాటలలొ సంగ్రహముగా ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళనుండి ఎటువంటి విసా పత్రాలు లేకుండానే వారి దేశాన నివసిస్తున్నారని చెప్తూ వారిని చూపించాడు. అక్కడ ముక్కు పచ్చాలారని పసిపిల్లలు దుబాయి సేఠ్ దుస్తులలో , వారితో వాళ్ళ తల్లి. అతని మాటలలొ ఆ కుటుంబాన్ని ఇండియా పంపడానికి ఆమ్నేస్టి ముందుకు వచ్చిందని కాని వారికి ఎటువంటి జన్మ ద్రువ పత్రాలు కాని, విసా కాని, పాస్ పోర్ట్ కాని లేదని, వారిని వారి దేశానికి ఎలా పంపాలొ తెలియడంలేదని చెప్తూ వారి తల్లి ఆ పిల్లలని తన పిల్లలని ఒప్పుకోవడంలేదని, ఈ ఇస్స్యు తనకి చాల తలనొప్పి కలిగిస్తున్నదని, ఒకసారి నన్ను వారిత...