జీవించి ఉన్న రాతిబోమ్మవలే


అబ్బబ్బా ఏంటో
ఈ చిరుతిండ్లు
                హై న్యూట్రియంట్  ఫూడ్ లు            
నాలుకపై జారి
లొగొంతుకతో
 పిజాను జాగింగ్ తో 
ట్రెక్కింగ్ ని కింగ్ బ్రాండ్ తో  
కవర్ చేస్తూ 
ఓర సూపులు చూస్తూ
ఓర్వలేక
నా బొజ్జాసురిడిని
గోళాసూరిడిని చేసి 
బిగ్ బెల్లీ గా మురిపిస్తూ
ప....కోడి   ప....లావులను
ఆరగిస్తూ
డబ్బును కరిగిస్తూ
ఒళ్ళుని ఓడను చేసి
కరగని మస్తితో
16.....కే......60
నడిచే మనిషి
నడవని హృదయంతో
గుండె తన రైడింగ్ ని
కోలా స్టిరాల్ తో 
సిప్ చేస్తూ
పగలు వంద చాటింగ్లు
వేలకొద్ది SMS   లు
సాయం సంద్యలు
పబ్ లలో చలి కాచుతూ  
లిజాలు లాజాల తో భుజాలు కలుపుతూ 
ధం ధం కి మత్తు 
మస్త్ మస్త్ గా
చాట్ మసాలాలు
ప....నీర్ పాస్తాలు  
రాత్రిళ్ళు పగటి కలలతో
వేడి ఊపిర్లు వదలుతూ
జీవించి ఉన్న రాతిబోమ్మవలే  






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ