పరువాల వాన


ఓహ్
పరువాల వాన
అశరీరంగా
నేలను తడిపె
సూక్ష్మబిందువై 
కోరికలు సుల్లు తిరుగుతూ
పచ్చాని గరికై
మొలిచె మొగ్గ తొడిగి
గడ్డిపూల పరిమళాలు
నాశికాపుటలను దాటి   
మస్తిస్కానికే సోకి
పలుకరించె
రెమ్మ రెమ్మని
సీతకోక చిలుకల
సవ్వడికి
తూగుటుయ్యాలలూగె
పచ్చపచ్చని పిట్టలు
పాటను నేర్పె పరువాల వానకి
కోకిలల కుహూ రాగాలు 
టప టపమని
ప్రతిద్వని చేస్తూ
ఖవ్వాలి పాడుతూ
     ప్రకృతిని నిద్రపుచ్చె   
జోల పాడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ