నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
(https://www.neccheli.com/2023/01/%e0%b0%a8%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%95%e0%b1%83%e0%b0%a4%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%a4%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%82-%e0%b0%95/)
దప్పికతో ఒయాసిస్సులను వెదకుచూ
ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు
గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
ఆకలితో నకనకలాడుచున్న
కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుచున్నపుడు
గుప్పెడు మెతుకులతో ఆకలిని తిర్చినందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
నాది నావాళ్ళంటూ ప్రాణం పొయినా
మమకారాన్ని చంపుకోలేక నా అత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు
అమ్మ కడుపున ఊపిరి పొసినందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
లోకం పోకడ తెలియక బుడి బుడి
నడకలతో చెడుబాట పట్టినపుడు
నడక నేర్పడానికి తండ్రివి నీవైనందుకు
ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు
గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
ఆకలితో నకనకలాడుచున్న
కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుచున్నపుడు
గుప్పెడు మెతుకులతో ఆకలిని తిర్చినందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
నాది నావాళ్ళంటూ ప్రాణం పొయినా
మమకారాన్ని చంపుకోలేక నా అత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు
అమ్మ కడుపున ఊపిరి పొసినందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
లోకం పోకడ తెలియక బుడి బుడి
నడకలతో చెడుబాట పట్టినపుడు
నడక నేర్పడానికి తండ్రివి నీవైనందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
కడుపు నిండినా మనస్సు పండక ప్రేమను కోరుతున్న
కట్టెని కాల్చడానికి నాగుండె దాహాన్ని తీర్చడానికి
ప్రియురాలివై, భార్యవైనందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి
వయస్సుడుగుతున్నపుడు నా భుజాలచుట్టూ చేతులు వేసి
నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి
నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
కడుపు నిండినా మనస్సు పండక ప్రేమను కోరుతున్న
కట్టెని కాల్చడానికి నాగుండె దాహాన్ని తీర్చడానికి
ప్రియురాలివై, భార్యవైనందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి
వయస్సుడుగుతున్నపుడు నా భుజాలచుట్టూ చేతులు వేసి
నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి
నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు
నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ
very nice feelings
రిప్లయితొలగించండి