పోస్ట్‌లు

ఆగస్టు, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

పండు

మనస్సుతో నేను నీకొక లేఖ రాసాను నింపాన్నందులో మాటలకందని మౌనాన్ని కనురెప్పలు ఏవేవొ గుసగుసలు పోతుండగా      కదిలే కాలం నాకు రెక్కలనే తొడిగింది నువ్వు నన్ను తలచిన మరుక్షణం ఊహ నిజమౌతుండగా  నీ ముందు నిలుచున్నా నేను     నీవు నన్నొ రోజు అడిగావు గుర్తుందా నీవంటే నాకెందుకంత ఇష్టమని  ఇంద్రధనుస్సు ఇష్టం  విరిసినపూవు నీకు ఇష్టం అమ్మన్నా ఇష్టం నింగిలోని చుక్కలంటే  ఎందుకిష్టము పడవలు చేసి వర్షపు నీటిలో ఆడటం నీ ఇష్టం  నవ్వే నేనన్నా నీకు ఇష్టం అలిగిన నా మనస్సు తడమడం నీకు ఇష్టం  నువ్వంటే నీకు ఇష్టం అందుకే ఇష్టం ..... ఎప్పటికి      

పండు .....

నీ పెదవులతో నా హృదయాన    నీవు పాడిన పాట కొమ్మలురెమ్మలై చివురించె   మూసిన కనులు తడియారి ఎదురుచూసె మరణదరిన  నీకోసం

పండు

తొలిముద్దు దొంగలిచ్చిన ఆనందము  నిన్ను తొందరపెడుతుంటే   కనురెప్పలు వాల్చిన నీ ప్రేయసిని జాము రాతిరి జాగు చేయక  వడివడిగా రమ్మని తన జారు ముడిని దిగలాగడం నీకు సరితూగునా కాకెంగిలి అంటే నీకెందుకంత ప్రీతి 

పండు

నిద్ర లేచి తూర్పు దిక్కున చూసా ఉదయించే సూరీడు మా ఇంటి పెరటినంతటిని ఆక్రమించగా పచ్చపచ్చని పూలు       చల్లటి గాలి వెచ్చటి నీ వెలుగులు నరనరాన పాకి మేఘుడినే నేనాజ్ఞాపించా       తొలకరి జల్లులు కురియాలని     నా మనస్సంతా నువ్వు విరియాలని

వెండి వెన్నెల

మా ఊరంతా నిండిన వెండి వెన్నెల మాదొక ఊరు కొండలకవతల ఆకాసపుటంచు చివరన నేలంతా పచ్చిక బయళ్ళు పలకరించె పిల్లగాలులు రారమ్మని పిలిచే సెలయేళ్ళు నేలను తాకే మబ్బులు మేఘాలతో పోటిపడే పక్షులు కూనలమ్మలకి చివురులు తినిపించే కొకిలలు అంతా వెళ్ళివిరిసిన చల్లని మా వెన్నెలమ్మ మాఊరి ముద్దుల పాప మా అందరి కన్నుల పాప ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పాప తన ముద్దు మురిపాలతో ముచ్చట్లతో తడిపె మా హృదయాన్నే తన ఆటలు పాటలు మారే మా కన్నుల పంటగా ఆకాశంలోని పక్షులు తనకోసం నేలమీదకే దిగిరాగా పువ్వులన్నీ విరిసేను తనకోసమే మా కన్నుల పంట మా వెన్నెలమ్మ అమ్మ పొత్తిళ్ళలో కన్నులార్పుతూ నన్ను ఎత్తుకోమంటూ పిడికిళ్ళు బిగించి చేతులు చాపుతూ మీరంతా నావారంటూ బుడిబుడి నడకలతో నన్ను పట్టుకొమంటూ పరిగెత్తుతూ గెంతులెస్తూ అమ్మపాలు తాగే లేగదూడ మా వెన్నెలమ్మని ఆట పట్టిస్తూ పసి ప్రాయపు మా వెన్నెలమ్మ ప్రాయన్నే మెరిసేను ఓ మల్లెలా తుమ్మెదల రెక్కల బిగియైన పరువముతో కాంతులీనుతున్న తన మేని మెరుపుల ముందు నక్షత్ర పు వెలుగులు వెలవెల పోయే టపటప రాలే చినుకులు ఆ చినుకుల పందిరిలొ తడసిన పువ్వులు ఆ పువ్వుల తడిసిన...