వెండి వెన్నెల
మా ఊరంతా నిండిన వెండి వెన్నెల
మాదొక ఊరు కొండలకవతల
ఆకాసపుటంచు చివరన
నేలంతా పచ్చిక బయళ్ళు
పలకరించె పిల్లగాలులు
రారమ్మని పిలిచే సెలయేళ్ళు
నేలను తాకే మబ్బులు
మేఘాలతో పోటిపడే పక్షులు
కూనలమ్మలకి చివురులు తినిపించే కొకిలలు
అంతా వెళ్ళివిరిసిన చల్లని మా వెన్నెలమ్మ
మాఊరి ముద్దుల పాప
మా అందరి కన్నుల పాప
ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పాప
తన ముద్దు మురిపాలతో
ముచ్చట్లతో
తడిపె మా హృదయాన్నే
తన ఆటలు పాటలు
మారే మా కన్నుల పంటగా
ఆకాశంలోని పక్షులు
తనకోసం నేలమీదకే దిగిరాగా
పువ్వులన్నీ విరిసేను తనకోసమే
మా కన్నుల పంట
మా వెన్నెలమ్మ
అమ్మ పొత్తిళ్ళలో కన్నులార్పుతూ
నన్ను ఎత్తుకోమంటూ పిడికిళ్ళు
బిగించి చేతులు చాపుతూ
మీరంతా నావారంటూ
బుడిబుడి నడకలతో
నన్ను పట్టుకొమంటూ
పరిగెత్తుతూ గెంతులెస్తూ
అమ్మపాలు తాగే లేగదూడ
మా వెన్నెలమ్మని ఆట పట్టిస్తూ
పసి ప్రాయపు మా వెన్నెలమ్మ
ప్రాయన్నే మెరిసేను ఓ మల్లెలా
తుమ్మెదల రెక్కల బిగియైన పరువముతో
కాంతులీనుతున్న తన మేని
మెరుపుల ముందు నక్షత్రపు
వెలుగులు వెలవెల పోయే
టపటప రాలే చినుకులు
ఆ చినుకుల పందిరిలొ తడసిన పువ్వులు
ఆ పువ్వుల తడిసిన అందము
నింపెను పొంగులు మా వెన్నెలమ్మ మదిన
పచ్చని పావడ పాపిట బిళ్ళ
మందారపు ఎరుపెక్కిన ఎర్రటి బుగ్గలు
ఒల్లంతా పసిడి రాసులు
కాళ్ళకు పారాణి
చెతుల వంకీలు జడన జాజులు
గుండెలమీద రత్నల హారాలు
కాళ్ళగజ్జలు గళ్ళుగళ్ళుమన
కన్నులకింపుగా మా వెన్నెలమ్మ
కాముడికి కైపెక్కక మానునా
కటిక చీకటిలోను కాంతులీనే
మందారపు ఎరుపెక్కిన ఎర్రటి బుగ్గలు
ఒల్లంతా పసిడి రాసులు
కాళ్ళకు పారాణి
చెతుల వంకీలు జడన జాజులు
గుండెలమీద రత్నల హారాలు
కాళ్ళగజ్జలు గళ్ళుగళ్ళుమన
కన్నులకింపుగా మా వెన్నెలమ్మ
కాముడికి కైపెక్కక మానునా
కటిక చీకటిలోను కాంతులీనే
తన కన్నులు పిలిచె వలచ
రారమ్మని యవ్వనపు రారాజులను
చిక్కనైన చీకటి
కోరికనే నింపె తన నరనరాన
వలచేను ఆ చందురూన్ని
తేనె నిండిన కంఠముతో
పిలిచేను తనని రారమ్మని
నిద్రలేని రాత్రులతో
కాముడుపై కొరికతో
వానిచే వలపించుకొవడానికి
చేసె ఒక యాగాన్నే
సెలయేరునందు నురగ వంటి కురులతో
మందార తైలమే మర్దించి
తెల్లని వలువలు దరించి
అశోకవనాన నిలచి
తన కాంక్షనే చూసి
పచ్చని పసిరిక పాములు రెండు
పెనవేసెను హృదయాలని
శరీరాన్నే ధగ్నం చేసి తమ
ఆత్మ కాంక్ష చల్లార్చుకోవడానికి
తన ప్రేమని చూసి మోహించి
దిగివచ్చెను చందురూడు
తాము ఇరువురు ఏకశరీరులమని
తను వలచి వానిచే వలపించుకొని
ముడి వేసెను భువిని దివిని
వానిని చూసి విరిసిన మోము
ముకులించిన మేనితో
సిగ్గులొలుకుతుండగా
పరవశించెను మా వెన్నెలమ్మ
చందురూని స్పర్శతో
రాగరంజితమైన తన మనస్సు
పురివిప్పి ఆడెను
చినుకు రాలుతుండగా
మరపున కూడా మరువకూడదని
దివికేగెను వాని హృదయాన నిలచి
ఇప్పటికి మా వెన్నెలమ్మ మమ్ములని
మరువక మాసానికోమారు
తన పుట్టింటిని ముద్దాడ
ప్రవహించును నింగి నుండి నేలకు
మా రాగాల చిలుక
(నా చిన్నారి చిట్టి పాపలు షమిత, హితైషి లకు ప్రేమతో)
మా రాగాల చిలుక
అనురాగాల మొలక
మా వెన్నెలమ్మ
(నా చిన్నారి చిట్టి పాపలు షమిత, హితైషి లకు ప్రేమతో)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి