రుద్రభూమి
నువ్వన్నావు నా గురించి నీకేమి తెలుసని
నేనన్నాను ప్చ్.... నాకేమి తెలియదని
నువ్వన్నావు నేనంటే నీకెందుకంత ప్రేమని
నేనన్నాను జాబిలి అంటే
ఎవ్వరికి ఇష్టముండదని
ఎవ్వరికి ఇష్టముండదని
నువ్వన్నావు మరి నన్ను వదలి వెళ్ళవుకదా అని
నేనన్నాను కలలో కూడా నీతోటే నేనని
నువ్వన్నావు ఫారిన్ చాన్సని రేపే ప్రయాణమని
నేనన్నాను నీకల నిజమైందని త్వరగా తిరిగిరమ్మని
నువ్వన్నావు నాన్న మాట కాదనలేనని పెళ్ళికి తొందరని
నేనన్నాను నీ తరువాతే నాకెవరైనా అని
నువ్వన్నావు చెల్లి పెళ్ళి చేయాలని కట్నం కావాలని
నేనన్నాను నా మనస్సు నీదని ధనదాహం తీరనిదని
నువ్వన్నావు తల్లితండ్రుల మాట జవదాటనని
నేనన్నాను నీమాట కాదనలేనని ...........
నువ్వన్నావు నిన్ను ఎన్నటికి మరువనని నాహృదయం నీదని
నేనన్నాను నీకు హృదయమే లేదని అది ఒక రుద్రభూమి అని
చెప్పదలచుకున్న విషయాన్ని అతి సున్నితంగా అక్షర రమ్యంగా చెప్పారు!
రిప్లయితొలగించండికొన్నిసార్లు అలా జరిగిపోతుంటుంది
రిప్లయితొలగించండిvery nice
రిప్లయితొలగించండిSuper amma
రిప్లయితొలగించండిsunny thanks naanna
రిప్లయితొలగించండి