రుద్రభూమి

 
నువ్వన్నావు నా గురించి నీకేమి తెలుసని
నేనన్నాను ప్చ్.... నాకేమి తెలియదని  
నువ్వన్నావు నేనంటే నీకెందుకంత ప్రేమని
నేనన్నాను జాబిలి అంటే 
ఎవ్వరికి ఇష్టముండదని
నువ్వన్నావు మరి నన్ను వదలి వెళ్ళవుకదా అని
నేనన్నాను కలలో కూడా నీతోటే నేనని    
నువ్వన్నావు ఫారిన్ చాన్సని రేపే ప్రయాణమని
నేనన్నాను నీకల నిజమైందని త్వరగా తిరిగిరమ్మని
నువ్వన్నావు నాన్న మాట కాదనలేనని పెళ్ళికి తొందరని
నేనన్నాను నీ తరువాతే నాకెవరైనా అని
నువ్వన్నావు చెల్లి పెళ్ళి చేయాలని కట్నం కావాలని
నేనన్నాను  నా మనస్సు నీదని  ధనదాహం తీరనిదని
నువ్వన్నావు తల్లితండ్రుల మాట జవదాటనని  
నేనన్నాను నీమాట కాదనలేనని ...........  
నువ్వన్నావు నిన్ను ఎన్నటికి మరువనని నాహృదయం నీదని  
నేనన్నాను నీకు హృదయమే లేదని అది ఒక రుద్రభూమి అని     

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ