అభయ హస్తం
https://sanchika.com/abhaya-hastam-story-dr-bh/
"అమ్మా"...అంటూ నా కూతురు నీల ఇంటి లోకి అడుగు పెట్టగానే సోఫాలో కూర్చుని ఉన్న నన్ను చూడగానే దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలో పడుకుని ఏడవడం మొదలు పెట్టింది...
"ఏమైందమ్మా...చెప్పు! ఏమి జరిగింది" ఆదుర్దగా నేను అడిగా...
అమ్మా
మా కాలేజ్ లో ఈ రోజు మా సీనియర్ రఘు అందరి
ముందు నా చెయ్యి పట్టుకుని లాగాడు !!! "నేను
వదులు... వదులు".... అంటూ ఉన్నా వినిపించుకోకుండా "నేను నిన్ను ప్రేమిస్తున్నాను"... "నువ్వు
ఒప్పుకోవాలి అంటున్నాడు".....నా
కూతురి ఏడుపు చూసి అమ్మగా నా కళ్ళల్లో నెత్తురు కారుతోంది కన్నీళ్ళకు బదులుగా..... నీల ఏడుస్తూ
అంటున్నది "అమ్మా నేను
నా వేదన ఎవరికి చెప్పుకోవాలి? అతను మళ్ళీ
మళ్ళీ నేను వెళ్ళే దారి కాసి తన చేతులు అడ్డుపెట్టి మరీ నన్ను ప్రేమించు....అంటున్నాడు"
నేను ఆలోచిస్తున్నా...పరిష్కారం ఏమిటి అని?
పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా ! వద్దా ! వెళ్లితే ఏమౌతుంది! కొడ్తారేమో అతడిని ! నా కూతురి జీవితం అగుడైపోతుంది అని...ఆలోచిస్తున్నా ! ఆ సీనియర్ రఘు జీవితం నాశనం అవుతుంది !!! కుర్రాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పు... ఒక జీవితాన్ని నాశనం చేయవచ్చా?...వెళ్లకపోతే ఇంక ఎక్కడికి వెళ్లాలి ! ఆలోచిస్తున్నా?
వెంటనే నేను లేచి నా కూతురితో "వెళ్దాము రా" ...అని తన చేయి పట్టుకుని బయటకు వచ్చి స్కూటీ తీసి తనని ఎక్కమన్నాను. శూన్యమైన మొహంతో నా కూతురు బండి లో కూర్చున్నది. నేరుగా నేను బండిని తన కాలేజ్ వైపు పోనిచ్చాను. కాలేజ్ చేరగానే, ప్రిన్సిపాల్ రూమ్ వైపు నడిచాను. ఒక లాయర్ గా నాకు ఉన్న పలుకుబడి, అనుభవంతో సున్నితంగా వ్యవహరించాలి అని అనుకున్నా. నన్ను చూడగానే ప్రిన్సిపాల్ "రండి మేడం..." అంటూ పలకరించి కూర్చోమన్నారు. నా కూతురు నిలబడి ఉంటే "నీల కూర్చో అమ్మ" అని ప్రిన్సిపాల్ అన్నారు. నింపాదిగా తను కూర్చున్నాక ప్రిన్సిపాల్ వైపు చూసి చెప్పడం మొదలుపెట్టా. ఆయన నా మాటలు వినగానే నిరుత్తరుడై వెంటనే విద్యార్థి సంఘం నాయకుడికి కబురు పెట్టారు. కాలేజీ డీన్ కి, డిపార్ట్మెంట్ హెడ్ కి కబురు చేశారు. అందరూ అర్థగంట లో సమావేశమైనారు. ప్రిన్సిపాల్ చెప్పడం మొదలు పెట్టారు.అందరూ ఆయన మాటలు విన్న తర్వాత విద్యార్థి సంఘం నాయకులు వైపు చూసారు.
విద్యార్థి
సంఘం నాయకులలో ఒకరైన శ్యామ్ " రఘు తండ్రి సదాశివం నాకు బాగా తెలుసు. ఆయన
స్టేట్ బ్యాంక్ లో మానేజర్. నేను రఘు
తల్లి తండ్రిని తీసుకుని వస్తాను" అని బయటకు
వెళ్ళాడు. రఘు మరియు అతని స్నేహితులు మురళి, వాసుని పిలిపించారు. ఇప్పుడు ఆ
సమావేశ మందిరంలో నేను, నా కూతురు, ప్రిన్సిపల్, డీన్, హెడ్ ఆఫ్
డిపార్ట్మెంట్ , విద్యార్థి సంఘం నాయకులు వ్యాస్, శ్యామ్, సత్యం,
"ప్రేమించు అని వెంటబడటం నేరం. ఆ నేరానికి మన దేశం లో కఠినమైన చట్టాలు ఉన్నాయి. భారతదేశ చట్టాల ప్రకారం, ఒక అమ్మాయి అంగీకారం లేకుండా బలవంతంగా ఆమెని తాకి చిరాకు పెట్టి, గాయపరచినప్పుడు, భయాన్ని కలిగించినప్పుడు IPC సెక్షన్ 350, 354 ప్రకారం రెండు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పొందుతారు. యువకులు వయస్సు వేడి తో తప్పులు చేయడం సహజం. వాటిని ఎత్తి చూపినప్పుడు దిద్దుకోవాలి" అంటూ "అమ్మ నీల ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్పమ్మా"....అని నీల ను పిలిచాడు.
నీల లేచి దుఖంతో పూడుకుపోయిన గొంతు తో మాట్లాడటం మొదలు పెట్టింది. "మేము కాలేజ్ కి వచ్చింది మాకు మంచి భవిష్యత్తు కావాలని". "మీరే మమ్మల్ని ఆకర్షిస్తున్నారు అని మీ యువకులు అంటున్నారు". మేము మంచి బట్టలు వేసుకోవడం కూడా తప్పేనా? అది కూడా ఆకర్షించడమేనా! ఆకర్షణ ఉండటం కూడా తప్పేనా? మేము మాట్లాడటం కూడా తప్పేనా? నవ్వు లేకపోతే పొగరంటారు !!! నవ్వుతూ స్నేహభావం తో ఉంటే వెంటపడితే ఎలా? మీరు మా గురించి ఊహలు పెంచుకుని మమ్మల్ని మీ ఊహలకు బాధ్యులను చేస్తే ఎలా? "మేము వచ్చింది ఇక్కడకు చదువుకోవడానికి. ఈ సమాజంలో ఉన్నతులుగా బతకడానికి". మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే, ఇంట్లో ఉండకుండా బయటకు ఎందుకొచ్చారు అంటారు!! వళ్ళు చూపకుండా ముసుగు వేసుకోమంటారు!! వేళ్ళు , పాదాలు వాటికి కూడా ముసుగు వేయాలా? అవి కూడా ఆకర్షిస్తాయి కదా!!! కళ్లకు కూడా ముసుగు వెయ్యలా? అవి నిజాన్ని చెబుతాయి కదా!!! "రఘు దారి కాచి నా చెయ్యి పట్టుకుని నన్ను అవమానించాడు. ప్రేమించమని బలవంతం చేసాడు". ఏదో బాధ , భయం నన్ను వళ్లంతా కుదిపేస్తున్నాయి. నాకు వేలకొద్దీ ముల్లులు ఏకకాలంలో వళ్లంతా దిగబడినట్లు ఉంది !!! గునపంతో గట్టిగా గుండెల్లో పొడిచినట్లు ఉంది !! అని ఏడుస్తూ కూర్చున్నది.
నేను రఘు వైపు చూస్తూ చెప్పాను "మీరు యువకులు. ఆడపిల్ల బాధ తెలిసి ఉంటే వెంటపడేవారా?". "అమ్మాయి నో అని చెబితే అది ఎప్పటికీ నో అనే అర్థం". "ఎప్పుడో ఒకసారి ఒప్పుకుంటుంది అని వెంటబడటం వలన మీకే నష్టం. అమ్మాయిని నొప్పించిన వారు అవుతారు". అమ్మాయి మనస్సు లోలోతుల్లో కలిగే గాయం మంట పుట్టిస్తుంది. ఇప్పటికే అడుగు తీసి అడుగు వేయాలంటే చుట్టూ చూడాల్సిందే ! ఎక్కడైనా షాప్ కి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకోవాలన్నా భయమే, ఎక్కడ కెమెరా పెట్టారో అని. ఎవరు ఎప్పుడు ముట్టుకుంటారో? ఎక్కడ తాకుతారో ? అని భయం. "ఇక హోలీ వస్తే చాలు మీ యువకులు హోలికాసురులు గా తయారవుతారు"....."కన్ను మూసి తెరిచేంతలో వద్దు వద్దంటున్నా ఎక్కడంటే అక్కడ తాకుతూ రంగులతో నింపుతారు"...చున్నీ పట్టుకుని లాగుతారు.....వానికి రాక్షస అనుభూతి !!! కాని అమ్మాయిలకు అది నరకం. ఆడపిల్లలు భయం భయంగా బతకాల్సినదేనా! చదువు సరే సరి! సంపాదన కోసం అడుగు బయట పెడితే! ఒకరంటారు ఇంట్లో జరుగుబాటు లేదేమో? కళ్ళతో సైగ చేస్తూ ....వస్తావా........ఇంకోకరు!!! అవసరమా? నేను ఒక లాయర్ గా ఉన్నత హోదాలో చెప్తున్నాను..చట్టాలు మన చుట్టాలు కాదు. భారతదేశ చట్టాల ప్రకారం, ఆమె చున్నీ పట్టుకుని ప్రయత్నపూరితంగా లాగినప్పుడు IPC సెక్షన్ 350 ప్రకారం అతను మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు. విష్ణుచక్రంలా చట్టం హొలికాసురులను దగ్నం చేస్తుంది. అలాగే భారతదేశ చట్టాల ప్రకారం, పని ప్రదేశాలలో కాని మరెక్కడైనా కానీ శృంగార పూర్వకంగా ఆమెను రమ్మని పిలిచినప్పుడు సెక్షన్ 354A, 509 ప్రకారం అతను మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను పొందుతాడు. POSH ఆక్ట్ ప్రకారం అతను మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ను పొందుతాడు. దోషులను చట్టం శిక్షిస్తుంది. ఇన్ని బాధల మధ్య చదువుకుని అమ్మాయిలు భవిష్యత్తు నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. మనం వారికి సహకరిద్దాం అని చెప్పి కూర్చున్నా.
విద్యార్థి సంఘం నాయకుడైన శ్యామ్ మాట్లాడుతూ "అమ్మాయిలు నాజూకుగా సున్నిత మనస్కులు గా ఉంటారు". "యువకులు అహంకారము తో అమ్మాయి మనస్సు గెలుచుకోవడానికి ప్రయత్నించకుండా వారి మనస్సు లోపలికి అంతర్గతంగా వెళ్ళడానికి అమ్మాయిలను స్పర్శించడం, శారీరకంగా వారిని కోరుకుంటూ వారి చేతులు పట్టుకోవడం చేస్తూ ఉంటారు". "సున్నిత మనస్కులు అయిన అమ్మాయిలు మానసికంగా కుమిలిపోతుంటారు". "ఇప్పుడు నడుస్తున్నది స్త్రీ శక్తి యుగం". అమ్మాయిలు కురుచ దుస్తుల్లో క్లీవేజ్ చూపిస్తూ బట్టలు ధరించడం మనం చూస్తూనే ఉన్నాము !! ఇప్పటి స్రీలు తమకు ఇష్టమైన బట్టలు దరించడాన్ని మహిళల పురోగతికి, సాధికారతకు చిహ్నంగా బావిస్తున్నారు. మహిళలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కోరుకుంటున్నారు. కుటుంబ నిర్ణయాలలో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది. "పురుషులుగా మనం వారి స్వేచ్ఛను అరికట్టడం అర్థరహితం. వారి నిర్ణయాలను మనం గౌరవించాలి" అని చెప్పాడు.
విద్యార్థి సంఘం నాయకురాలు సావిత్రి మాట్లాడుతూ......నేను మన కాలేజి లో గమనించాను ఆడపిల్లలు నడుస్తుంటే కాలు అడ్డం పెడతారు! పడితే వాడి ఒడిలో పడాలి! అందరి కళ్ళముందు మనం వాడి కోసం పడినట్లు ఉండాలని "పడ్డామే అనుకో" ఏమి తెలియనట్లు అరే పడ్డావా అంటూ వళ్ళంతా తడమాలని!!! చేతులు అడ్డం పెడతారు నడుస్తూ ఉంటే...మనం పడలేదని!!! లొంగదీయాలని? లోంగితే! ఇక లోకువ! లొంగామే అనుకో! అది ప్రేమ అనుకొన్నామే అనుకో? వాడిని మనమే ఆకర్షించినట్టు? వళ్ళు కొవ్వెక్కింది అంటారు వేరెవ్వరో? నిలబడ్డాం అనుకో ప్రేమ కోసం.....ఏదో సుఖం కోసం అంటారు? పారిపోయామా...మోసం చేసామంటారు? పారిపోయామని వదిలేశామని వేధింపులకు గురి చేస్తూ అంతర్జాలంలో పెడతారు. అందరికీ వాట్సాప్ లో సందేశం పెడతారు. మెయిల్ ఇస్తారు తెలిసిన వారికి తెలియని వారికి మన గురించి తప్పు తప్పుగా. "ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు మన మార్ఫెడ్ ఫోటోలు"..... "నాకు తెలిసి భారతదేశ చట్టం సెక్షన్ 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ 2000 ప్రకారం మార్ఫింగ్ నేరము. తప్పు చేసి పట్టుబడిన వారికి మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష తో పాటు అదనంగా ఐదు నుండి పది లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు". ఇన్ని బాధల మధ్య మా చదువులు మేము చూసుకుంటున్నాము. మా కుటుంబాలకు అండగా ఉండాలని అనుకుంటున్నాము....అన్నది.
డీన్ మాట్లాడుతూ ...."యువకులు దేశ సోఫానాలు...దేశ నిర్మాణానికి సారథులు. అటువంటి యువకులు ప్రేమ పేరుతో భవిష్యత్తును నాశనం చేసుకోకూడదు" అంటూ రఘు నాన్నగారితో "నీల తల్లి లాయర్ వీణ వెంకట్, నీల కోరిక ప్రకారం శిక్ష అమలు రఘు తల్లి తండ్రి కి అప్పగించమన్నారు..... ఇప్పుడు చెప్పండి.... మీ అబ్బాయికి మీరు ఏమి శిక్ష వేస్తారు?" అన్నారు. రఘు నాన్నగారు వెంటనే పైకి లేచే లోపల రఘు తల్లి రఘు దగ్గరకు వెళ్లి రఘుని ఆ చెంప ఈ చెంప వాయించడం ప్రారంభించింది. రఘు వెంటనే నిలువునా అమ్మ కాళ్లపై పడి తన తల్లి కాళ్ళు పట్టుకుని "నన్ను క్షమించు అమ్మా" అంటూ ఏడవడం మొదలు పెట్టాడు…...రఘు!!! అంటూ రఘు తండ్రి సదాశివం రఘుని పిలుస్తూ "ముందు నీవు ఆ అమ్మాయిని క్షమించమని అడుగు"... "ఆ అమ్మ నీ గురించి నీ భవిష్యత్తు గురించి ఆలోచించి పోలీస్ దగ్గరకు తీసుకుని పోయి నిన్ను అప్పగించకుండా మమ్మల్ని నీకు శిక్ష విధించమనింది" అంటూ....."అమ్మ మీరు కూడా మమ్మల్ని క్షమించండి"…..అంటూ నా ముందరకి వచ్చి తన రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ "నన్ను క్షమించండి" అన్నారు...నేను నా కూతురు నీల వైపు ప్రేమగా చూస్తూ అతనికి ప్రతి నమస్కారం చేస్తూ చిరునవ్వు నవ్వాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి