ఇహం పరం నీవై !!!
ప్రాణిని నేను నా ప్రాణం నీవు
పెదవులు నావైనా పలికే ప్రతి పదం నీవు
నడక నాదైనా నా నడత నీవు
ఊహలు నావైన ప్రతి ఊసు నీవే
కనులు నావైనా అవి చూపే కరుణ నీదే
పలికే కంఠం నాదైనా ఇచ్చే ఆఙ్ఞ నీదే
ఆశ నాదైన ఆశయం నీదే
నవ్వు నాదైన నా పెదవుల చివ్వరి చిరునవ్వు నీవు
మరువపు తోటలో మనమిరువరం
ఇహం పరం నీవై .............. కృష్ణా !!!
మరువపు తోటలో మనమిరువరం
ఇహం పరం నీవై .............. కృష్ణా !!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి