మీ పెంపకం మీద మీకు నమ్మకముందా ?
చిన్నా ఈ లెక్క ఎలావేసావు చక్కగా !
అమ్మా నేనే చేశా ....
నువ్వా అదెలా నాన్న !
అమ్మా నేనే చేసానమ్మా ......
మీ టీచర్ నేర్పిందా ?
లేదమ్మా నాకే వచ్చు .........
నీ పక్కన కూర్చునే దిశా చెప్పించిన్దా ?
కాదమ్మా నాకు వచ్చు .............
కాఫీ చేసావా విశాల్ నోట్స్ నుండి !
లేదమ్మా నేను సొంతంగా చేసా .....
చూడండి ఈ లెక్క తనే చేసానంటుంది ?
నిజం అమ్మా నేనే చేశా ............
అది ఎలా నాన్న !!!నిజం చెప్పు ?
నిజంగా చెప్తున్నా మరేమో ..........
నేను పుట్టగానే ఒకటోసారి మాథ్స్ అన్నా.
రెండోసారి మాథ్స్ అన్నా .
మూడోసారి మాథ్స్ అన్నా. హహహ !!!!! బలే బలే అమ్మ ఏప్రిల్ పూల్ ???
మరేమో అమ్మా మరి ...... నాకు మాథ్స్ అంటే ఇష్టం ...... మరి అమ్మా నీకు నేనంటే ఇష్టం లేదా .
అన్నిసార్లు నన్ను అడుగుతున్నావు నామీద నమ్మకంలేకుండా !!!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి