పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

పండూ.......

పండూ....... పూవుకు లేని తావి  భువికి లేని ఓపిక దివికి లేని మనస్సు గాలికి లేని ఓదార్పు నిప్పుకి లేని జ్వాల నీటికి లేని దాహం సూరీనికే లేని ఓజస్సు చందూరూనికే లేని చల్లదనం ఆమెకి లేని అందం అది నీదే సుమా !!!

కొంగ్రొత్త వేకువకై ప్రేమతో .......

   https://sanchika.com/kogrotta-vekuvakai-premato-dr-bh-poem/     నువ్వు ఎవ్వరినైనా ప్రేమిస్తున్నప్పుడు అలా.........ప్రేమిస్తున్నావని చెప్పక దాచడం అది ప్రేమకు ఉరి లాంటిదేనని నీకు తెలుసా ప్రియతమా.....కృష్ణా నువ్వు చెప్పావని ఆ ప్రేమ కరిగి నీదౌతుందని కోరుకోవడం తప్పేనని నీకు తెలియదా రాధా!!!      అమావాస్యనాడు వెన్నెల లేదని  వెన్నెలకాడు పౌర్ణమినాట తిరిగిరాడని నీవు నాతో గిల్లికజ్జలెట్టుకొని చెప్పడం నీకు తగునా కన్నయ్యా... నీ హృదయాన్ని  పరిచి నువ్వు స్వాగతించినప్పుడు నిన్ను తృణీకరించి కొంగ్రొత్త వెలుగులపై నే పయనిస్తుంటే బిడుస్సువారిన మనస్సు పై నీకెందుకు వలపు ప్రియ.....  రాధా ... ఓ నా మనోహరిణి నక్షత్రపు వెలుగులు నాకై వేచిఉన్నాయని     తృణీకరింపు  సెగలను తుడిచివేసి   కొంగ్రొత్త వేకువకై  ప్రేమతో ఎదురు చూస్తా యుగాన్తందాటి నా చెలికాడా ............ నల్లనయ్యా !!!!

మీ పెంపకం మీద మీకు నమ్మకముందా ?

చిన్నా ఈ లెక్క ఎలావేసావు చక్కగా ! అమ్మా నేనే చేశా   .... నువ్వా అదెలా నాన్న ! అమ్మా నేనే చేసానమ్మా ...... మీ టీచర్  నేర్పిందా ? లేదమ్మా నాకే వచ్చు ......... నీ  పక్కన   కూర్చునే  దిశా చెప్పించిన్దా ? కాదమ్మా నాకు వచ్చు ............. కాఫీ చేసావా విశాల్ నోట్స్  నుండి  ! లేదమ్మా నేను  సొంతంగా చేసా ..... చూడండి ఈ లెక్క తనే చేసానంటుంది ? నిజం అమ్మా నేనే చేశా ............  అది ఎలా నాన్న !!!నిజం చెప్పు ? నిజంగా చెప్తున్నా మరేమో ..........  నేను పుట్టగానే ఒకటోసారి మాథ్స్  అన్నా.  రెండోసారి మాథ్స్  అన్నా . మూడోసారి మాథ్స్  అన్నా.  హహహ !!!!! బలే బలే అమ్మ ఏప్రిల్ పూల్ ??? మరేమో అమ్మా మరి ...... నాకు మాథ్స్  అంటే ఇష్టం ...... మరి అమ్మా నీకు నేనంటే ఇష్టం లేదా . అన్నిసార్లు నన్ను   అడుగుతున్నావు  నామీద నమ్మకంలేకుండా !!!!