ఒక చిన్నారి ఆశయం

మనచుట్టు ఎంతోమంది ఎన్నెన్నో ఆశయాలు కలిగి ఉంటారు. కొంతమంది ధనాన్ని సంపాదించాలని, కొంతమంది సమాజంలొ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, రాజకీయ నాయకులు కావాలని, గొప్ప నాయకుడిగా ఎదగాలని, ఇంకొంతమంది శాస్త్రవేత్తలుగా ప్రఖ్యాతి సంపాదించాలని, నటులుగా, నాట్యకారులుగా, కళాకారులుగా, ఫాషన్ డిసైనర్లుగా, ఇంజినీర్లుగా ఎన్నెనో ఆశయాలు.   మరికొంతమంతి సాహసికులుగా పర్వతాలను అధిరోహించడం, సముద్ర ప్రయాణాలు చేయడం, క్రీడలలొ రాణించడాన్ని మనము చూస్తూనే ఉన్నాం.      

ప్రతి మనిషికి జీవితాన ఒక ఆశయం ఉండాలి. నా ఆశయం డాక్టర్ కావడం. నా చుట్టూ ఉన్న వ్యక్తులకు సహయం చేయడం.  వైద్యురాలిగా నా ప్రాంత ప్రజలకు, అసహాయకులకు సేవ చేసి నా వృత్తి ద్వారా గౌరవ ప్రఖ్యాతులు సంపాదించి నా కుటుంబానికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంపొందించడం నా ఆశయం.  అనారోగ్యంతో ఉన్నవారికి సేవచేయడంలోనే సంతోషం ఉందని నేను నమ్ముతాను. వారి శారీరక బాధలను నా వైద్యంతో నయం చేసి నేను ఆత్మసంతృప్తి పొందుతాను.  ఇనుమును కరిగించడానికి వేడి చేసినట్లు నేను నా మాటలతో వారికి స్వాంతన కలిగిస్తూ వారి శారీరక మానసిక అనారోగ్యాలను నా మందులతో నయం  చేస్తాను.            
   
ఆరోగ్యం లేని మనిషి ఏది సాదించలేడు.  వైద్యుడు దైవంతో సమానమని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు.    అన్ని దానాల్లోనికి ప్రాణదానం మిన్న అని అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుండేది. నవీన నాగరికత కారణంగా మనుష్యుల ఆహారపుటలవాట్లు, జీవనశైలిలొ ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకొంటున్నాయి.  శారీరక శ్రమ లేని జీవితానికి ఈనాటి యువతీ యువకులు  అలవాటుపడ్డారు.  జీవనశైలి మార్పుల కారణంగా హృదయ వ్యాదులు, చిన్నతనంలోనే నరాల సమస్యలు, రక్తపోటు, స్థూలకాయత  వంటి సమస్యలు వారిని వేదిస్తాయి. నాకు చిన్నతనం నుండి శారీరక ధర్మ శాస్త్రం, అనువంశికత, వ్యాధులు, గుండె జబ్బులు వంటి వాటిని గురించి పెద్దలతో  చర్పించి తెలుసుకోవడం చాలా ఇష్టం.  నేను వైద్యురాలిగా నా కళాశాల నుంచి  పట్టా పొందగానే ముందుగా కొద్ది రోజులు గ్రామీణ ప్రాంతాలలో సేవ చెయాలనుకొంటున్నాను.  ఆ తరువాత  హృదయ వ్యాధులకు, నరాల వ్యాధులకు సంబందించిన ఏదేని శాఖలలొ ప్రత్యేకమైన తర్పీదు తీసుకొని ప్రత్యక వైదురాలిగా ఎదుగుతాను. ఒక రోగి యొక్క రోగం తగ్గి సంపూర్ణ ఆరోగ్యవంతుడవ్వగానే అతని కంటిలో కనబడే ప్రశంసే నా ఆస్థి.        
 
నా జీవన ప్రగతి వైద్యురాలిగా పేదలకు, నిస్సహాయులకు, అనారోగ్యులకు సేవ చేయడంలోనే  ఉందని నేను భావిస్తున్నా.             

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ