కొత్త దుంఖపు తెరలు తెరచి............
కన్నులలో కలలు
ఆ కలలో నీవు
కన్నులకే జాగారం
నిద్దురలేక నీకు
జాగారం పాత
దుంఖపు తెరలు మూసివేసి
కొత్త దుంఖపు తెరలు తెరచి............పరచి
కాగితంపై నీ చేవ్రాలు
చిరిగిన నీ పాత నోటు పుస్తకాలు
నిన్ను వీడిన నీ చొక్కా గుండీ
దాచుకొన్నా పెద్ద పేరున్న బాంక్ లోని లాకర్లో
నా పొట్టి జెడనుంచి జారిన రోజా రేకులు
నే తిని పారేసిన పీచు మిఠాయి పొట్లాం
నాగుర్తుగా నీ గుండెల్లో
ప్రియ నేస్తమా !!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి