వనాన పండు వెన్నెలలా దినాన వెలుగురేఖలా

 
 నీ ఙ్ఞాపకం ఓనాడు
మంటలా మండుతుంటే

ఈనాడు నీ ఙ్ఞాపకం
స్మృతిలా వెలుగునిస్తోంది
వనాన పండు వెన్నెలలా
దినాన వెలుగురేఖలా

నా హృదయం నీ పరమైంది
నీ హృదయం నాకు వలైంది
వదలనంటోంది ఒక్క క్షణం
నాదో లోకం నీదో లోకం    

మేఘుని ఉరుముకి చంద్రుని అలక
కంటిపై కనుపాప అలక
పాయల్ పై పాదం అలక
కృష్ణునిపై రాధ అలక  
..ప్రియా నీ పై నా అలక..  
 
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ