ఆరాధన

 
 
చిన్న చిరు సవ్వడి నడిరేయినా
మనస్సు ఉలిక్కిపాటును అణచుకోలేక
తత్తరపడి తొందరపెట్టి
తలదిండుగా పెట్టుకొన్న అరచేయిని
గుండెలపైన ఉన్న చేయితో కలపి
కన్నుల మబ్బుల
తెరలను తొలగిస్తూ
కిటికీ తెరచాటున నిలబడి
నా నీడని చూసి నేనే ఉలిక్కిపడి
నన్ను తలచిన వారిని తలస్తూ
ఎవ్వరో ఎప్పుడో
నాకు పంపిన మేఘసందేశాన్ని
తీరికచేసుకొని ఈవేళ మేఘుడు నాకు వినిపిస్తుంటే
ఆరాధన లోని అమృతాన్ని ఆస్వాదిస్తూ
కన్నా వినిపిస్తుందా నా ఈ ఆలాపన ..........      
 
 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ