మాలపిల్ల

తోమాల నే కానా
ఆ శ్రీనివాసుని హృదయానా  
పూమాల నే కానా

చిన్నికృష్ణుని కంఠాన
మాల మాల అంటూ
మాలోని మమతలను చూడరేమి
తెలుగునేల మీద నడయాడే
చంపకమాల  నే కానా !
సరిగమల సవ్వడి లోని
గీతమాలని నే కానా !!
తెలుగుపిల్ల కొప్పులోని 
మల్లెమాల నే కానా !!! 
మాలపిల్ల నంటూ వేలెత్తి చూపుతారేమి
నా మేని  సొగస్సులు   వజ్రాల మాల మెరుపులు
నాలో నిధి  తులశిమాల పవిత్రతా  
నా అంతరాన   స్పటిక మాల చల్లదనం  
పిల్ల గాలి లోని తెమ్మెరను నేనే....
పూలల్లోని తేనెలూరే మాథుర్యాన్ని నేనే .......
మీ హృదయాన్ని ఏలే దాసాదిదాసిని నేనే .............   
అమ్మ పాలు చీకే బోసినవ్వుల పసిపాప   
పెదవుల కొసన నిలచిన చివ్వరి అమృతపు బొట్టుని నేనే ...........  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవిలో తోడేలుగా పుట్టడం మేలు

కలల సౌధాలు

కోరుకున్నా కోరిక పొద్దుకోసం చూస్తూ