నా జీవితం నాకు తిరిగి కావాలి sent to vihanga
పెళ్ళి
గురించి, నాకు కాబోయే భర్త గురించి అందరూ అమ్మాయిల లాగే నేను ఎన్నెన్నో
కలలు కన్నాను. పచ్చని పందిరి లో వేద మంత్రాల సాక్షిగా, పారాణి కాళ్ళతో
పసుపు బట్టలతో నేను అతను ఒకటవ్వాలని, చిన్నతనం నుంచి పుట్ట పుట్ట కి పాలు
పోసి ఆ నాగ దేవత ని ప్రార్థించే దాన్ని మంచి మొగుడు రావాలని. కార్తీక మాసాన
చన్నీళ్ళ స్నానం, కటిక అమావాస్య రాత్రుల్లో శివారాధన, వేకువజామున
విష్ణు పూజలు, నవగ్రహారాధన, వ్రతాలు ఎన్నో.
అమ్మమ్మ
చెప్పేది నీ పూజలు వృధా కావు, నీ కోసం రాకుమారుడు ఎక్కడో ఎప్పుడో పుట్టి
ఉంటాడు అని. అందరూ చక్కగా క్లాస్ పుస్తకాలు చదువుతుంటే నేను విష్ణు
సహస్రనామాలు చదివేదాన్ని. ఆరోజు రానే వచ్చింది. అతను రావడం నన్ను చూడటం
నేను నచ్చానని నన్నే పెళ్లాడతానని అన్నప్పుడు నాకు ఎంతో గర్వంగా
అనిపించింది. ఆ పెళ్ళి ముహూర్తం కోసం ఎదురుచూడసాగాను.
మా
పెళ్ళి ఎంతో ఘనంగా జరిగింది. నాతో చదువుకున్న నా స్నేహితులు నా పెళ్ళికి
వచ్చినప్పుడు నేను, నా భర్తని ఎంతో గొప్పగా వాళ్ళకి పరిచయం చేశాను. మా
పెళ్ళి ముచ్చట్లు అయిపోయిన వెంటనే మా ఆయన నన్ను కాపురానికి తీసుకుని
వెళ్ళాడు. అందరు నన్ను ఎంతో అదృష్టవంతురాలివి అంటూ పొగుడుతుంటే నా మనస్సు
పొంగిపోయేది. నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మా అత్త మామ నాతో
ప్రేమగా లేకపోయినా, మా ఆయన మంచివాడు కదా అనుకునేదాన్ని.
మా
పెళ్ళై మూడు వసంతాలు పూర్తికాకముందే ఇద్దరు పిల్లల తల్లిని అయ్యాను. అమ్మా
వాళ్ళ ఇంట్లో ఉన్న నన్ను మా ఆయన అప్పుడప్పుడు చూసి వెళ్ళేవాడు. అతని రాక
నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఉన్నట్టుండి అతను గత ఆరు మాసాల నుంచి
పూర్తిగా రావడం మానేసాడు. నా మనస్సులో ఏదో గుబులు. అమ్మమ్మతో ఏడుస్తూ నాకు
మా ఆయన్ని చూడాలని ఉందని చెప్పాను.
నాన్న
ఆ రోజు అతని దగ్గర నుండి వార్తను తెస్తాడని ఎదురుచూస్తున్నాను. నాన్న
మొహంలో ఏదో దిగులు. అమ్మ తరచి తరచి అడిగితే మన
అమ్మాయిని అతను ఇష్టం లేకుండా
పెద్దల బలవంతం మీద పెళ్లి చేసుకున్నానని, తనని కాపురానికి తీసుకెళ్ళడం
ఇష్టం లేదని చెప్పాడు అని చెప్పారు. అమ్మ గొల్లున ఏడవడం మొదలు పెట్టింది.
నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. పిల్లలిద్దరినీ చూస్తూ కూర్చున్నాను. నాన్న
నెమ్మదిగా అతను తన ఆఫీసులో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని
చెప్పాడు. చదువు రాని గొడ్డును తనకు కట్టబెట్టారని ఎగతాళి చేసాడు
అని అమ్మమ్మ
బాధపడుతూ చెప్పింది.
అమ్మమ్మ
రాయబారాలతో అతను నన్నూ నా పిల్లలను పోషించడానికి అతని "ఇంకో భార్యతో"
సమంగా నన్ను చూడడానికి ఒప్పుకున్నాడని అందరూ ఎంతో ఆనందపడ్డారు.
ఆ........యనను ఎంతో మంచివాడు మనస్సున్నవాడని పొగిడారు. ఎక్కడ నేను వాళ్లకు
భారం అవుతాననో నెమ్మదిగా భారం దించుకున్నారు.
నా
మనస్సు రాయిగా చేసుకుని అతనితో కాపురానికెళ్ళాను. హూ.....పిల్లలిద్దరినీ
మంచి స్కూల్లో వేసాడు. అనుకోకుండా ఒకరోజు "ఆ భార్యని" ఇంటికి తీసుకొచ్చి
పరిచయం చేసాడు. ఆమె నన్ను ఎంతో ప్రేమతో పలకరించి పిల్లలిద్దరికీ
చాక్లెట్లు, కొత్త బట్టలు ఇవ్వగానే పిల్లలు మాలిమి అయ్యి అప్పుడే పిన్ని అని
పిలవడం మొదలుపెట్టారు. నాకు ఒక్కసారిగా భూమి బ్రద్దలు అయ్యి పాతాళంలోకి
నన్ను తీసుకొని వెళితే బాగుండు అని అనిపించింది . ఆవిడ ఎంతో ప్రేమతో నన్ను తన
ఇంటికి ఆహ్వానించింది.
మా ఆయన ఆ రోజు రాత్రి ప్రేమగా నాతో మసలి "ఆమెది ఎంతో మంచి మనస్సు, ఆమె నేను లేకపోతే బ్రతకలేను అన్నది అందుకే పెళ్ళాడానని అంటూ, నిన్ను మోసం చెయ్యను, పిల్లల మీద ఒట్టు అని ప్రామిస్ చేసాడు. ఆమె తన రెండో భార్య మాత్రమేనని, తన వారసులు నా పిల్లలేనంటూ నన్ను దగ్గరికి తీసుకుని ఆమెకు నెలలు నిండాయి, ఆమె పుట్టింట్లో పురుడు పోయరని, ఈ పెళ్ళి వాళ్ళకి ఇష్టం లేదని చెబుతూ, నువ్వు తనకి ఈ కష్ట సమయంలో తోడుగా ఉండాలని కోరాడు". కాదనలేను. ఎదురుగా నా పిల్లల జీవితం. చదువులేని నేను వాళ్ళని ఎలా పోషించగలను.
నా స్నేహితులు చదువులు పూర్తి చేసి, పెళ్లిళ్లు చేసుకొని, తమ చదువుకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ తమ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. నేను చేసిన కార్తీక పూజలు, గౌరీవ్రతము, వెయ్యిన్నొక్క దీపారాధనలు నన్ను వేరొకరితో నా ప్రేమను పంచుకోమన్నాయి. ఎవరు మంచి, ఎవ్వరు చెడు. నా కాళ్ళపై నేను నిలబడాలి. నా జీవితం నాకు తిరిగి కావాలి.
కథ బాగుంది కానీండి, మరీ కామెడీ గా ఉంది, గౌరీ వ్రతానికి ఈ రెండో పెళ్ళికి ఎక్కడో బెడిసి కొడుతోందేమో?
రిప్లయితొలగించండిజీవితం మళ్లీ వస్తే ఏం చేస్తుంది? తన కాళ్ల మీద తను నిలబడుతుందా? నాకు అనుమానమే!
రిప్లయితొలగించండిఆ నిలబడేదేదో ఇప్పుడే చేయచ్చుగా? సుఖం గా ఉండి, పిల్లలకి మంచి స్కూల్స్.. భర్త డబ్బు తో కావాలని చేసుకున్న కాంప్రమైజ్? చదువు లేని వాళ్లు, ఏ ఆసరా లేని వాళ్లు లోకం లో బోల్డు మంది బతకట్లేదా?
nothing more to say.. after the above comment.. totally agreed..
రిప్లయితొలగించండిఆ నిలబడేదేదో ఇప్పుడే చేయచ్చుగా? సుఖం గా ఉండి, పిల్లలకి మంచి స్కూల్స్.. భర్త డబ్బు తో కావాలని చేసుకున్న కాంప్రమైజ్? చదువు లేని వాళ్లు, ఏ ఆసరా లేని వాళ్లు లోకం లో బోల్డు మంది బతకట్లేదా?
I too agree with u .....ఆమె ఆ పంజరంలోనుండి బయటపడడానికి ప్రయత్నం చెయ్యాలి కదా మరి...........పిరికిజీవితం.
రిప్లయితొలగించండిఅందరికీ మంచి జీవితం కావాలి
రిప్లయితొలగించండి.... కాని దాని కోసం యేం చెయ్యాలో చాలా మందికి తెలియదు
కొందరికి యేం చేస్తే ఇంకా బాగుండొచ్చో కొంచెం అవగాహన ఉంటుంది
..... కాని అలా చేసేందుకు చాలామందికి ధైర్యం ఉండదు.
అతి కొద్దిమందికి బాగుపడటానికి తెగించగల ధైర్యం ఉంటుంది
...... కాని అరుదుగా కాని అలాంటి అవకాశం యెవరికీ రాదు
కాని, జీవితంలో మోసగాళ్ళకు మాత్రం భలే అవకాశాలొస్తాయి
తమాషా యేమిటంటే ఒక సారి మోసపోయిన వాళ్ళే
తరచుగా మళ్ళీ మళ్ళీ మోసపోయే వాళ్ళు
మళ్ళీ మళ్ళీ మోసగించే వాళ్ళు
ఇది బాగా తెలిసిన వాళ్ళు.
కాని నమ్మినవాడు మోసగిస్తే కలిగే బాధని మాటలతో చెప్పగలమా
రిప్లయితొలగించండిసూదులతో చిల్లులు పడిన ఆ గుండెని జీవితమంతా మోస్తూ తిరగాల్సిందే
పెదాలమీద చిక్కని నవ్వుని పులుముకొని ...............